Ekkada Paareskunnamoo Akkadney Vetthukovaleyy

News pulse, Politics | admin | January 22, 2011 at 6:11 pm


తెలంగాణా ఉద్యమం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి, కమిటీల చేతిలో పడి, ఇక లాభం లేదని మళ్లీ డొల్లు కుంటూ డొల్లు కుంటూ ప్రజల చేతిలో పడ్డది, ఈసారి కూడా విద్యార్థుల తోటే మొదలైంది, లాఠిలతో , బాష్ప వాయువులతో, రబ్బరు బుల్లెట్లతో , రక్తపు మరకలతో మలి ఉద్యమం మొదలైంది. ఇపుడు మల్లోక సారి చూస్తె , సంవత్సరం తరువాత కొద్దిగా మార్పులతో, చేర్పులతో, వీధి వీధిన టెంట్లు మోలిసినై , కొన్ని దీక్ష శిబిరాలు అప్పటినుంచే నడుస్తున్నాయి. నాయకులు లేని, స్వచ్చంద కార్యకర్తల శిబిరాలు. ఇక విశ్వ విద్యాలయాలు చూస్తె, పెద్ద పెద్ద విద్యార్తి నాయకులు పరీక్షలు రాయమని చెప్పితే, ఎప్పుడు పోరాటం చేసే విద్యార్థులే పరీక్షలు గిరిక్షలు రాయం అని నిర్ణయించారు. మేము పరీక్షలు రాస్తే ఉద్యమం నీరు గారి పోయిందని ప్రచారం జరుగుతదని మరొక సారి త్యాగాల బాట పట్టిన్రు . ఈసారి విద్యార్తుల బలహీనతలు బయటపడి, వీసీలు ఏమి మారలే, పరీక్షలు నడిపించిరు, మనవాళ్ళు రాయలేదు, వీరు ఎపుడు మీడియా లో కనపడరు, వినపడరు, దేబ్బలతోనో, కేసులతోనో, జైల్లోనో, ఆసుపత్రిలోనో, మనో వేదనతోనో ఏదో మూల పోరాట రూపాలను, ముందస్తు ప్రణాలికలను తయారు చేస్తుంటారు. వీరు చేసే పోరాటా ఫలితాలను చూసి అయినా రాజకీయ పార్టీల వైఖరి మారుతుందేమో అని ఆశ పడుతుంటారు మాలాంటి వాళ్ళు. ఏండ్లు మారుతున్నఇక్కడ ప్రజల తల రాతలు మర్తలేవు. అప్పటికి ఇప్పటికి ఆంధ్ర బుద్దులు, కేంద్ర వైఖరి, మన నాయకుల పోరాటం ఏమి మారలేదు, మారుతున్నదల్ల తరుగుతున్న తెలంగాణా సంపద, పెరుగుతున్న దోపిడీ, అలసి పోతున్నపోరాట జీవులు, స్వార్థం పెరుగుతున్న నాయకులు.

ఈసారి కాస్త నిమ్మలన్గున్నది , పోయిన సారి కనపడ్డ తీరొక్క జెండాలు అన్ని పోయి ఒకటి రెండు జెండాలకిందికి వచ్చినాయ్. ఒకటే గొంతు , జై భోలో తెలంగాణా అంటున్నాయి, గల్లి లీడర్లంత వారీ! ఇన్నోవాలల్ల తిరుగుతున్నారు, తేటగా అన్గిలేసి, బుజ్జి బుజ్జి బొజ్జలతో ముద్దు ముద్దుగున్నారు మా అన్నలు,తమ్ముళ్ళు, ఇంక ఇపుడు ఎన్నికల్ల నిలబడితే గెలుస్తారు. అవును, వారంతా నిజాయితి కొరకు నిలబడితే, అంత కన్న ఏమి కావాలె, ఉద్యమం అంటేనే నాయకులని తయారు చేస్తది, నాయకులు ఉద్యమాలని చేయరు, కాని ఒక్క మాటన్న, గిట్ల గాదె అన్న అంటివా, ఇంక నీపనిఅయిపోతది , ఒక్కరోజే , దేశ ద్రోహిఅయిపోయి, నానా మాటలంటారు పతోక్కడు. జర నిమ్మలంగ ఉండాలే అంతా , ఎన్నేన్డ్లో గదికూడా చెపితే బాగుంటది కాదన్నా? తెలంగాణా గడ్డ మీద పుడితేనే అదృష్టం లేక్కుంది, మా యవ్వ ఎపుడు బంగారు బాతే, అమ్మ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తారు కొడుకులు. చూస్తుంటే కాస్త ఒకడుగు జర ముందల బడ్డట్టే ఉంది. అయితే కేంద్రం వైపు చూస్తె, ఎప్పటిలేక్కనే దినామ్ చర్చలు, సంప్రదింపులు, ఒక దేశంగా విడిపోనీకి కూడ ఇంత కసరత్తు చేస్తరో లేదో, పిల్లిని ఎలుకని కూసోబెట్టి మాట్లాడతానంటారు వీల్లెట్ల నాయకులు, మంత్రులు అయింరో ఎవరికైనా సమజ్ అయిందా? అయితే వాళ్ళన్న బెకార్గాల్లు కావలె లేకపోతె వాల్లని నిలబెట్టిన మనమన్నా. ఇంకా ఆలోచించి, చించి , ఆలోచిన్చేస్తున్నారు చిదంబరం వారు, ఒక్క సారి మా పోరాగాల్లకి దొరికితే నీయబ్బ జీవితంల రాజకీయాల్లోకి పోకుండా దంచుతారు. ఏమి దేశం ఇది, ఎవడు రాజకీయాల్లో ఉండకూడదో వాడు అక్కడుంటాడు లంగాలు , దొంగలు అని మంచిగానే పేరు పెట్టినరు మావోల్లు, ఎవడు పోరాడతాడో వాడు జైల్ల ఉంటాడు. ఇంకింత ఆవేశం ఎక్కువుంటే అడవులల్ల నన్నా అమెరికాల, దుబాయ్ ల నన్నా ఉంటారు అనుకుంట.

