G-andh(i/ra) giri
News pulse, Politics | admin | March 26, 2011 at 9:17 am
నిన్న ఆంధ్ర జ్యోతి లో ఏ. (ఏ ) గాంధీ గారి వ్యాసం “కమ్మునిస్ట్లు ..కళ్ళు తెరుస్తారా”? చదివినంక నిజంగా కళ్ళు తెరుచుకున్నాయి…అన్న! ఎం చెప్పినవే! మా భాషని, మా క్వాయిష్ ని రెండు ముక్కల్ల ముచ్చటగా చెప్పినవ్..నీ ఏడుపంత విగ్రహాలు ద్వంసం అయినాయి అంతే కదా..విగ్రాహాల మీద నీకున్న ప్రేమ , పిట్టల్లెక్క సచ్చిన మా పిలగాండ్ల మీద గిన్తనన్న ఉంటె ఎంత బాగుండును, మీ రక్తంల ఎదుటి వాల్లని, వాళ్ళ బాధని అర్థం చేసుకొనేది ఉందా? దోపిడీ, అణచివేత, ఆధిపత్యం లాంటివి తప్ప మనసులు కూడా ఉంటాయి అని తెలుస్తదా మీలాంటి వాళ్లకు ..అయినా మాకు తెలివి ఉంటె ఈ గతి పట్టేదా.. ఈ రోజుకి కూడా మిమ్మల్ని ఏమన లేక మావోల్లనే తిట్టు కుంటూ .. నీ కంటికి ఇంత చిన్నగా కనిపుస్తున్నాము మేము..మా పోరాటాన్ని తాకరె తో పోలుస్తున్నావు సారూ.. నీ కడుపు సల్లంగుండా అట్ల లెక్ఖ ఉంటె నీలాంటి వాళ్ళు ఇవాళ గిట్ల పెలుతుంటిరా? ఎన్నడో హిసాబ్ , కితాబ్ తేల్చుకునేతోల్లం ..మా భూములు, మా నీళ్ళు, మా నిధులు , మా భాష, యాస అన్ని కాపాడుకొంటూ నువ్వు ఏడ్చే ఆ బొమ్మలను మా గుండెల మీద లేకుండా చేసుకుంటి మీ కదా! మీరు గొప్ప వాళ్ళే అయితే ఆ బొమ్మలు మీ ఇంట్ల ఎందుకు పెట్టుకోలేదు ? అన్ని మా మీద రుద్దిన్రు, సరే అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన మా కొమరం భీమ్, చాకలి అయిలవ్వ, బందగి, దొడ్డి కొమరయ్య, కాళోజి లు ఎందుకు కనపడ లేదు జర చెప్పే.. సరే, మీ ఊలు నా ఇంట్ల వుంటే కనీసం మా వోల్లను నీ ఇంట్ల పెట్టుకున్తివా? పాటయ పుస్త కాల రాసుకున్తివా..మీ ఇండ్లల్ల ఆఫీసుల్ల, బడుల్ల ఫోటో లు అన్న పెట్టుకొనక పోతివి.. అతివాదులు, మిత వాదులు అంటూ సొల్లు చెపుతున్నావ్.. ఏది అతి వాదం, ఏది మిత వాదం.. అన్యాయాన్ని ఎదిరించా డాన్ని మీ తెలివి కల్లోళ్ళు ఏమంటారు అన్న? తెలంగానోల్లం మీలాంటి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోలేని తెలివి తక్కువోల్లం కదా మాకు ఏమాత్రం తెలవదు..