Chalo Assembly on Feb 21 – TSJAC

News pulse, Politics | admin | February 20, 2011 at 6:30 pm



పోరు చరిత్ర వెచ్చని దేహం కింద
కన్ను తెరిచిన అగ్గిపిట్ట
పది కొమ్మలపై నుండి
చేస్తూన్న ఉద్యమం తెలంగాణా

కరపత్రం మొదలైంది ఇలా..ఇవాళ దాదాపు 13 సంఘాలు TSJAC గా ఏర్పడి ‘చలో అసెంబ్లీ’ కి పిలుపునిచ్చారు. ఇందులో (PDSU, TVV,SC,ST Vidhyarthi Sangham, CMS(Chaitanya Mahila Samakya),TVS(Telangana Vidhyarthi Sangham)GVS (Girirjana Vidhyarthy Sangham) PSF(Professional Students Forum, ASU(Adivasi Students Union, TVMS(Telangana Mahila Vidhyavanthula Sangham)SIO(Students Islamic Organisation)TSA(Telangana Students Association)DABMSA(Dalit Aadivasi Bahujana Miniority Students Association)BSF(Bahujan students Federation-BSP) KULSA(Kakatiya University Law Students Assocation, SUJAC(Satavahana University Joint Action Committee). ఇవాళ కరీంనగర్ లో టి యస్ జాక్ విద్యార్థులు కరపత్రం, పోస్టర్ విదుల చేసారు. శాతవాహన విద్యాలయంలో ఉద్యమ సందేశాల నడుమ, ఉద్యమ గీతాల నడుమ ఉద్విగ్నంగా జరిగింది వారి సదస్సు. ఎపుడైనా రాజకీయ నాయకులు లేని మీటింగ్లు ఇలాగే ఉంటాయి, లాభ ఆపేక్ష, స్వార్థం తో కాకుండా ఆశయం కోసం జరిగే అలుపెరుగని పోరాటాలు. తెలంగాణా ఈ ఉద్యమ ప్రయాణంలో మన భ్గాస్వమ్యమే జీవితానికి ఒక అర్థం..కాదంటారా?

ఒక వైపు రాజకీయ పార్టీ కి చెందిన విద్యార్ధి విభాగం చైతన్య యాత్ర, మరో వైపు తెరాస, మరే ఇతర రాజకీయ పార్టీకి కి సంబంధం లేకుండా, ఒక సైద్ధాంతిక అవగాహనా మీద ఉద్యమిస్తున్న విద్యార్తి సంఘాలు. మొన్న భవిషత్తు ప్రణాళిక పై చర్చ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ లో , అన్ని జాక్లు, నాయకులను పిలిచి విద్యార్థుల భావిష్యత్హు పోరాటం గురించి చర్చించారు. ఇప్పటికైన, ఎప్పటికైన ప్రజా సంఘాలను కలిపేది విద్యార్థులే, రాజకీయ నాయకులపై వత్తిడి తెచ్చేది కూడ విద్యార్తి పోరాటాలే. అయితే, ఎపుడు వీరిని మీడియా పెద్దగా పట్టించుకోదు, ఉస్మానియా లో ఉద్యమ మంటలు నలు వైపులా అంటుకోవడానికి మానుకొటలో తెలంగాణా పౌరుషం చూపించింది ఇదే ఉద్యమ శక్తులు, నేడు రచ్చ బండను రచ్చరచ్చ చేస్తుంది కూడా వీరే, పరిక్షలు బహిష్కరించి రోడ్డున పడ్డదీ ఏ త్యాగ మూర్తులే, తమ భవిష్యత్తు ను ఫణంగా పెట్టి, నిత్యం హింసను ఎదుర్కునేది వీరే. పైనుంచి ఆర్డర్ లు లేకుండా, స్వతంత్రంగా ఉద్యమానికి ఆజ్యం పోసేది కూడ వీరి పని, పోయిన సంవత్సరం ఇదే అసెంబ్లీ ముట్టడి పిలుపులో యాదయ్య అగ్నికి ఆహుతి అయిన జ్ఞాపకం ఇంక తడి ఆరలేదు..అక్కా, మీ యునివర్సిటీ కి వస్తున్నాం అని ఫోన్ వచ్చిన వెంటనే ఎక్కడో ఒక చిన్న భయం, ఒక చిన్న ఆశ, వీరు స్వతంత్రంగా అడుగులు వేస్తున్నారు, ఎవరు వీరికి అండగా ఉంటారు? మన అనుకున్న పార్టీలు, ప్రముఖులు వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉంటారు. ఒక విద్యార్తి మనకు ఆప్తుడు అయితే మరొక విద్యార్తి మనకు శత్రువు, చెపితే వినని వాడు, దేనికి అమ్ముడు పోనీ వాడు..ఎం చేద్దాం..రాజకీయ పార్టీలో లేక పొతే వీడు ‘వాడే’, పొలిసు వాళ్ళా పహారా, ఆరా మొదలు..ఒకడెవడినొ మన నాయకులు కొంటారు, పాపం వాడు అమ్ముడు పోతాడు, అంటే, మిగిలిన విద్యార్థులు అంతా అమ్ముడు పోయారనే ప్రచారం జరుగుతుంది. ఆశలు విద్యార్తి నాయకులని చెడ గొట్టిన వాడిని, చిచ్చు పెట్టిన వాడిని మనం పట్టించుకోము, పైగా అందరు విద్యార్థులు అంతే అనే కాడికి వస్తం. ఏది ఏమైనా, రేపు బడ్జెట్ సమావేశంలో బిల్లు పెట్టాలనే డిమాండుతో కదుల్తున్నారు వీరు. కరపత్రంలో పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని ఎలా వాడుకోన్నారో రాసారు. చిదంబరం మోసం, కపట రాజకీయ నాయకుల అసలు స్వరూపం. ఆక్రోశం, ఆశ , పట్టుదలతో ఉన్న అక్షరాలు. ఎవరిని కదిలించవు చెప్పుండ్రి. అన్నా! ప్రస్తుతం నువ్వు ఎవరు అన్నది కాదు ఇక్కడ ముఖ్యం, నువ్వు ఏమ్చేస్తున్నావు అన్నది ముఖ్యం, నీ ప్రణాళిక, నీ నిబద్దత ముఖ్యం. నీకు అండగా అందరున్నారు, నీకు అందరుంటారు, నిజాయితినే కాపాడుతుంది. ఇదే చరిత్ర, ఇదే సత్యం, ఇంతకు మించి లోకంలో లెక్కలు లేవు . ఇక్కడ ఈ విద్యార్థులు రెండు బాచ్ లు గా విడిపోయి తమ కార్య చరణ ని అన్ని కాలేజీలకు, విశ్వ విద్యాలయాలకు వివరిస్తూ, విద్యార్థులను కలుపుకొని పోతున్నారు. హంగు ఆర్బాటాలు లేవు, తినడానికి, ప్రయాణానికి ఖర్చులు లేవు, రాజకీయ పార్టీల తో లేకుంటే ఇవాళ నువ్వు ఒక నిషిద్ద వ్యక్తివి, సంస్తవి..నువ్వు ద్రోహివి, చెడగొట్టే వాడివి, ఇది బలంగా నాటుకు పోయిన మరో సత్యం. ఏది ఏమైనా, ఇపుడు తెలంగాణా ఉద్యమం ఒక వ్యక్తీ చేతిలోనో, పార్టీ చేతిలోనో ఉందనుకోవడం పొరపాటు, ఉండడం కూడ అంతా మంచిది కాదు, అది కూడ రాజకీయ నాయకుల చేతిలో, ప్రజలుగా ఉద్యమిస్తూ రాజకీయ నాయకుల తో కలిసి పనిచేయడం ఉత్తమం. రేపు ఉద్యమం ఆటు పోట్లకు గురి అయిన కూడ ఒక సెక్షన్ బతికే ఉంటుంది. అట్లనే అరవై తొమ్మిది నుండి నడుస్తుంది .

