Praja Kshethram lo thelchukuntam
News pulse, Politics | admin | March 7, 2011 at 4:00 pm
కథ కంచికి మనం ఇంటికి..కూల్చేస్తం, కాల్చేస్తం, తేల్చేస్తాం, భూ కంపల్, భూ స్తాపితల్, చావో, రేవో..ఎన్ని మాటలు, ఎన్నెన్ని మాటలు..ఏమైందే అన్న? ఎం కాలే, గాడిది కొడుకులు చెప్తే ఇంటనే లేరు, మల్లా మా తెలంగానోల్లతోటే గీల్ల పని చెప్పాలే! ఎంత మాట అంటివే పెద్దన్న, ఎన్నేల్లకి కళ్ళు తెరుచుకున్నాయే..అటుతిరిగి, ఇటు తిరిగి సక్కగా ప్రజల కాడికి వచ్చి పడ్డం గాదె! వీడి తోని పొత్తు అంటివి, వాని తోని పొత్తు అంటివి, రాజీనామలంటివి, గెలిపించ మంటివి.అందరి లెక్ఖ చిదంబరం కాడ కమీటీల కోసం సంతకం పెట్టి వస్తివి, కమిటీ పని చేస్తలేదని డిల్లి కి పోతివి, కాళ్ళ వేళ్ళ బతిమిలాడితివి..ఎం కాక పోయే, ఎన్ని కష్టాలోచ్చేనే అన్నా! ఇగ ఏమి చెప్పాలే కాంగ్రేసోల్ల చేతలు , కథలు, ఒక్క అరుపు అరుద్దామనగానే(జస్ట్ అనుకొంగనే ) వెంటనే ప్రణబ్ ముఖర్జీ కబురస్తది, మనకంటే ముందుగానే అన్ద్రోల్లు పోతారు..వాళ్ళెంత చెప్తే అన్తనే..చెప్పినందుకు కాదు బాధ, ఆడు ఎట్లా చెప్తే అట్లా ఇనేతోల్లు ఉన్నందుకు.. ఇట్లాంటి వాళ్ళ మీద మనకు ఒకటే ప్రేమ..పైసలు ఇస్తం, పానలిస్తం, వాళ్ళను ఒక్క మాట అంటే జీవితాంతం మనోల్లతోని కొట్లాడతం ..ఎక్కడి ప్రేమ ఇది..నిన్న పులుల లెక్ఖ ఐపోదామని మనోళ్ళు అనుకున్నారు..అప్పటికి జూపల్లి రాజీనామా చేసిండు, ఆయనకి నచ్చ చేపుతారంతా! చెప్పు కొండి రా చెప్పుకోండి , మీ అసలు రంగు ఎపుడో బయట పడ్డది, ఇక బయట పడటానికి ఏమి మిగిలి లేదు. ఇయాల నల్ల రిబ్బన్లు నోటికి చుట్టుకొని మీ చేతగాని తనాన్ని బయట పెట్టుకున్నారు. మీ నోరు మూసే బాస్ లు అక్కడున్నారని మీ అంతట మీరే ఒప్పుకున్నారు. మీరు ఎందుకు భయ పడుతున్నారో మాకు తెల్వది కాని, మల్లా ప్రజల దగ్గర తలెత్తుకొని తిరుగుతరనుకుంటే మాత్రం పొరపాటే. మీకంటే మా ఊర్ల ఉన్న చదువు కొని అన్నలు , అక్కలు ఇయాల వంద రెట్లు త్యాగాలు చేస్తున్నారు,కడుపు కాల్తుంటే బతుకుని రోడ్ల మీద పెట్టి ఉద్యమం చేస్తున్రు..ఐతే గీతే వాళ్ళకోసం మా బతుకులు వెచ్చిస్తాం కాని, మీలాంటి స్వార్థ పరులు, చాత గాని చవటలు,బుద్ధి లేని, నీతి మాలిన వెధవల కోసం కాదు. ఇవాళ తెలంగాణా వస్త లేదంటే కారణం మీరు. మీరు రాజ కీయ నాయకులని, మీకు దమ్ముందని, మీ అమ్మ గారు అనుకోవట్లేదు, ఇక్కడైతే ఎవరు అనుకోవట్లేదనుకొండ్రి..చంద్ర బాబు నాయుడు కాడ కుక్క కాపలా కాస్తున్న వాళ్ళ గురించి ఇక్కడ అసలు మాట్లాడ దలచుకోలేదు..అట్టర్ వేస్ట్ ఆఫ్ టైం!