బాబ్రి మస్జిద్ కూల్చి వెత లెక్క నువ్వు ఫీల్ అయినవంటే ,నీ యబ్బ మేమెంత ఫీల్ గావాలె చెప్పు? నువ్వు వచ్చింది బతకలేక , పొట్ట చేత బట్టుకొని, పైసల్ లేక అడుక్క తిననికి..ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాది అంటరు మీవోల్లు, గట్లనే ఇవాళ మా గడ్డ మీద , మా నాలుగు కోట్ల ప్రజల దుక్ఖం నీకు అర్థ మైన తీరు చూసి మేధావులు(?), (సారి తమరెవరో మాకు తెల్వది, ఏదో రాత గాళ్ళు అనిమాత్రం అనుకుంటున్నాము) అని ఇట్లాంటి వాళ్ళనే అంటారా అనిపిస్తుంది.. అసలు కమ్మునిస్ట్లు బతికిందే తెలంగాణా అడ్డం పెట్టుకొని ..నిజం రాజులు లేకపోతె మా జాగల ఎర్ర జెండా ఎక్కడిది.. పుట్టుకని మర్చి పోయినోల్లను ఏమనాలె? అయినా ఇన్ని రోజులు వాళ్ళు కాపాడింది మిమ్మల్నే కదా..మా భూములు కాపాడ లేదు, నీళ్ళు కాపాడలేదు, ఉద్యోగాలు ఏమి లేవు..ఇప్పుడేదో చేసేస్తున్రు అని గిన్జుకున్తున్రు ఏంది? వాళ్ళు ఏమి చేయలేదు కనీసం మానవతా దృక్పదం తో కొంత మంది కమ్మునిస్ట్లు విధి లేక జై తెలంగాణా అంటున్రు.. స్వేచ్చా , సమానత్వం, మన్ను , మశానం పదాలన్ని రాసుకోవడానికెనా ? తెలవక అడుగుతా “ఆంధ్ర” అనే పదం తోలిగిస్తున్నాం నీకు ఏమైనా ప్రాబ్లమా? ఆ పదం అంటే మాకు డోకు, కక్కు వస్తుంది, చికోట్టిన పడి ఉండే తోల్లని ఏ వాదులు అనాలి? అమెరికా సామ్రాజ్య వాదుల కంటే ఏమైనా తక్కువ అనుకున్తున్రా? ఎన్నడు ఈ కోణం లో ఆలోచిన్చిన్రా..తీయండి, ఎవడి ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూద్దాం! ఎన్ని భూములు కొల్ల గొట్టిన్రో లెక్కలు ఇద్దాం, ఒక్క నాడన్న గాంధి గారి లాగా పోరాటం చేయని వాళ్ళు గాంధి తాతలకంటే ఎక్కువ మాట్లాడతారు ..రాజ్యంగా బద్దంగా రాసుకున్న ప్రతి ఒక్క ఒప్పందాన్ని తుంగలో తొక్కినా , దాని గురించి మాట మాత్ర మైన మాట్లాడని కుహనా మేధావులని ఏ వాదులు అని అనాలో సెలవియ్యండి జర ..