ఇంకొక గమ్మతి ఏందంటే, మొన్న ‘చెద’అంబరం కి మా అన్ద్రోల్లు కమీన ‘కమిటీల’ ఎన్ని రకాలుగా పనికి రాని ముచ్చట్లు చెప్పిన్రో అన్ని రకాలుగా చెప్పిన్రంతా, మా కావూరి, లంగాపాటికి (విద్యార్తుల ముద్దుల పేరు) ఎప్పటిలేక్కనే ఆరో లెక్క అన్నడు, గది చెప్పనికి, ఇన్ని పైసలు కర్చు పెట్టి , ఇంత మందిని ఎందుకు చంపిన్రో ఎవనికి అర్థం కాదు, పానానికి వంద కోట్లు అడిగితె సక్కగైతారు హౌలే గాళ్ళు, అంత తక్కువా మా పానాలు? ఏదో మా సచ్చినోల్లకి వాళ్ళ జాగాలు అన్ని పంచితే పీడా పోతది, హర్ష వర్ధన్, కి హైదరాబాద్ కావాలంట, నిన్న మొన్నటిదా క మంచిగానే ఉన్నాడు , ఒక్కసారే ఏమి కరిచిందో తమ్మికి, ఒకటా రెండా ఎన్ని సంచులోచ్చినయే ? ఎట్లనో బొత్స ఝాన్సి , ఇంకొక శ్రీకాకుళం అక్క బాగానే మనకి తలూపింది . ఆడోల్లకన్న గోస అర్థం అయినట్టుంది. అవును కాదు అని చెప్పటానికి ఎన్నేండ్లు? ఎన్ని పానాలు? ఎన్ని పోరాటాలు? ఒక వైపు రాజకీయ నాయకుల చేతిలో ఉద్యమం ఉండాలని, మరో వైపు అధికార పార్టీల చేతిలో ఉండాలని ప్రజలను అటు గుంజుడు, ఇటు గుంజుడు, ఏడికి బోవాలె? ఊకే అందరం ఖాలీ చేసి ఎలుకొండిరా అని ఇచ్చి పోతం అక్క అని ఒక తమ్ముడు అంటుండు .

ఇపుడు కాకపొతే ఎప్పటికి రాదు, మల్ల ఎలక్షన్ల అంటే మాత్రం, అన్నోల్లనల్ల తన్నుడే అంటున్రు పిలగాండ్లు. ఎంత మంది అమ్ముడు బోయిన కూడ , పోరాటం ఆపేది లేదు అంటున్రు , వీళ్ళ మీదనే తెలంగాణా అంతా భరోసా పెట్టుకున్నదియాల. రాజకీయ చెదరంగాలు అయిపోయినాయి. రోడ్ల మీద జనం కాడికి వొచ్చిన ఉద్యమాన్ని సరిగ్గా నడిపి, జర కాక పుట్టే పనులు చేస్తేనే తెలంగాణా వస్తది లేకపోతె రాదు అని పెద్ద మనుసులు అంటున్రు. అంతా వెయిట్ అండ్ సి! ఇంత కన్న సస్పెన్స్ త్రిల్లెర్ ఎక్కడైనా ఉందా! వార్నర్ బ్రదర్స్ ఇంకేవరికన్నా చెపితే తెగబడి సినిమాలు తీస్తారు అన్ద్రోల్లు లేకుండా, తెలంగాణా అననీకి కూడ అన్ద్రోడే గావలంట, ఏమి గతి పట్టింది ఈ గడ్డ మీద, కలలకి, కళాకారులకి ఇల్లయిన ఈ గడ్డ మీద హీరోలు లేరు అంట, అన్ద్రోన్ని మూడుగంటలు ఎట్లా భరించాలే అని ఒక సారూ ఫోను గొల్లు గొల్లు మంటుండు , ఏమి చెప్పల్నో తెలవలే, ఏది చెప్తే ఏమయితదో లేక్కుంది ఇయాల రేపు. కలి కాలం సారూ!

ప్రజల దగ్గర ఉద్యమాలు నేర్చుకొని ప్రజలు చెప్పినట్టు రాజకీయ నాయకులు నడుచుకుంటే తెలంగానోస్తాది, ఒక దేవుడు కరుణించి మల్లోక మంచి దినం కోసం ఎదురు చూస్తె మాత్రం, సిన్మా నడుస్తనే ఉంటది.

జై తెలంగాణా!

Courtesy – Sujatha Surepally, thank you for sharing.

Related posts:

  1. Prajala chethila Telangana udyamam
  2. ‘Andhra’ bhavan arachakam
  3. Deeksha viraminchandi – KCR
  4. Ningi ki egasina Telangana keratam
  5. Jaya hoo Vimalakka
  6. Telangana Raktha Kanniru
  7. Chalo Assembly on Feb 21 – TSJAC
  8. Telangana Amaraveerulu
  9. New story ‘Jai Bolo Telangana’
  10. రగులుతున్న తెలంగాణా

Leave a Reply

Spam protection by WP Captcha-Free