ఇన్నేండ్ల ఉద్యమంలో దండుకున్నది ఎవరు? త్యాగాలు చేసి తెలంగాణని నిలబెట్టింది ఎవరు? గుండెల మీద చేయ్యేసుకొని చెప్పండి..ఇప్పుడే అందిన వార్త తమ్ముడు మండపల్లి అశోక్, ఒయులో పిజి విద్యార్థి , మొన్న అసెంబ్లీ ముట్టడిలో పోలిసుల చేతిలో చావు దెబ్బలు తిని ఇయాల ఎమ్జిఎమ్ , వరంగల్ ఆసుపత్రిలో పానం వదిలిండు, మిత్రులారా, ఆత్మ హత్యలని అవహేళన చేసే మేధావులార, ఈ విద్యార్తి పిరికి వాడు కాదు, ప్లీస్ నోట్, నిన్నటికి నిన్న రైల్ రోకో రోజు, జమ్మికుంట చివర ఉన్న చిట్యాల మండలం , ఎంపేడు గ్రామానికి చెందిన నాగేల్లి రాజ నర్సు(35) వేలాది మంది చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని ఆత్మ త్యాగానికి పాల్పడ్డాడు, ఎనభై శాతం కాలిన గాయాలతో నేడో, రేపో అన్నట్టున్నాడు. ఈయన కూడా పిరికి వాడు కాదు, విప్లవోద్యమంలో ఆరు ఏండ్లు పని చేసి జన జీవన స్రవంతిలో కలసిన వ్యక్తీ. అంటే ఇక్కడ ప్రాణాలు వదలడం ముఖ్యం అని నేను చెప్పడం కాదు, అంత కంటే త్యాగాలున్నాయా అని చెప్పడం కోసమే, ఇంక నాకు తెలిసి చాలా మంది ఇల్లు వాకిళ్ళు మరిచి పోయి రాత్రింబవళ్ళు పోరాడుతున్నారు, ఉద్యమిస్తున్నారు. ఇవి హత్యా రాజకీయాలు కావా? ఇవి మోస పూరిత రాజకీయాలు కావా, నాలుగు కోట్ల మందిని మోసం చేయడం కాదా? తప్పెవరిది? మనం నమ్మిన వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తుంటే, కడుపు చించు కుంటే కాళ్ళ మీద పడుతునదని నోరు మూసుకొనే మానదా? మన మంచితన్నాన్ని తరాజు లో పెట్టి అమ్ముకునే మేక వన్నె పులులదా..ఎక్కడ లెఫ్ట్ పార్టీలు? ఎక్కడ రైట్ పార్టీలు ? ఎక్కడ విప్లవ సంఘాలు? ఏవి సిద్దాంతాలు? నిజంగా తెలంగాణా అంత జటిల మైన సమస్యా? జార్ఖండ్, ఛత్తీస్ గద్ ,ఉత్తరాఖండ్, ఎన్ని రాష్ట్రాళ్ళు విడి పోలేదు, విప్లవాల గడ్డ ఐన తెలంగాణా కి ఎందుకింత గతి? మనం నిజంగా తెలివి లేని వాళ్ళమ? త్యాగాలు చేయని వాళ్ళమ, యుద్దాలు ఉద్యమాలు కొత్తనా ? నిజాంల కంటే బలవంతుల వాళ్ళు ? రజాకార్ల కంటే రాక్షసులా? ఎవరిదీ తప్పు? ఎక్కడ తప్పు? ..ఎవడు బాగు పడ్డాడు ఈ ఉద్యమంలో..మళ్ళీ వేదించే ప్రశ్న..గుండెల్ని తోడే బాధ ..కలల్ని కుదించే తూఫాన్, జీవితాలని సమాధులు చేసే సందర్బాలు.. ఇక్కడ ఉద్యమం అనగానే రెండు రకాలు, ఒకటి పెయిడ్ ఉద్యమం నడుస్తది, ఒక స్పీకర్, పెద్దమనిషిని మాట్లాడానికి రమ్మంటే పైసలు అడుగుతాడు(చాలామంది), ఆయనకు ఎన్ని పైసలున్న సరే, ఇంక ఆట గాళ్ళు, పాటగాళ్ళు మొత్తం ఈ ఉద్యమంలో కొంత బాగు పడ్డారనే చెప్పాలి, ఇట్లనైన జర పొట్ట నింపుకుంటున్నారు. ఒకటే బాద ఏందంటే, పేద జాక్ లు , పల్లె ప్రజలు మీటింగ్ లు పెడితే మాత్రం ఎవరు వెళ్ళక పోవడం, ఇంక సిద్దాంతాల చర్చ, ఒక్కొక్కడిది ఒక్కో జెండా, గ్రూపులు, గుంపులు, మంచోడికి కష్టాలు, కుట్రలు, కుతంత్రాలు, కులాలు, కుళ్లులు, ఒకడు పండితుడు, ఒకడు పామరుడు, రూపాయలు సంపాదించే కూలీ వాడు వందలు అప్పుచేసి ఉద్యమాలలో ఖర్చు పెడితే వాడు ఊరోడు, చదువు లేనోడు, రెండు పాలిష్ ముక్కలు చెప్పి, రెండు అర్థం కాని సిద్దాంతాలు చెపితే, పట్నం వదలకుండా వాడు మీటింగుల మీద మీటింగులు పెడితే వాడు మేధావి, వారెవ్వా! .. ఎవడి లొల్లి వాడిది భై! డిల్లిల నో, ఇక్కడ గల్లి లో కూడా నో ..ఇపుడు ఏంచేయాలి?