విద్యార్థులు ఇక్కడ కలవని రాజకీయ పార్టీలను వీరు బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఆత్మ హత్యలు చేసుకుంటే శత్రువు గెలుస్తాడు, మనం ఒడి పోతం , ఒక వైపు సిఎం పర్యటన ఉద్రిక్తంగా మారుతుంది, KU విద్యార్థులను ముందస్తుగా అర్రెస్ట్ చేసారు. కరీంనగర్ లో కూడా CM ప్రచారం ఉంది. ఇప్పటికైనా విద్యార్థులు గట్టిగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. రచ్చబండ వద్దు అన్న కూడా కొంత మంది ‘మన’ నాయకులు కాంగ్రెస్ పార్టీ తో ఏకమై ఏదో సంపాదిచుకుందాం అని చూస్తున్నారు. ఎంతైనా వరంగల్లు వీర తెలంగాణా కి సింబల్ గా నిలిచి పోయింది. అక్కడ చం ని భయ పెడుతున్నారు. అవును, అందరు ఒక తాటి రావాలే కాని విడిగా విద్యార్థులను విడ కొట్ట కూడదు అని కోరారు. అవును ఎవరు చేస్తే ఏందీ? మనకి కావలసింది జర కాక పుట్టే పనులు, అది ఎలాగు సహాయక నిరాకరణ కార్యక్రమంలో తేలి పోతుందీ. అయితే విద్యార్థులుగా వీరు మళ్లీ కలిసి పోవాలని చూస్తున్నారు. అన్ని పార్టీల వాల్లని కలిసి రమ్మంటున్నారు, రాకపోతే , విద్యార్థులకి మద్దతు ఇవ్వకపోతే ద్రోహులుగా పరిగానిస్తం అంటున్నారు .. అది చాల ముఖ్య విషయం, మన రాజకీయ నాయకుల సిగ్గు లేని తనం చూస్తె ఏమి అనాలో కూడ అర్త్ర్హం కాదు, ఎట్లా వర్నిన్చాల్నో కూడా తెలుస్తలేదు. రోజుకు ఒకరో ఇద్దరో చస్తూనే ఉన్నారు, అయిన మన ప్రవర్తనలో పెద్ద మార్పు ఉండదు, ఆజ్ మరే తో కల్ దూస్ రా దిన్..ఎవడు చస్తే ఏందీ, నా రాజకీయాలు నాకు..

