ఎవరక్కడ …రా(ణి)జు గారి ఆజ్ఞ!

News pulse, Politics | admin | March 7, 2011 at 5:30 pm


ఇది ప్రజా స్వామ్యం ! ఎంతో కష్ట పడి సంపాదించుకున్నసంపూర్ణ స్వతంత్రం, ఇక్కడ హక్కులు పుష్కలం, ఎవడు ఎవడినైన ప్రశ్నించ వచ్చు, వాక్ స్వాతంత్ర్యం కలదు..న్యాయం నాలుగు పాదాలుగా నడచును.. మీ లార్డ్ ! ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తున్నార..వింటున్నారా..అయినా కూడ ఆశ్చర్య పోకుండా ఉన్నారా? నిజం నిప్పులాగా మండుతుంది కదా! అయ్యో ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారా..ఇప్పుడు మనం మాట్లాడుతుంది ప్రజల గురించి కాదు మహా ప్రభో ! ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల గురించి , వారి హక్కులు, బాద్యతలు గురించి, వారి వారి చిత్ర విచిత్ర ప్రవర్తనల గురించి! వీరు మనుషుల లేక మనిషి రూపములో నున్న (గుర్తిన్చనటువంటి) జంతువుల? ఎంత ఆశ్చర్యకరము? ఇక్కడి నాటకీయ పరిణామములు చూచి ఎంతో మంది మూర్చ పోవుటకు సిద్ధముగా ఉన్నారు, ముచ్చటగా మూడు ముక్కలలో మీకు వివరించెదను..

ఒకానొక దేశం, దాని పేరు భారత దేశం, మేడిపండు సామెత లెక్ఖ , బయట చాలా పేరు ఉండును కాని లోపట చూస్తె..అకటా! ఏమి చెప్పుదు..అక్కడ ఒక ప్రముఖ మైన పార్టీ, దాని పేరు కాంగ్రెస్, ఎంతో పెరున్నట్టుగా కనపడును కాని అంతా ‘అమ్మ’ దయ..ఆ అమ్మ ఎక్కడినుండో వచ్చి ఇక్కడ జులుం చేయును..అయినా ఇక్కడి నాయకులు అమ్మ ఆజ్ఞ శిరసా వహించుదురు..దేశం ఎటు పోయిన, అన్యాయం ఎన్ని పాదాల పై నడచినా..అమ్మ చేతిలోనే వారి ప్రాణాలు ఉండును..లోపట తెలంగాణా కోసం ఎంతో చేయాలని ఉండును కాని, అమ్మ మాట జవ దాట కూడదు కదా! అత్యంత న్యాయ మైన డిమాండ్, రాజ్యంగా బద్దమైన కోరిక కూడ కాల రాయును, ఇది ప్రజవామ్య ప్రబుత్వాలలో జరుగును..పదవిలోనే ప్రాణాలు, పరమార్థం, అమ్మ సేవ లోనే ఆఖరి ప్రాణం, ఇంత వరకు బాగానే ఉండును , రాత్రింబవళ్ళు పోరాడుతున్న ప్రజలు ఏమవును? నోరెత్తితే అరెస్ట్ చేసి జైలు లో పెట్టుము, అక్రమ కేసులు బనాయిన్చును, లేదా మాట్లాడకుండా నాలుగు పదవులు కాని, నాలుగు డబ్బు సంచులు కాని మొహాన పార వేయుము..ఇది కేవలం తెలంగాణా లోనే జరుగును, ఇక్కడ దొంగలు, వెన్నె ముక లేని వ్యక్తులు, గుండాలు, మంచి మనుషుల రూపంలో కన పదే రక్తం తాగే కసాయిలకు సీట్లు ఇవ్వబడును, వారు తెలంగాణా తెస్తమని చెప్పుదురు, మనం ఇనుదుము..ఇక్కడ కుల మతాలకి అతీతంగా, ప్రాంతాలకి అతీతంగా ప్రేమలున్డును..ఇంత భక్తి చూసి ఇంక మూర్చ పోక ఏమవుదుము..మేము మామూలు సామాన్య జనాలము ప్రభు!