ఫ్లాష్ న్యూస్! తెలంగాణా ఉద్యోగస్తులు సహాయ నిరాకరణ విరమించుకున్నారు! ఈ సమయంలో ఇది పెద్ద దెబ్బనే ఉద్యమానికి..ఎం చేద్దాం, అంత ఖర్మ అనుకోవాలే! ఈ సమయంలో కెసిఆర్ వెనక్కి రావడం , కాంగ్రెస్ వాళ్ళు నోరు మూసుకోవడం, ఉద్యోగస్తులు వెనక్కు తగ్గడం..ఉద్యమంలో పూర్తిగా మునిగి పోయి ఉన్న వాళ్లకి తిరుగు లేని దెబ్బ..అవును ఉద్యోగస్తులు ఇంతకంటే ముందుకు పోలేరేమో..మొదటి తారీకు, పిల్లలకి స్కూల్, పాలు, పరిక్షలు, అప్పులు..కడుపు కాల్చుకోలేరేమో..నిజంగా అదేనా కారణం? లేకపోతె వీళ్ళు కూడ ఏదైనా వత్తిడికి, బలవంతపు ఒప్పందాలకు, ప్రలోభాలకు గురి అయినార? ఎందుకు ఉద్యమం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి పోతుందీ? ఒక్క పార్టీ, ఒక నాయకుడు మీది పెట్టుకున్న ఆశలే కారణమా? ఒక్క జాక్ మీద కూడ నేడు ఉద్యమం ఆధార పడడం న్యాయ మేనా..ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తే తప్ప?
వినతి పత్రాలు, నిరసనలు, నిరాహార దీక్షలు ఇవి ఏమైనా పని చేస్తున్నాయ..అవును, ఆక్సిసన్ లాగ బతికే ఉంచుతున్నాయి కాని కేంద్రంలో కాని, సీమ ఆంధ్ర నాయకుల గుండెలో కాని ఏమైనా గుబులు పుట్టించే పనులు ఎందుకు చేయలేక పోతున్నయి? మనం మన నాయకులని ఇంకా నమ్మాలా..ఇన్ని హత్యలు చేసిన వాళ్ళను క్షమించాల? ఏమి తెలియని ప్రజలను పార్టీలుగా విడగోడుతున్నారు, చెడ గొడుతున్నారు, తెలంగాణా తల్లికి తీరని అన్యాయం చేస్తున్నారు, ఈ దగుల్బాజీ గాళ్ళు, రేపు కేంద్రం కళ్ళు తెరిచి విధి లేని పరిస్తితిలో తెలంగాణా ఇస్తే, ఈ దద్దమ్మలు (ఏ పార్టీ వాళ్ళు అతీతులు కాదు) అంత మా వల్లనే అని ఫోజు కొడితే, పూల దండలతోని స్వాగతం పలకాల? పోయిన పానాలకు వెల ఎంత, బాద పడ్డ ప్రతి క్షణానికి బదులు ఏందీ? నమ్మిన వాడి గతి ఏందీ..
ప్రశ్నల కాలం, తూఫాను ముందు ప్రశాంత వాతవరనమా? మరణానికి ముందు చావు తెలివా? ఎలాగన్నా అర్థం చేసుకోండి..పదే పదే ఒకే ఒక్క విజ్ఞప్తి..మనవి, విన్నపం..ప్రజలుగా కలిసుందాం, పార్టీలను ఒక్క తాటిపై పెడదాం..ఇక్కడ తీస్ మార్ ఖాన్ లెవరు లేరు..జస్ట్ లెట్ అస్ నాట్ బాదర్ అబౌట్ టో లుక్ ఫర్ బెటర్ డెవిల్..లేట్ అస్ ట్రేస్ అవుట్ తెం..డెవిల్ ఇస్ ఏ డెవిల్ !