నిన్నటికి నిన్న ఒక దగులబాజి కమిటీ ముస్లిం లను హిందువులను వేరు చేద్దామని , మా సాన్నిహిత్యాన్ని భరించలేక కుట్ర పన్నింది, ఇవాళ నువ్వు నిజాం రాజు గురించి మాట్లాడుతున్నావు..అవును తెలంగాణాల ఒక భాగం నిజం సంస్కృతీ.. మా తిన్డిలా , మా బట్టల, మా భాషల, మా యాసల , మా అభివ్రుది ల భాగం, మేము అన్న తమ్ముల్లెక్కనే ఉంటాం..అయినా ఒకరో ఇద్దరో నిరంకుశ రాజులున్నంత మాత్రాన మొత్తంగా నిందించ లేము..అయినా మీ కంటే వేయి రెట్లు నిజాం మేలు అనే భావనకి ఎన్నడో వచ్చినాము..మీరు మా ఊరు దోచు కోవడానికి వచ్చిన్రు కదా..అది అంతా ఆ రాజుల పుణ్యమే.. నాజి తరహా ఉద్యమంగా నీకు అనిపిస్తుందా? మంచిదే..మాకు ఒక మంచి మాట చెప్పినవ్, ఉద్యమాన్ని ఎట్లా నడపాలని , మీకు ధన్య వాదాలు. మాది ప్రాంతీయ తత్త్వం, థాకరే వాదం! అవును రా భై! ఏమ్చేయ మంటవ్, దున్యియాలున్న ఒప్పందాలన్ని చేసుకుని, ఫజల్ అలీ కమీషన్ కంచి నిన్నటి కృష్ణ దాకా ప్రయత్నిస్తిమి..మా జిల్లాలన్నీ ఇయాల వల్లకాడులు అయినాయి, ఇనక పోతిరి.. మర్యాదగా అడిగితిమి, మీ ప్రాణాలు తీయకుండా మా పానాలు తీసుకున్తిమి, మా జాగాలన్ని మీరు ఆక్రమిస్తే నోరెళ్ళ బట్టి చూస్తిమి..సెజ్జు చట్టాలు చేసి మీరు చోద్యం చూస్తుంటే ఇంత గొప్ప మేధావులు నోరు మెదపక పాయిరి..ఇపుడు బొమ్మలు పోయినాయి అని పొల్లు పొల్లు ఏడుస్తాన్రు..’తాకరె వాదాన్ని’ మింగిస్తున్నారు అని రాసారు..నిజమంటారా ? అట్లయితే నీ నోట్ల ఘీ , షక్కర్ అన్న! ఒక్క ఇసయం చెప్తనే, మేము కొదండలం కాబట్టే ఇవాళ అన్ద్రోల్లు స్వేచ్చగా హైదరాబాద్ల ఉండ గలుగుతున్నారు, తాకరె లు అయితే ఎట్లున్తమో ఒక్కసారి ఊహించుకొండ్రి..మేము కొదండలం కాబట్టే ‘శాంతి’మంత్రాలు జపిస్తున్నాం, పిందాకూడులు, శవ యాత్రలు చేసుత్న్నాము, దిష్టిబోమ్మలకు పరిమితం ఐనాం, విద్వంసం విగ్రాహాలకి మాత్రమె, మా విలువైన భూములు , జాగాలు, విద్వంసం చేసి ఐ మక్సులు , ఎన్టిఆర్ పార్క్లు, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కులు, కట్టినపుడు మీ ఈ వీర ఆవేశం ఏడ పోయింది..బతక నీకి వచ్చినోళ్ళం, దోచుకోనీకి కాదు అని అపుడేందుకు రాయాలె, ఒక వేల పెట్టినా మీ అంత ఆదర్శ వంతులు ‘అందా’ వాదులు ఎపుడు నోరు ఇప్పలేదు? దీని భావ మేమి ? దీనిని ఏ వాదము అందురు..’వెధవ వాదం’ అందురా? మా భాషల నైతే ‘బద్మాష్ గిరి’ అంటారనుకుంటా..
