Evaru Telangana Drohulu?
News pulse, Politics | admin | December 23, 2010 at 2:44 pm
తెలంగాణ కొరకు తెలంగాణ ప్రజలు పోరాడినప్పుడల్లా తెలంగాణ ప్రజలు అంతవరదాక తాము పొందుతున్న సౌకర్యాలల్లోనుండి కొన్ని కోల్పోయిన చరిత్రే ఉంది గాని పొందిన ప్రయోజనం మాత్రం ఏమీ జరుగలేదు అనేది చరిత్ర చెప్పుతున్న సంగతి. ఇప్పుడుకూడా ప్రజలు ఇంత ఆరాటం తో ఆవేదనతో తెలంగానకోరకు తమకు తోచిన పద్దతుల్లో , రాజకీయ పార్టీలు ఇచ్చిన పోరాట రూపాలల్లో లక్షల సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ,సంఘటిత శక్తిని తెలుపుతుంటే, తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ డిమాండ్ తో సంబంధం లేని విషయాన్ని తెరమీదకు తెచ్చి నానా యాగీ చేస్తారు. ఉప ఎన్నికల్లో KCR 2లక్షల మెజారిటీ గెలిచినప్పుడు అంత పెద్ద విషయాన్ని, అంత ప్రజాప్రాధాన్యతా గలిగిన విషయాన్ని చర్చనీయ విషయం కాకుండా అప్పటి రాజశేకర్ రెడ్డి సర్కారు ఖమ్మం జిల్లాలో కాల్పులు జరిపి 9 మందిని బలి దీసుకొని ఆ ఉపఎన్నిక విషయాన్ని చర్చల్లో లేకుండా చేసినారు. మొన్నటికి మొన్న 2010 ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా తెలంగాణ వాణిని ప్రపంచానికి తెలియ చెప్పి తెలంగాణలో ప్రజలు ఎంత బలంగా తెలంగాణ కావాలని కోరుతున్నారో చూడండి అని చెప్పడానికి సంసిద్ధ పడి ఉంటే కొత్తగా బాబ్లీ సమస్య ఆ రోజే పుట్టుకొనే వచ్చినట్టు చంద్ర బాబు బాబ్లీకి పయనం గట్టి తెలంగాణ ప్రజల దృష్టి అటు మళ్లించే ప్రయత్నం చేశాడు. ఒక వేల బాబు కోరుకౌన్నట్లు జరిగి ఉంటే చూడండి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకోవడం లేదని దుష్ప్రచారానికి దిగే వాడు. కానీ ఆ నక్క జిత్తుల నారా వారికి జరుగా వలసిన పరాభవం జరిగింది.
తీరా ఇప్పుడు ఒక వైపు శ్రీకృష్ణా కమిటీ రిపోర్ట్ రావడానికి సమయం దగ్గర పడ్డ సమయం లో రైతు సమస్యల పైన రాద్దాంతం చేస్తున్నాడు. రైతు సమస్యలు అంటే, తెలంగాణ లో ఈ సంవస్తారమ్ అతి వృస్టీ వలన పత్తి పంట కు విపరీతమయిన నస్టమ్ జరిగింది, మరి అప్పుడు ఎవ్వరూ మాట్లాడ లేదు. ప్రతి సంవస్తారం అనావృస్టీ వలన లక్షలాది ఎకరాలు సాగుబాటు కాకుండా బీడు భూములు గా మిగిలి పోతున్నాయి ,అప్పుడు ఒక్కరూ మాట్లాడరు, ఈ దేవేందర్ గౌడ్, ఈ ఎర్రబల్లి, లట్టయ్య, పొట్టయ్యా ఎవరయితే ఏంది మనకు ఈ తెలంగాణ నేతలు ఎక్కడ పోయినారో తెలియదు, అప్పుడు ఏమీ మాట్లాడని నేతలు,ఇప్పుడేమో అక్కడ నారా ఎక్కడ నారాజు అయితాడో అని పోటీబడి నాటకాల నిరసనలు , ప్రదర్శనలు చేస్తున్నారు.ఇది పక్కగా శ్రీకృష్ణ కమిటీ సీరియస్ నెస్ నూ, TRS 25 లక్షల మందితో చేసిన ప్రదర్హనను మరుగున పడేయడానికి ఆడుతున్న నాటకం అని ఈ తెలంగాణ తెలుగు దేశం నాయకులకు తెలియదందమా , లేక తెలిసీ ఈ నాటకానికి మద్దతు ఇస్తుంటే ఇంకా తెలంగాణ ప్రజలు వాళ్ళను సహిస్తారనుకుంటున్నారా ? వాళ్ళ అతితెలివికి పిటీ అనిపిస్తున్నది.
మరో వయిపు జగన్. ఆయన ఏకైక ఎజెండా తాను ముఖ్య మంత్రీ కావడం.ఆయన ముఖ్యమంత్రి అయితే స్వర్ణయుగం వస్తుందట.ప్రజలకు చెందవలసిన కోట్ల కోట్ల రూపాయలను తన స్వంతం జేసుకొని అలా స్వంతం చేసుకోవడానికి సహకరించిన వాళ్ళకే సవాలు విసిరి నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా చస్తారా అంటున్న సదరు యువ నాయకుడు తన జీవిత కాలం లో ఇంకా ఎన్నెన్ని కోట్ల ప్రజల ధనాన్ని తన స్వంతం చేసుకుంటాడో అందుకు ముఖ్య మంత్రి పదవి ఎంత అవసరమో ఆయనకు బాగా తెలుసు.సరే ఆయన కోర్కె ఆయనది, మనమేందుకు కా దందాము గాని ఈ తెలంగాణ నేతలే కొందరు తెలంగాణ వాదాన్ని పూర్వపక్షం చేసే వెధంగా జరుగుతున్న కార్యక్రమాల కు ఉరికురికి జగన్ జపం,చంద్రబాబు జపం చేస్తుంటే వీళ్ళు నిజంగా తెలంగాణ బిడ్డలెనా అని అనుమానం కలుగుతున్నది.
అటు చేంద్ర బాబు గానివ్వండి, ఇటు జగన్ కానివ్వండి మరో వైపు చిరంజీవి ,జయప్రకాష్ నారాయణ కానివ్వండి ఎవడైతే ఏంది అంతా తెలంగాణ వాదానికి అడ్డుగా నిలుస్తున్న వాళ్ళే, అటువంటి తెలంగాణ ద్రోహులకు తెలంగాణ గడ్డమీద పుట్టిన,లేదా తెలంగాణ మొగొనికి పుట్టిన ఏ కొడు కైనా మద్దతు ఇస్తాడా?
జై తెలంగాణ!
Courtesy – వీరగొని పెంటయ్య,
Related posts:
- Will Cong T politicians split?
- TDP challenges Jagan’s YSR Cong
- Asalu doshi Congress
- Jayasudha avoiding Jagan’s party?
- Does Chiru know poli ‘tricks’?
- Panthulla madhya chicchu
- Telangana increment – KCR
- T TDP politicians are Telangana Drohulu
- Is this the way SKC report was made (funny)
- Telangana Drohulu in hand drawn pics


Tweet This
Digg This
Save to delicious
Stumble it