Paaraa hushaar
News pulse, Politics | admin | March 28, 2011 at 4:14 am
నువ్వు న్యాయం వేదకొద్దు..
అన్యాయాన్ని ప్రశ్నించ వొద్దు!
లోకాలని నీ కలలతో,
కలాలతో మారుద్దామని
తడమొద్దు తడుముకోవద్దు
సంశయాలు ఆశయాలు
అహర్నిశలు అపశ్రుతులు
ప్రపంచానికి వేలుగావుదామని
అంధకారమైన అడవుల్లో
దివిటీలు పట్టుకుని వెతకొద్దు
చెట్టుకు పుట్టకు రాయికి రప్పకు
నీ ఆవేశం వినిపించోచ్చు
నేనున్నానంటూ నీతో నడవచ్చు
పాములు పులులు నీ వేదనకి కరగొచ్చు..
కత్తుల కవాతులు నీకు
రక్షణగా ఉండొచ్చు
ఏదో ఒక రోజు తుపాకి తూటాకి
బూటకపు ఎన్ కౌంటర్ కి
బలైతామని
బయటి ప్రపంచంలో
బద్రత ఉందని
భ్రమలు అంతకన్నా వద్దు..
నీతి నిజాయితి , ధర్మాధర్మ
కాలాలు కావు ఇవి
నిర్దాక్షిణ్యంగా కాటేసే యుగాలు
గాయం చేసే క్షణాలు
నువ్వు నేర్చుకున్నది నిజం ఐతే
నీది ప్రశ్నించే మనసే ఐతే,
ఏటికి ఎదిరీదొద్దు
మండుతున్న గుండెల్ని రగిలిన్చొద్దు
నీ చితిని నువ్వు పేర్చు కోవద్దు
నీకు నువుగా రాలి పోయే అవకాశం
నీకెపుడు రాదు..
నిండు నూరేళ్ళు నువ్వు ఎంచుకున్న మార్గం
ఎపుడు తీసుకు పోదు..
అది లోపట, బయట కాదు
అంతటా ఒక్కటె నీతి సూత్రం
ప్రస్నిన్స్తే , ఎదిరిస్తే, గుంపును చేరదీస్తే
హక్కులు నూరి పోస్తే ..
నువ్వు ఎక్కడున్నా
అధికారం, ఆధిపత్యం ,అణచివేత
రాజ్యం గా మారి
నిన్ను బలి తీసుకుంటుంది
బలి పీఠం ఎక్కిస్తుంది
కోబ్రాలు, నయీమ్లు, సల్వాజుడుమలు
బ్లాకు టైగర్స్ , పొలిటికల్ రైవలరీస్
శత్రు వర్గాలు సైన్యాలు
నెత్తురు కళ్ళ చూస్తాయి
అది ఏ రూపం అయినా కావొచ్చు
ఏ క్షణం అయినా కావొచ్చు..
నువ్వు బడా బాబువు కాదు
అంది వచ్చే వారసత్వం లేదు
అందుకునే హస్తం లేదు
చేర దీసే చెలిమి లేదు
జస్ట్ వెయిట్ ఫర్ డెత్ !
ఎనీ టైం , ఎనీ వే, ఎనీ వేర్ !
బతకాలంటే చావడం నేర్చుకో,
చచ్చి పడుండడం
బతుకు మీద ఆశ ఉంటె
అవినీతి అడ్రెస్ తెలుసుకో
కుట్రలు కుతన్త్రాలలో
కుల్లడం నేర్చుకో
విజయమో వీర మరణమో..
బతకడమో బలి పీఠం ఎక్కడమో
చావడమో చస్తూ చంపడమో..
ఏదో తేల్చుకో ..ఏది కాకపొతే
నీ తొవ్వ నువ్వు చూసుకో..
చావో రేవో..
బతకలేనోడికి బాదలేక్కువ
బతక నేర్చినోడికి భయం ఎక్కువ
అన్యాయాన్ని సహించలేక
జీవితంలో వొడిపోలేక
నేనెపుడు గడప దగ్గరే ఉంటాను..
లాల్ సలాం అంటూ!
(సాంభ శివుని వధ..వ్యద లోంచి )
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Jayashankaraa, nee aalochanale maa aayudhaalu
- Tribute to Prof. Jayashankar Sir
- Jagadapati time deggara padindhi
- Nirantharam paarey Netthuti Dhaara
- G-andh(i/ra) giri
- Vi ‘grahala’ vidwamsam
- JP, you should be ashamed of yourself
- New story ‘Jai Bolo Telangana’
- CBN, kottha vesham
- Song on Mahabubabad firing


Tweet This
Digg This
Save to delicious
Stumble it