తెలంగాణా ఉద్యమం అంటే తెరాస లేదా కెసిఆర్ అనే పదం తరచూ వినిపిస్తుంది. ఇది తప్పు అని చాల కొద్ది మందికి మాత్రమె తెలుసు, తెలంగాణా ప్రజల ఉద్యమం, టి అర ఎస్ ఒక రాజ కీయ పార్టీ, పార్టీగా తెలంగాణా కొరకు ముందుకు పోతుందీ.. సడెన్ గా ఎక్కడో ఒక చిన్న ఆశతో నిండిన వార్త, ఇంక పార్లమెంటులో టి బిల్లు పెడతారని అందుకే చిరంజీవిని కలుపుకున్నారు అని, మే బి , బట్ ఐ డోంట్ నో..కాంగ్రెస్ కి అంతా బుద్ధి వస్తుందా..టి ఆర్ ఎస్ విలీనం కమ్మని అడిగితె , పరిణామాలు ఎలా ఉంటాయి? ఎనీ వే, రోజులు దగ్గర బడుతున్నాయ్, మనం ఆచి తూచి అడుగులు వేయాలి. ఇవాళ కన్నుల పండుగగా రచ్చ బండ నిరసన ప్రదర్శనలు, ఎడ్ల బండ్లు, ముండ్ల కంపలు, టైర్లు, కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, ఎద్దులు , ఆవులు అన్నింటితో రోడ్డుకు అడ్డం పడి నిరసనలు.. ఎక్కడివి ఈ పోరాట రూపాలు? ఏ పుస్తకం లో దొరుకుతాయి, ఎక్కడివి ఈ త్యాగాల బాటలు ఏ చరిత్రలో కనపడతాయి, ఇంతెత్తు నడుస్తున్న ఉద్యమాన్ని సరిగ్గా మలుచు కొక పోవడం కేవలం నాయకత్వ లోపమే.. అయిన పరవాలేదు, ప్రజలందరికి ఒక్క విషయం తెలుసు, తెల్ల ఖద్దరు చొక్కలతోటి ఉద్యమాలు రావు, రాజకీయ నాయకుల వాక్చాతుర్యంతో కూడ తెలంగాణా రాదు, సిదిలమైతున్న తెలంగాణా బతుకు చిత్రం మార్చేది కేవలం ప్రజలు, కళా కారులు, ఉద్యమ కారులు, నిస్వార్థ పోరాటం, అదే అందరిని కట్టి పడేసే మంత్రం.

విద్యార్థుల ఈ ప్రయత్నానికి అందరం పార్టీల కతీతంగా మద్దతు తెలుపుతం. మిత్ర్లందరికి ఒక విన్నపం, మనమందరం ప్రజల పక్షాన నిలబడం, విద్యార్తుల పక్షాన నిలబడదాం. వీలైనంత సహాయం చేద్దాం.

పోయిన సారి విద్యార్థుల పాదయత్రకి మిత్రులు సహాయం చేసారు, ఈ సారి కూడా మన వంతు సహాయంగా ఏదైనా చేద్దాం.. శాతవాహన విద్యార్తులకి 600 టీ షర్ట్స్ కావాలని కోరారు, ఇక ముందు చలో అసెంబ్లీ కి ముందు గానే హైదరాబాద్ చేరుకోవాలి కాబట్టి కొంచెం ఆర్ధిక సహాయం కూడ అవసరం..కనీసం ఒక టీం లాగా ముందుకు వస్తే మనము కూడ ఏదైనా చేయొచ్చు.

త్యాగాల తెలంగాణా! నా తెలంగాణా! ఇపుడు రాని తెలంగాణా మనకి అవసరం లేదు, ఇంత ఉద్యమం వృధా కాకుండా చూసే బాద్యత మనందరిది.
విద్యార్తులు పిలుస్తున్నారు..
అరవ సంవత్సరాల దోపిడీ చాలు…రెండు సంధర్బాల ద్రోహం చాలు…ఇక భరించేది లేదు..ఉద్యమిద్దాం రండి..చలో అసెంబ్లీ భాద్యతను పంచుకోండి..

Courtesy – Sujatha Surepally, thank you for sharing.

Related posts:

  1. TSJAC, ABVP chalk out protest programmes
  2. Resignations are not valid – Assembly Speaker
  3. Ningi ki egasina Telangana keratam
  4. Nara Lokesh into active politics
  5. What did the Governor tell the center?
  6. ఎవరక్కడ …రా(ణి)జు గారి ఆజ్ఞ!
  7. Ekkada Paareskunnamoo Akkadney Vetthukovaleyy
  8. ABVP’s chalo OU gets huge response
  9. రగులుతున్న తెలంగాణా
  10. తెలంగాణ అమరవీరులకు జోహార్లు: జై తెలంగాణ

Leave a Reply

Spam protection by WP Captcha-Free