ఇంక రెండో పార్టీ, తెలంగాణా కోసం పుట్టిన ఏకైక పార్టీ, ఇక్కడ అది నాయకుడు ఎంత చెపితే అంత తెలంగాణాల! నిన్నటికి నిన్న విద్యార్తులని ఏమార్చి, రాజకీయ పార్టీలు , పదవుల ఆశ చూపెట్టి, డబ్బు సంచులు, బండ్లు, ఇండ్లు చేరవేసి, వారి ఉద్యమ పటిమని పార్టీకి అనుగుణంగా మార్చి, విద్యార్థులు ఏ పిలుపు ఇచ్చినా , వీరు మాత్రం పాల్గొనకుండా చేయును, మాను కోత లాంటి సంఘటనలో కూడ మౌనంగా ఉండును, పోయిన సారి అసెంబ్లీ ముట్టడిలో గాని, మొన్నటి అసెంబ్లీ ముట్టడిలో గాని వీరికి సంబంధించిన విద్యార్తి నాయకులు మౌనంగా ఉండును, రాజు గారి ఆజ్ఞ! అత్యంత ప్రజా స్వామ్యం కదా..ఇవి నా మాటలు కాదు స్వామి! విద్యార్తి నాయకుల మాటలు, ఎవరైనా ఎపుడైనా తెలుసు కోవచ్చు, ఇందులో రహస్యం ఏమి లేదు, మా ప్రేమ అమరం, గుడ్డిది, పారవశ్యముతో కళ్ళు మూసుకొని పోవును అంతే! అంతటితో ఆగునా! లేదు ప్రజా సంఘాలు ఒక్కటై జాక్ గా ఏర్పడితే వాటిని కూడ పని చేయ కుండా చేయును..అక్కడ కూడా నేనే సుమా! ఇంక ఈయన సంగతి కేంద్రమునకు తెలుసు, సీమంద్రులకు, పోలీసు వాళ్లకి బాగా తెలుసు..నిన్నటికి నిన్న ఉద్యోగస్తులకు డిల్లి నుండి ఫోన్ చేసి సహాయ నిరాకరణ విరమించుడి అని చెప్పును,(ఈ విషయం నిన్న ఆంధ్ర జ్యోతి లో చదువుకో గలరు) అసలు ఈయనకు ఉద్యోగస్తుల జాక్ కి ఉన్న సంబంధం ఏమి? ఏ కొద్దో గొప్పో తన పార్టీ వాళ్ళు ఉన్న కాని, అందరు ఈ పార్టీ వ్యక్తులు కాదు కదా! అంత దైవ లీల! మాయ! మారు మూల ఉన్న ఉద్యమ కారుడికి ఇవేవి తెలియక..జై తెలంగాణా అనుకుంటూనే ప్రాణాలు విడుచును..ఎన్ని ప్రాణాలు పొతే నేమి, చస్తే చావండి రా నాకోడకల్లార, నాకు మాత్రం ఒక చానెల్, ఒక పేపర్, నా వాళ్లకి పదవులు, కొడుకు, బిడ్డ, అల్లుడు..కొద్ది రోజులుంటే మనవలు, మనవరాళ్ళు..ఇంకొన్ని వ్యాపారాలు..అది కూడా ఐపోయింది అనుకోకండి ..మిలియన్ మార్చ్ కి ప్రభుత్వం వారు సహకా రిన్చరు ఎందుకంటే రాజుగారి ఆజ్ఞ లేదు కాబట్టి మిగిలిన తెలంగాణా వాళ్ళు ఏమి చేయ లేరు అనుకొంటారు..సీమ ‘అంధులు’ , వారి తొత్తులు పరీక్ష వాయిదా వెయ లేరు..వెంటనే రాజు గారు విద్యార్థులకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జాక్ తో మాట్లాడుతాను అందురు..అసలు వీరు ఎవరు జాక్ లో? వీరి పాత్ర ఏమిటి? వీరికి వారికి ఉన్న అవినాభావ సంభాధం ఏమిటి? తెలంగాణా అంటే కెసిఆర్ అని అర్థం..కాదు ప్రభు! చని పోయినా ఏ వ్యక్తీ కూడ పార్టీ నాయకులు కాదు, డబ్బున్న వాడు కాదు..నిన్నటికి నిన్న మా విద్యార్తి, చొప్పదండి మండలం, ఆర్న కొండ గ్రామం, కుదిదాల్ అమిత్(18 ) ఇంట్లో ఉరి వేసుకొని చని పోయెను..హత్యా రాజకీయ నాయకులు వీరంతా..ప్రతి ఒక్క చావుకు మీరే కారణం..తుప్పు పట్టిన రాజ కీయాలు మాకొద్దు ప్రభు! మీరు కూడ ఒక రాజ కీయ నాయకుడని మా కళ్ళు తెరిపించితిరి, ధన్య వాదములు! మీ అభిమానులు మిమ్మల్ని విపరీతంగా అభి మానిన్చేదారు కాని మీరు ఒక సామాన్య మానవుల వలె, ఏమి చేయ లేక పోతిరి, పోరాడి వోదితిరి..మా ఉద్యమ నాయకులకంటే మీరు ఏవిధముగా గొప్ప? ఒక్క స్త్రీ అయి, ఖంగున కంచు ఖంటం వినిపించిన మా సుష్మ స్వరాజ్ కంటే ఏమి గొప్ప? అయినా ప్రజలు మిమ్మల్నే కోలుచుదురు..దీని భావ మేదో కూడా తెలవదు మాకు..పామరులం కదా.. సెజ్ భూములు కాపడ మంటే , పోలవరం ల గిరిజనులను కాపడమంటే, కాలుష్య పట్టణాలను, ఉద్యోగాలను కాపాడమంటే అన్నింటికీ తెలంగాణా రాని చూతము అన్తిరి..మీరు చూసే సరికి అన్ని పోయెను, నేడు రిక్త హస్తములతో ఉంటిమి మహా ప్రభో! మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు క్షమించుడి!

