Exams are done, now summer vacation?
News pulse, Politics | admin | March 20, 2011 at 5:49 pm
రాజకీయ నాయకులకు సెలవలు అనుకుంట, తెలంగాణా పరిక్షలు అయిపోయినట్టే(?) చిదంబరం గారు రిసల్ట్స్ డిక్లేర్ చేసే వరకు పెద్దగా ఏ కార్యక్రమాలు చేసేటట్టు లేదు మన జాక్. పాపం ఉద్యోగస్తులు ఏదో సర్ది చెప్పుకున్నారు, చెప్పుకుంటూనే ఉన్నారు, దిల్లికి ఒక ఫాషన్ పరేడ్ చేసి వచ్చారు. అట్లా ఎంత మంది ఎన్ని పరేడ్ లు చేయలేదు, చిదంబరం గారు మే లో ఇవ్వక పొతే అపుడు ఏదో చేస్తాం అని సెలవిచ్చారు విజ్ఞత కలిగిన పెద్దలు, ‘వేతన శర్మలు’( అందరం చదవ వలసిన కథ ) . ఇన్ని ప్రాణాలొడ్డి , అన్ని రకాల పరిక్షలు రాసాము అనుకొంటున్నాము కాని, ఇంకా ఏమేమి అగ్ని పరీక్షలు ఉన్నాయో ముందు ముందు.. ఇక్కడ ప్రశాంతంగా ఉద్యమం నడుస్తోంది, అహింసా యుతం గా నడుస్తుంది అని చెప్పుకొనే మేధావులకి రోజుకో చావు కన పడత లేదు..నిన్ననే మానకొండూర్ మండల, చెంజేర్లల సతీష్ గౌడ్ మిల్లియన్ మార్చ్ లో అర్రెస్ట్ అయిననందుకు బాధతో , విడుదల కాగానే ఆత్మ హత్య చేసుకున్నాడు..ఇక్కడ విగ్రహాల ప్రతిష్టకి ఏలిన వారు ఆఘ మేఘాల మీద ప్రయత్నాలు జరుపుతున్నారు, అది చూస్తూ మన గొప్ప నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు, మన కళ్ళ ముందే మళ్లీ విగ్రహాలు మోలుస్తాఎమో కూడా.. అట్లనే వరంగల్ ల రెండు చావులు , తమ్ముళ్ళు పిట్టల్లాగా రాల్తానే ఉన్నారు, చూడలేక , వినలేక, ఏమి చేయలేక, నీచ నికృష్ట రాజకీయ చదరంగంలో అసువులు బాస్తున్న పిల్లల గోస చూడలేక విలవిల లాడుతున్న మనసులు.. కాదు అతి ప్రశాంతంగా ఉంది అనాల? ఈ ఉద్యమం శాంతి బాటలో నడుస్తుంది అనాల? అవును, మేధావులకి, రాజకీయనాయకులకి, కుహన ఉద్యమ కారులకి, అమ్మలను అమ్ముకునే తార్పుడు గాళ్ళకి ఇది అట్లనే కనపడుతుంది, గుప్పెడు మనసున్నోళ్ల కి ఇది నరక యాతనే, అతి పెద్ద హింసాత్మక ఉద్యమమే, కొంత మందికి రక్త తర్పణం, బొమ్మలు విద్వంసం ఒక పెద్ద విషయం గా/నేరాలుగా కనపడ వచ్చు, పొలిసు కాల్పులకి, లాతిలకి బలి పోయిన విద్యార్థి, ఉద్యమ కారులకి జరిగిన సన్మానాలని ఏమని పిలుస్తారు ? ఇవి శాంతికి చిహ్నాల? అశాంతికి చిహ్నాల? ఇన్ని చావులకి ఎవరు బాద్యులు? ఈ శాంతి కాముకులు కాదా? దగాకోరు రాజకీయ నాయకులకు కొమ్ము కాసే మేదావులది కాదా? నిజాలని దాచిపెట్టి గోప్పలని చెప్పుకొనే గోప్పోల్లది కాదా?
