Problems for CBN and Chiru?
News pulse, Politics | admin | March 28, 2011 at 3:17 am
నల్లధనం కేసులో నిందితుడిగా ఉన్న హసన్ అలీ తాజాగా వెల్లడిస్తున్న విషయాలు కొంతమందికి కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. వారిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉంటూ కాంగ్రెస్ నేతగా మారిన చిరంజీవిలకు మరీ చికాకుగా మారే సూచన కనిపిస్తుంది. ఎందుకంటే హసన్ అలీ చెప్పిన విషయాలలోఒక మాజీ సి.ఎమ్. అని, ప్రతిపక్ష నేత అని, ఓ సినీ హీరో అని, పేర్కొంటూ వారి నల్లధనాన్ని తాను ఆపరేట్ చేశానని, విదేశాలకు హవాలా ద్వారా తరలించడంలో సహకరించానని చెప్పడంతో సహజంగానే ఎవరా ఆ మాజీ సి.ఎమ్ అన్న ప్రశ్న వస్తుంది. ఇక ఊహాగానాలు కూడా ఆరంభమవుతాయి.
వీరికి సంబందం ఉందో లేదో తెలియకున్నా రాజకీయ నాయకులు వీరి పేర్లను కూడా విస్తృతంగా ప్రచారంలో పెడతారు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్ధులు వారి క్రెడిబిలిటిని దెబ్బతీయడానికి ఆరోపణలు కూడా గుప్పించవచ్చు. జనంలోకి అనవసరంగా అనుమానాలు వ్యాపింప చేస్తారు.ఇదంతా పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇప్పటికే చంద్రబాబు పేరు చెప్పకుండా , ఆయన అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యతిరేక ఛానల్ ఒకటి ఇలాంటి ప్రచారం ఆరంభించింది. పైగా రెండు ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ధనాన్ని అందించానని ఆయన చెప్పడం కూడా మరో సమస్య. చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనేజ్ మెంట్ లో దిట్టగా పేరొందారు. సాధారణంగా ఎన్నికల సమయంలో నల్లధనం ఖర్చు చేయని నాయకుడు అంటూ ఎవరూ ఉండరన్నది బహిరంగ రహస్యం.
కాని హసన్ అలీతో సంబంధాలు ఉంటేనే ఇప్పుడు చిక్కు వస్తుంది. అలీతో సంబంధాలు ఎవరికి ఉన్నాయో లేవో తెలియకుండానే ఆయా ప్రముఖుల పేర్లపై వదంతులు సృష్టించడంలోనే అసలు సమస్య వస్తుంది.హసన్ అలీకి చంద్రబాబు, లేదా చిరంజీవికి సంబంధాలు అంటగట్టి ఇబ్బందిపెట్టాలని కాంగ్రెస్ నాయకులు, అలాగే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టి యత్నం చేస్తారు.నేరుగానే ఆరోపణలు గుప్పిస్తారు.
ఈలోగానే ఆ మాజీ సి.ఎమ్ లు ఎవరికి హసన్ అలీతో సంబంధం ఉన్నది ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ప్రకటిస్తే, వీరికి సంబంధం లేకపోతే ఎలాంటి సమస్య ఉండదు. కాని ఆ పేర్లు వెల్లడి కాకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వీరిద్దరిని చికాకుకు గురి చేసే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే టిడిపి నేత ఎస్.వేణుగోపాలాచారి మీడియాతో మాట్లాడుతూ హసన్ అలీ ఓ మాజీ సి.ఎమ్. అంటే అది వై.ఎస్.రాజశేఖరరెడ్డేనని తేల్చేశారు.
Related posts:
- Is KK’s proposal valid?
- Nagam says he will support Jagan if…
- TDP challenges Jagan’s YSR Cong
- Jayasudha avoiding Jagan’s party?
- Does Chiru know poli ‘tricks’?
- Did CBN change his strategy on T?
- What did the Governor tell the center?
- Balanaagi Reddy drama
- Chiranjeevi ki inko pareshani
- Congress ku August bhayam


Tweet This
Digg This
Save to delicious
Stumble it