ఇంక అత్యంత విచిత్రమైన పార్టీ, దాని పేరు తెలుగు దేశం! అందరికి రెండు కళ్ళు ఒక చూపు ఉండును, వీరికి కూడా రెండుకండ్లు ఉండును, అవి రెండును కూడా సీమ ఆంధ్రులనే చూచును కాని వీరికి రెండు కళ్ళు రెండు ప్రాంతములు అని చెప్పుదురు ..మన తెలంగాణా నాయకులు నమ్ముదురు, మనల్ని నమ్మిన్చుదురు..లేక లేక ఒక నాయకుడు నేడు ఒక ప్రశ్న వేసి అసెంబ్లీ లో లొల్లి చేస్తే , ఆ నాయకుడిని మిగిలిన తెలంగాణా నాయకులు తిట్టును..అక్కడ రాజు గారి పేరు ‘చంద్ర బాబు’, అయన ఆజ్ఞ దాట కూడదు సుమా! తిట్టమంటే తిట్ట వలెను, కొట్టమంటే కొట్ట వలెను..వీరి ప్రభు భక్తిలో కొద్దిగా కూడ తెలంగాణా మీద ఉంటె ఎన్నడో తెలంగాణా వచ్చును..బిడ్డడు ఒక్కడు బయటికి వస్తే ఎంత తంటా, వారు రారు, రానివ్వరు, వీరిని మనం మళ్లీ వోట్లు వేసి గెలిపించుడుము..మరి పోయిన ప్రాణాలకి ఎవడు బాధ్యుడు తండ్రి! మేమే బాధ్య్లము, మిమ్మల్ని ఇంకా గౌరవించి మోస్తున్నందుకు, ఇంకా ఈ ప్రాంతములో తిరగనిస్తున్నందుకు..వీరి హయాములోనే, వీరి మామ గారి హయాములోనే తెలంగాణా అమ్మకానికి పెట్ట బడెను..భూములు కేకుల్లెక్ఖ అమ్ముకోనేను, ప్రపంచ బ్యాంకు కు దాసోహం అని దోచు కొని , దోచు కొని అలసి పోయి నేడు ప్రజల కోసం ఈ నాయకుడు మాట్లాడును! ఇంత విచిత్రం ఎక్కడైనా ఉండునా! ఇంత నియంత పాలన ఎక్కడైనా చుచితిరా? ఇది ప్రజా స్వమ్యమే అన బడును..