పిచ్చి ప్రజలే ఇంకా ఉద్యమాల బాటలో ఉన్నారు, ఉద్యోగులు మాత్రం ఎటు తోచక, లేకపోతె ఎవరైనా సిగ్నల్ ఇస్తే చూద్దాంలే అని చూస్తున్నారు, ఒకవేళ మే లో ఇతర రాష్ట్రాలు ఎన్నికల తర్వాతా ఇవ్వక పొతే ఏమ్చేస్తారు ఇపుడు మౌనంగా ఉన్న ఈ ఉద్యమకారులు ? చనిపోయిన ఇన్ని ప్రాణాలకు ఏమైనా విలువ కట్టగాలరా లేకపోతె మళ్లీ ఒక నాటక రంగాన్ని శ్రుష్టించి మల్లా రెండువేల పద్నాలుగు వరకు లాగి మరిన్ని వందల ప్రాణాలు బలి కావాలని చూస్తున్నార? విగ్రహాల విద్వంసాలకి ఇన్ని పేరులు పెడితే రేపు సహనం నశించి మరేమన్న చేస్తే , శాశ్వతంగా నక్సల్స్ గా ముద్రవేసి తెలంగాణకి బందు పెడుతార? ఏదైనా జరగవచ్చు తెలంగాణా విషయంలో, ఎవ్రీ థింగ్ ఇస్ పాస్సిబుల్ విత్ అవర్ స్పైన్ లెస్స్ లీడర్స్ అండ్ కన్నింగ్ పీపుల్ అరౌండ్! పార్ల మెంట్ ప్రశాంతంగానే జరుగు తోంది, అసెంబ్లీ కూడ ఎమ్మెల్సి లని, క్రాస్ వోటింగ్ లని అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు, నమ్మిన్చడాలు, నాటకాలు అన్ని జరుగుతున్నే ఉన్నాయి..పెద్ద మనసులకి డి హైడ్రేషన్, అస్వస్థత మొదలగు జబ్బులు వస్తూ బాద పెడుతున్నాయి , అయినా కలి కాలం కాని ఉద్యమం ఎటు పొతే ఎవడికేం పట్టింది, చిదంబరం ‘మే’ వరకు అన్నాడంటేనే మల్లా ఏదో ఒక నాటకానికి తెర తీస్తున్నాడనే అర్థం, అపుడు ‘శ్రీ కమీన కమిటీ’ మరి ఇపుడు విడుదల కాబోయే చిత్రమేమిటో వేచి చూడాల్సిందే, మళ్ళా గోర్రేల్లెక్క నమ్ముతానే ఉంటాం, నమ్మిస్తారు మన పెద్దోళ్ళు లేకపోతె మౌనంగా ఉంటారు..ఏమి చేయలేక జై కొడుతూ మనం చూసూ ఉంటాం ..మనకి కూడా ఒక స్పష్ట మైన రోడ్ మాప్ లేదు, అన్న ఏదంటే అదే సై, అంతే కాని ఒక డేడ్ లైనే పెట్టి, అందరి రాజకీయ నాయకుల దుమ్ము దులిపి, పోతున్న ప్రాణాల్ని రక్షించుకున్దామని, రాబోయే కపట నాటకాలని ఆపుదామని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా? ఎంత సేపు రిసీవింగ్ ఎండ్ లో ఉండి, ఆజ్ఞ లు శిరసా వహించటం మాత్రమేనా? ఇంకా ఎన్ని వేల అనుభవాలు కావాలి వీరు దగా కోరు రాజ కీయ నాయకులని తెలుసుకోవడానికి , అయ్యా! పార్టీలు వేరు కావొచ్చు కాని రంగు , రుచి, వాసన ఒకటే, ఆడే నాటకాలు ఒకటే.. వీడిని వాడు తిట్టుడు, వాడిని వీడు తిట్టుడు తప్పితే విద్యార్తులని ఏకం చేసే పని , ఉద్యమ కారులకి ఒక స్పష్టమైన కార్యా చరణాని ఇచ్చే పని ఏది? ఉద్యోగస్తులు సరే , ట్రేడ్ యూనియన్లు ఎందుకు చేయవు ఈ పని? అవును ఎందుకు చేస్తారు? పదేండ్ల ఉద్యమంలో వారి సమస్యలని ఎపుడైనా పట్టించుకోన్నామా? ప్రైవేట్ పరం అవుతున్న ఉద్యోగాలని ఆపామా? అవుట్ సోర్సింగ్ పేరుతో ఆంధ్రోల్లు కుప్పలు కుప్పలు వచ్చి పడుతుంటే పోరాటాలు చేసామా? మూత పడుతున్న పరిశ్రమలు, దివాలా తీస్తున్న చిన్న చితక వ్యాపారాలను పట్టించుకున్నామ? ఏమి లేదు, తెలంగాణా అంటే దండుకోవడం మాత్రమె, ఓట్లు సీట్లు అమ్ముకోవడం మాత్రమె కదా ! మరి రైతులు ఎందుకు చేయరు? వారి గోడు ఎపుడైనా కనీసం విన్నామా..సెజ్జులు బారిన పడిన భూముల్ని రక్షించామా? పోలవరం ని ఆపండి అని అపుడైనా ఆదివాసిల వైపు మన చూపు మల్లిందా? మల్లడం అంటే ఫాషన్ పరేడ్ లు కాదు నా ఉద్దేశం, బేరాలు సారాలు అంతకన్నా కాదు మిత్రమా! మైనిన్గ్లు, గుట్టలు కొల్లగొడుతున్నారు, ఊర్లు వల్లకాడు గా మారుతున్నాయ్ అంటే ఎవరికీ వినపడుతుంది? దోపిడిలో అందరు సమానమే బాబు! ఈ సత్యం తెలుసుకోనిచో తెలంగాణా నయా నాటకాలు అర్థం కావు .. అవి తెలంగాణా ఉద్యమంలో రావు కదా? అయినా మనసున్న మంచోలు కాబాట్టి కూలి నాలి చేసుకొనే వారు కూడ జై తెలంగాణా అంటున్నారు..ఎం చేస్తారు మరి, ఎవడు కాపాడాలో వాడు ఆడుకుంటాడు, అమ్ముకుంటారు..