ఆంధ్రా అన్నలందరికి మనవి..వినతి పత్రాలు , వినంరతలు, నిగ్రహాలు అన్ని అయిపోయిని ఇపుడు, తెలంగాణా భగ్గున మండుతున్నది..ఎవడు అడ్డం వచ్చినా మాడి మసి కావలసిందే, ఇందులో మా నాయకులు అడ్డు పడినా ఇదే గతి..అగ్నికి నేను నువ్వు అని భేదం తెలవదు కదా..మా టాంక్ బండ్ ని ‘పరివర్తన స్తలి’ గా మారుస్తాము,” విగ్రహాలను ద్వంసం చేయండ్రి” అనే భావన తెచ్చింది మీ కదా.. మీకు చాతనైనది చేసుకొండ్రి..ఇపుడు కూడా మీ అత్యంత తెలివి తేటలతో మా మీద దాడి చేయాలని చూస్తున్నారు..మా స్వచ్చమైన ఉద్యమం మీద మచ్చ తెచ్చే ప్రయతం చేస్తే మాత్రం మీరు ‘తాకరె’ ల నిజ స్వరూపం చూడాల్సి ఉంటుంది, నిజం నిరంకుశత్వం కొంచెమైనా రుచి చూడాల్సి ఉంటుంది ..అయినా మీలాగా రెచ్చ గొట్టే వాళ్ళంటే నేను చాల ఇష్ట పడతాను..మస్తు మజా వస్తది అన్న! మీ అంత ట మీరు మీ నైజాన్ని బైట పెట్టుకుంటారు అతి తెలివి తోటి..ఇంత మాట్లాడేటి వాళ్ళు, ఇన్ని కోట్ల మంది వదిలి పొమ్మంటే సిగ్గులేకుండా ఎందుకు పడి ఉంటున్రు? మీ దగ్గర లేనిది, మా దగ్గర ఉన్నది అది ఒక్కటె, మీకు వెన్ను పోటులు అలవాటు, మాకు గుండుకేదురుగా గుండెని చూపడం అలవాటు ..తూటాలతో మాకు ఆటలు, మోసాలతో మీకు సావాసం, మీకు మరో పేరు మోసం , దగా ! తెలంగాణా ప్రాంతంలో ఏ పార్టీ బతికి బట్ట కట్టాలన్నా జై తెలంగాణా అనాల్సిందే..ఇంకా మీ వాగుడు, వర్ణనల వల్ల మాకు లాభమే కాని నష్టం లేదు, మీరు భావించే విధంగానే, తాక్రెలు అవుతాము, నాజీలు గా కూడా అవొచ్చు..ఈ లోపట అతి వాదం, మిత వాదం కంటే ఇంకేదయినా పదం, వాదం ఉందేమో అలోచిన్చండ్రి..ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరగనటు వంటిది ఈ ఉద్యమం..నక్షలైట్లు, తాలిబన్లు కాదు , రెండు కలిపితే వచ్చే ఒక కొత్త దళం, పోరాట రూపం..ఇంకా నామ కారణం చేయని ఒక శక్తి..అయినా మీరు మా చరిత్రలని పుస్తకాలు గా రాసుకొని బతికేతోల్లు కదా..పోరాటాల గురించి మీకు ఎందుకు చెప్పు..
తెలంగాణా నిరంతరం మండే ఒక కొలిమి..దగ్గరకు రావొద్దు మేధావులార! మా ప్రాంతంల ఉంది మమ్మల్ని కించ పరచ వద్దు..మీ ప్రాంతం చాల వెనుక బడి ఉంది..అక్కడ పోయి మీ ఆదర్శాలు, ఉద్యమాలు చేయండ్రి..థెయ్ నీడ్ యు! ఒద్దులే, మీలాగా రాసుకునే వాళ్ళు, రాతల మీద బతికే వాళ్లకి పోరాటాలు ఏమి తెలుసు, పోరాతాలంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండాలి, వాళ్ళ అసలు, ఆశయాలతో మమేకం కావాలి..అయినా చేవితోని ముందు శంకం ఊదినట్టు..నీతోని నాకు లొల్లి ఎందుకు చెప్పు..
చివరగా..తాలిబన్లు(జ్ఞానులు), తాక్రెలు, ప్రాంతీయ వాదులు, పైత్యం, కొదండలు లాంటి పదాలు వాడి మాకు కొన్ని కొత్త ఆలోచనలు కలిగించినందుకు చాలా థాంక్స్ గాంధి అన్న!
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Rajakeeya ‘Laphangilu’
- Parliament kaada paanam vadhilindu
- Deeksha viraminchandi – KCR
- KCR Hyd la thiruga ledu – Danam & Mukesh
- Jayashankaraa, nee aalochanale maa aayudhaalu
- Prantheeya Mandali? Dy CM in Delhi
- Telangana Raktha Kanniru
- Madhu Yashki masthi
- New story ‘Jai Bolo Telangana’
- CBN, kottha vesham


Tweet This
Digg This
Save to delicious
Stumble it