అంత రాజులు, రాణులు..ప్రజా ఉద్యమాలను ఉక్కు పాదాలతో తొక్కి వేయుదురు..ఇక్కడ మన, పర భేదాలు ఉండవు..ఇది మనము తెలుసు కానిచో మళ్లీ ఉద్యమానికి ద్రోహం చేసిన వారు అవుడుము..దయ చేసి ప్రజా ఉద్యమాలకు చేయూత నివ్వండి..మీ అమర ప్రేమలను, గుడ్డి నమ్మకాలను మీతోనే ఉంచుకోండి..ఇపుడు రాజకీయ నాయకులు ఉద్యమాలు చేస్తున్నారని మీకేమైనా అపోహాలు ఉంటె దయ చేసి తొలగించు కోగలరు..అందరు చేతులు ఎత్తివేసినారు..కేవలం ప్రజలే తెల్చుకోగలరు..నేడు లాయర్లు, విద్యార్థులు, ఉద్యమ కారులు కదం తొక్కుతున్నారు..కొన్ని సంఘాలు, జక్లు ప్రజలు ఇచ్చే ప్రతి పిలుపుకి మద్దతుని ప్రకటిస్తున్నాయి..ఒక్క పార్టీ అన్యినా, రాజు గాడైనా అడ్డం పడితే అడ్డంగా …..అంతే! ఇంక ఓపిక లేదు..హత్యలు చూసే ధైర్యం లేదు..సహనం అంత కూడగోట్టుకొని కేవలం ప్రజలతోటి ఉంది, రాజులని , రాణులని ఎందగాడితే గాని దారికి రారు..దయ చేసి ప్రజలతో ఉన్డున్డ్రి ..అన్నల్లారా, అక్కల్లారా! రాజ కీయ పార్టీల అజెందాలకి మళ్లీ మనం బలి కావొద్దు, వారు ఏమి చేయాలో ప్రజలు చెపుతారు, ప్రజలు ఏమి చేయాలో రాజ కీయ నాయకులు చెపితే ఇంకా ప్రజా స్వామ్యానికి అర్థం ఏముంటుంది.. ఇది చాల కీలక మైన సమయం..ఇపుడు కాకపొతే తెలంగాణా ఎపుడు రాదు..ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉద్యమం నడవాలే..