ఎండాకాలం జర సల్లగ తిని పడుకోవాలని నాయకులు అనుకోవచ్చు తప్పు లేదు, మరి ప్రజలో? రోజుకో చావో? మే లో రాం లీల మైదాన్ లో టెంట్ వేసి అన్ని రాష్ట్రాలని కూడ కడతాం అని ప్లాన్లు వేస్తున్న మన ఉద్యమ వేదికలైన విద్యార్తులో? ఎం చేయాలే, మే వరకు ఆగితే సల్లబడ్డది అని ఊకున్న్నారు లే అని మల్లా మసి పూసి మారేడు కాయ చేస్తారు కాదె! అన్ద్రోల్లకి సమయమిస్తే దేశాన్ని కొంటారు..ఇపుడే ఒక సీనియర్ ప్రొఫెస్సర్ అంటున్రు..తెలంగాణా రాదు అమ్మ, ఎందుకంటే మనోళ్ళు రెండు పనులు చేయలేరు..ఒకటి పైసలు పెట్టలేరు, రెండు పైరవీ చేయలేరు అని, ఇవి రెండు లేకపోతె తెలంగాణా రాదు అని..ఒక్కసారిగా పానం సల్లబడ్డది..తెలంగాణా రాక పొనికి మా దౌర్బగ్యపు ప్రేమలు కారణం, మా శవాల మీద పేలాలు ఏరుకొనే నాయకులని వెనకేసుకు రావడం కారణం మరి పానాలను ఫణంగా పెడుతున్న బిడ్డలని ఎట్లా ఆపు చేయాలే? మనకు మాత్రం సెలవలు లేవు, ఉద్యమానికి విశ్రాంతి ఎక్కడిది? టైం పాస్ పనులు చేస్తే మనం రేపు తలెత్తుకోలేము, కనీసం మనమైనా నాయకులకి అజెండా ఇవ్వాలి, ఉద్యమాన్ని కాక తగ్గకుండా చేయాలి.. మే లో నైనా తెలంగాననో , చిదంబరమో, ఆంద్ర వాళ్ళో, అమ్ముడు పోయే తెలంగాణా వాళ్ళో తేలిపోవాలి..
ఇవ్వాలనే చదివిన ..
“నాకు వాస్తవాలు , వాస్తవాలు మాత్రమె కావాలి
వాస్తవాలు మాత్రమె జీవితంలో అవసరం..
గ్రాడ్ గ్రైండ్ (హార్డ్ టైమ్స్ నవల)
ప్రజలుగా మనకు విపరీతమైన బలం ఉండి, మనం ఎవరి సైడ్ తీసుకోకపోతే, జర గట్టి , మంచి ఉద్యమ రూపాలని జాక్ ద్వారా ఇవ్వగలిగితే అంత కన్న పెద్ద పని ఇంకోటి లేదనుకుంటా..లేక పొతే ఎందుకొచ్చిన లొల్లి అందరం కలిసి ఆంద్రకి వలస పోదాం పాండ్రి! ఆడికి రానిస్తారంటారా? తంతే బొంబాయి లనో , దుబాయి లనొ పడతం, ఆడ కూడ జాగా లేదంటా ..మరెట్ల ! జంగల్ ? అక్కడ అసలే జంతువులకే జాగా లేదు..జంగ్ మాత్రమె ఇపుడున్న దారి..జంగ్ జీతేన్గే ! మిల్కే లడేంగే!
మిత్రుడు చెప్పినట్టు ” బగత్ సింగ్ స్ఫూర్తి తో ఆనాడు అయన చూపించిన దైర్య సాహాసాల బాటలో తెలంగాణని సాదిద్దాం”
జై తెలంగాణా !
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Ayomayam lo Azad and Co.
- Prajala chethila Telangana udyamam
- ‘Andhra’ bhavan arachakam
- Telangana in cross roads
- Deeksha viraminchandi – KCR
- Ningi ki egasina Telangana keratam
- Anyayaaniki kooda Ambedhkar aa?
- Will CM, Kiran be a CM until 2014?
- Telangana Raktha Kanniru
- Madhu Yashki masthi


Tweet This
Digg This
Save to delicious
Stumble it