Rayini Goodem, nippu ravvalu
News pulse, Politics | admin | February 13, 2011 at 6:23 am“రాయిని గూడెం” ! ఉద్యమ రవ్వలు !!!
——————————————
కప్పం కోసం, కత్తుల కవాతు నడిపిన
సామ్రాజ్యవాద రాజుని, ఊరవతలికి తరిమిన
‘తెలంగాణ’ ఆత్మగౌరవ ప్రతీకలైన
సమ్మక్క సారలమ్మ వారసులు వాళ్ళు !
బతుకులు చల్లగుండాలని, అమ్మలకు నిలువెత్తు
‘బంగారం’ మొక్కే ‘అబలలు’ వాళ్ళు !
నెలల ముంగటనే ‘పోరుగడ్డ’ ను
పోలీసు బందికాన చేసిన ‘సజ్జనార్’ డయ్యర్ల
నిర్బంధాన్ని నిలువునా బద్దలుగొట్టిన
నిలువెత్తు ‘రాణి రుద్రమ్మలు’ !!
అధికారమదంతో బలిసిన ‘సీమాంధ్ర’ సర్కారుకు
ఒంట్ల వణుకు తెప్పించిన, నేటి పోరుబిడ్డలు !!
ఇనుప బూట్ల చప్పుళ్ళు, వేలాడే తుపాకులు
బలిసిన శరీరాల పోలీసులు
అధికార పార్టీ గుండాల ‘హస్త’దిగ్భందనాలు
గొంతెత్తిన ఆకాంక్షతో పటాపంచలు చేసిన
కాళోజిగడ్డ బిడ్డలు వాళ్ళు !!
గుండెలనిండా ఒకే శ్వాస ‘తెలంగాణ’
ఒకే ఆయుధం, ఒకే ఆశయం
‘జై తెలంగాణ’, ‘జై జై తెలంగాణ’
(చరిత్ర ఎరుగని నిర్బంధాన్ని లెక్కచేయక , సీమాంధ్ర ముఖ్యమంత్రికి బలవంతపు రచ్చబండలో వంకుపుట్టించి తరిమిన
నిప్పురవ్వలు ‘రాయిని గూడెం’ సమ్మక, సారలమ్మ వారసులైన అక్కలకు, అవ్వలకు, చెల్లెళ్ళకు ఉద్యమ వందనాలతో’ )
Courtesy – Vamshi Krishna, thank you for sharing.
Related posts:
- Will Coastal Andhra and Rayalseema be together?
- Emirates T Cultural Association santhapa sabha
- Jayashankar blessed me – Errabelli
- KK’s bheeshana keka
- T supporters pull mike from Revanth Reddy
- KCR and Prof. Kodandaram compromise
- What did KCR do for Telangana – Erraballi
- Panthulla madhya chicchu
- Is this the way SKC report was made (funny)
- తెలంగాణ అమరవీరులకు జోహార్లు: జై తెలంగాణ


Tweet This
Digg This
Save to delicious
Stumble it