కొంత మంది నమ్మకాల్లు భళ్ళున పగల వచ్చు ..పరవాలేదు..వేయి ఆలోచనలు సంఘర్షన పడ నీయండి..కొద్దిగా శ్రమ పడదాం..నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు, ప్రజా పోరాటాలకి మద్దతు నిద్దాం అని మాత్రమె అంటున్న..మీ మీ ప్రేమలకు అడ్డు పడకుండా, ప్రజలను ఒక్కటిగా చూడమంటున్నా..రాజు గారి అజ్ఞాలకి , కను సన్నలకి కంపించకండి! రాణి గారి ఆలోచనలకి అడ్డు కట్ట వేసే శక్తి కేవలం ప్రజలకే ఉంది , అది మాత్రం మరిచి పోకండి..ఒక్కో రోజు లెట్ అయితే ..ఒక్కొక్క ప్రాణం అని గుర్తుంచుకోండి..ప్రపంచ పోరాటాలు చూడండి..ఎవరికీ ఇబ్బంది కాకుండా ఉద్యమాలు ఉండవు, శాంతి లో కూడా ఎంత అశాంతి ఉందొ మనందరికీ తెలుసు..’ అ’హింస ఎంత హింస ఉందొ గత సంవత్సరంగా చూస్తున్నాం..మరొక సారి హిపోక్రసి లో పోకండి..మన పానాలు మంచిగుంటే కాదు పోయే పానాలు చూద్దాం! నిజమైన ఉద్యమ కారులు రబ్బరు బుల్లెట్లు, లాఠీలు, అర్రెస్ట్లకి భయ పడట్లేదు..వారికి లేని ఇబ్బంది మనకు ఎందుకు? మన జీతాలు, మన సిద్దాంతాలు మనతోనే ఉంటాయి , ఏమి డోఖ లేదు..దయ చేసి పోరాడే వారికి మద్దతు ఇద్దాం ! ఇదే విజ్ఞప్తి ! నేను మాత్రం ప్రజా పక్షం, ప్రజలే న్యాయ నిర్ణేతలు, నేడు ప్రభుత్వాలు నడవక పోయినా, నాయకులు పని చేయక పోయినా, అది కేవలం ప్రజల ఆసక్తతనే! ..నాకు పార్టీల మీద ఏ ప్రేమా లేదు..వారిని, వారి వేషాలు అతి దగ్గరినుండి చూసి..ఈ జీవితానికి కావలసినంత అనుభవాలు వచ్చినాయ్..మరొక కొత్త రక్తం, కొత్త తరం మాత్రమె కొత్త రాజకీయాలను శ్రుష్టినచ గలవు.. ఎవరు ముందుకు వచ్చినా వారికి పూర్తి మద్దతు..

“ఈ రక్త ప్రవాహం కావాలి
కాని అందులో కొందరు పడవలు వేసుకొని
ప్రయాణాలు చేస్తున్నారు కీర్తి శిఖరాలకు ,
వాళ్ళ రక్తం కీర్తి సిఖరాలే కాని,
ఈ రక్తం ఎవరిదో, ఎవరి కోసం పారిందో వారి క్షేమం కాదు..
వాళ్ళు రక్తం ఒక్క బొట్టు కూడా కార్చారు..
పరాయి వాళ్ళ రక్తం పారితే పాటలు రాస్తారు”..

తెలంగాణా కోసం రక్తం చిందించిన వీరులు, ప్రాణాలు అర్పించిన అమరులు చరిత్రలో కనపడరు..వారి శవాల పై పేలాలు ఏరుకునే వారు నేడు చరిత్ర నిర్మాతలు..మేము ఇంకా బతికే ఉన్నాం నేస్తం! నీ ఉద్యమ స్పూర్తిని భావి తరానికి అందించ డానికి..నీ ప్రయాణం ఆగదు..విజయం నీదే..దగా పడ్డ తెలంగాణని , దోపిడీ దారుల చేతిలోంచి కాపాడేది నువ్వే..

జై తెలంగాణా!

Courtesy – Sujatha Surepally, thank you for sharing.

Related posts:

  1. Ayomayam lo Azad and Co.
  2. Prajala chethila Telangana udyamam
  3. ‘Andhra’ bhavan arachakam
  4. Deeksha viraminchandi – KCR
  5. TDP challenges Jagan’s YSR Cong
  6. What did KCR do for Telangana – Erraballi
  7. We need development of Telangana
  8. Vi ‘grahala’ vidwamsam
  9. Banchan kaadu Doraa… Baakulam
  10. Marana saasanam raasina T MLAs

Leave a Reply

Spam protection by WP Captcha-Free