ఉద్యమ రూపాలు మార్చాలి, అవతలి వాడికి వణుకు పుట్టాలి, మేధావులు ఎపుడు ‘మేత ఆవులె’, శాంతి మంత్రాలూ దెయ్యాల ఘోశాల్లాగా వినపడుతున్నాయి.. ఒక చిన్న ఆలోచన రేపు పెరిగి పెరిగి పెద్దది కావొచ్చు..మనం పట్టు పడితే నాయకులు మారతారు, నాయకులు మారితే కేంద్రానికి చేరతారు..ఇక్కడ ప్రజలను పక్కన పెట్టి నాయకులను లెక్ఖ పెడుతుంది కేంద్రం, అసలు సంగతి ఏందంటే నాయకులు అందరు కూడా దద్దమ్మలే, దగుల్బాజీ గాల్లే, అదీ కాకపొతే ముద్దుగా చెప్పాలంటే ‘అమాయకులు’ , నోట్లో వేలు పెడితే కోరక రాని వాళ్ళు, అది కూడ కాకపొతే మా వాడు మంచి వాడే కాని కేంద్రం మంచిది కాదు, సీమ ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు కాదు..ఇదే ప్రశ్న సరదాగా వారిని అడిగితె..వినే దమ్ము ధైర్యం మనకి ఉంటె..వాళ్ళ మాటల్లో చెప్పాలంటే తెలంగాణా నాయకులు పిరికి పందలు, మేను ఎంగిలి మెతుకులు వేస్తె తినే వాళ్ళు ..మీకు మీవాళ్ళు గొప్ప కావొచ్చు మాకు మాత్రం పెద్ద జోకర్స్! మీ వాళ్ళే మాకు సహాయం చేస్తున్నారు, మీరు అనుకునే పెద్ద నాయకులకి ఇప్పట్లో తెలంగాణా అవసరం లేదు! ఇవి మామూలు వాళ్ళు అన్న మాటలు కాదు..ప్రబుత్వ యంత్రాంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వాళ్ళు అన్నవి! థాంక్స్ టు కావూరి, నిజాలు చక్కగా చెప్పిండు, కనీసం ఒక్కడన్నా రాజీనామా చేయ గలిగేంత మాట అన్నడు..మా వోల్లు రత్నాలు అన్న! పానాలు పోతున్న పదవులను వదలరు..తెలంగాణా గొంతు ఎండి పోతున్న కూడ, స్మశానాలు కూడ మిగలని తెలంగాణాని చూసి కూడ కదలరు, ఆదివాసీలు , అడవి, ఆడ బిడ్డలు ఆకలితో అలమటించి చస్తున్నా కూడా..చెట్లు, పుట్టలు, గుట్టలు , గుళ్ళు ఎన్ని మింగినా కూడా కదలరు.
సరే, సంధి కాలం..బాదైతుంది అన్న! మస్తు బాద ఐతుంది ! నాకే కాదు నాలుగు కోట్ల తెలంగానోల్లకు..ఎం చేయాలే మనందరం..ఆలోచించుడ్రి..ప్రజలతో మాత్రమె ఉండుండి, రేపు జాక్ కాల్ బొగ్గు ఆపాలే, సీమ ఆంధ్ర ఉత్పత్తులు బందు పెట్టాలె, బిల్లులు కట్టటం బంద్ చేయాలే, ముందు ఏ ఒక్క పార్టీఒడిని దగ్గరకు రానీయకుండా ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలే..ముందు రాజీనామాలో, వత్తిడిలో తేక పొతే ఎవ్వడిని తెలంగాణాల అడుగు పెట్ట నీయకుండా చేయాలే..
సారీ..నిరాశ జర ఎక్కువైందా..వుయ్ కాంట్ ఎస్కేప్ సం టైమ్స్ !
పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప! జై తెలంగాణా!
వస్తే రాన్నియ్, కష్టాల్, కన్నీళ్..
జై తెలంగాణా!
Related posts:
- Prantheeya Mandali? Dy CM in Delhi
- Ningi ki egasina Telangana keratam
- Jupally starts his Telangana yatra
- Telangana Raktha Kanniru
- Exams are done, now summer vacation?
- ఎవరక్కడ …రా(ణి)జు గారి ఆజ్ఞ!
- Telangana katha modhatiki vacchindhi
- New story ‘Jai Bolo Telangana’
- Ekkada Paareskunnamoo Akkadney Vetthukovaleyy
- Nee Gori Kadtham Andhra Sarkarodaa…


Tweet This
Digg This
Save to delicious
Stumble it