Telangana katha modhatiki vacchindhi

News pulse, Politics | admin | March 2, 2011 at 7:13 pm



తెలంగాణా కథ మళ్లీ మొదటికొచ్చింది
తెలంగాణా అంశం రాత్రికి రాత్రి పరిష్కారమయ్యేది కాదు : చిదంబరం

తన చుట్టూ తాను తిరుగుతూ
సూర్యుని చుట్టూ పరిబ్రమించే భూమి లాగా
ఆశయం చుట్టూ తిరుగుతుంది ఆవేశం(శ్రీ శ్రీ)
తెలంగాణా చుట్టూ తిరుగుతుంది పానం..పోరు తెలంగానం..

తెలంగాణా అంశం చాల సున్నితం, ఒక్క రోజులో తేల్చేది కాదు, అందరూ సహకా రించాలి, సహనం, శాంతి తో ఉండాలి! అన్ని పార్టీలు అభిప్రాయం వెల్లడించాలి ..ఎక్కడో విన్నట్టుగా లేదు? చెవులో ఇంకా మారు మొగట్లేద ? సేం డైలాగ్ , సేం పెర్సన్, బట్ ఇయర్ చేంజ్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ జస్ట్ ఫ్వూ హండ్రెడ్ లైవ్స్ ! అయన పేరు ది గ్రేట్ చిదంబరం, ఆయనని హోం మినిస్టర్ అని కూడా అందురు, అయన ఎంతో తెలివి ఉన్నవాడుగా కనపడును, ఎంతో పేరున్న హార్వర్డ్ స్కూల్ లో చదివినా కూడ, చాల విషాదకరమైన విషయం ఆయనకి చిన్న చిన్న విషయాలు కూడా తెలియక పోవడం..వేరి సాడ్ స్టేట్ అఫ్ అఫ్ఫైర్స్.. ఐతే అయన మర్చి పోయింది ఒక్కటే, ద ప్రాసెస్స్ అఫ్ ఫార్మింగ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణా విల్ బి ఇనిషిఎటేడ్! కనీసం కొంచెం దిమాక్ ఉన్న కూడ, ఏడ వదిలేసినమో ఆడనుంచే మొదలు పెట్టాలె, గాయింత ఇంగిత జ్ఞానం లేనోడు ఇంత పెద్ద దేశానికి, ముఖ్య మైన విభాగానికి మంత్రి యితడు, ఈడనే తెలుస్తది అసలు సంగతి. సరే ఇప్పుడు ముచ్చట ఏందంటే, కథ మల్లా మొదటికి వొచ్చింది. అందరు రావాలే, మాట్లాడుకోవాలే, చాల రాగస్యంగా..ఓకే! మనోడు చెప్పడు, బయటోడు చెప్పడు లోపట ఎం కుట్ర జరిగిందో..అసలు పెద్ద కులం అంటే వీళ్ళదే, ఎంత వినయం, విధేయత, ఎంత నమ్మకం, అవకాశం, ఇక్కడ మాత్రం ప్రాంతీయ బేదాలు ఉండయి , కుల మత ప్రస్తావన ఉండదు, ఎన్నికలప్పుడు తిట్టుకున్న బండ బూతులు అన్ని మరిచిపోయి ఎంతో ఐకమత్యంగా ఉంటాం. అన్న లోపట పిలుస్తాడు, అందరిని బెదిరిస్తాడో, బుజ్జగిస్తాడో ఎంతైనా హోం మినిస్టర్ కదా, పతోక్కని చిట్టా ఉంటది..ఇనక పొతే బిడ్డా జగన్ గాడికి పట్టిన గతే పడతది..ఇయాల జగన్ సడ్డెన్ గా కాంగ్రెస్ కి చెడ్దోడు అయితడు, అయన ఆస్తుల వివరాలు అన్ని బయటికి వస్తాయి, అన్ని అక్రమ ఆస్తులే ఉంటాయి, అవి ఇయ్యాలనే మన ముందుకు వస్తాయి, ఏ చానెల్ ఐతే పోగుడుతాయో అవే మల్లా ఆయనని విలన్ గా చూపిస్టే .. అన్ని రకాల వత్తిడిలు వస్తాయి.. బ్లడి పోలిటిక్స్! కనీసం ఒక్క పార్టీ అన్న జర పట్టు బట్టి ఉండి ఉంటె, ఇదే ఉద్యమ స్పూర్తి ని అప్పటినుంచి నడిపిస్తే, కనీసం కొన్ని పానాలు అయినా దక్కుతుండే కదా..కొన్ని భూములు, ఇంకొన్ని విలువైన వనరులు

అసలు ఇప్పటికైనా ఈ శాంతి కాముకులకి, కపోతాలకి, కబూతర్లకి , ఎన్నికల పిచ్చోల్లకి అర్థం కావాలె, కేంద్రానికి ఎం భాష అర్థం అయితదో! దొంగలకి, దోపిడీ దార్లకి వణుకు ఎట్లా వస్తదో, సంవత్సరం కింద వాడు మసి పూసి మారేడు కాయ చేస్తుండు రా భై అంటే ఒక్కడు ఇనలే, అన్నోల్లని అందరిని ద్రోహులుగా చుసింరు! కమిటీలు అని కథల్ బడ్తున్నారు సారూ అంటే, కాదు తెలంగాణా ఇస్తానికే అని మల్లోకసారి మనసార నమ్మిన్రు, పిచ్చి నమ్మకాలకి మారు పేరు మా తెలంగాణా, ‘బుద్దూ’ మా ఇంటి పేరు, గుడ్డి నమ్మకాలకి ఇక్కడి ప్రజలు దాసోహం, లవ్ ఇస్ బ్లైండ్ యు సి ! చానా ప్రేమిస్తారు కండ్లు మూసుకొని..ఇంగ ఎం చెప్పుదు సారూ .. కమిటీ తెలంగాణా ఇస్తదేమో అని మావోల్లు పడి పడి రిసర్చ్ చేసి రాసిన్రు , ఇపుడయి ఏ చెత్త బుట్టలున్నాయో అని ఎతుక్కున్టున్రు, అది వేరే విషయం. ఒక్కసారి కమిటి రిపోర్ట్ చూడంగానే కళ్ళు తెరుచుక్కున్నాయ్, చాన మందికి గుండె (నొప్పోచ్చింది) బలిగింది … సీమాన్ద్రోల్లకు ఇసొంటియి కొట్టిన పిండి కాదె! ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు ఎప్పటి లేక్ఖనే. మల్లా మా అన్నలు బిజీ ! కమిటీల ఉన్న తప్పులన్నీ చూపనికి, ఎం సావోచ్చింది అన్న! అసలు విషయం పక్కన బడ్డది.. ఇంతకి సిదంబరం సారుకి మల్లా ఉద్యమం ఊపందుకొంగానే తెలంగాణా గురుతోచ్చింది. వాళ్ళు ఇచ్చే డబ్బు మూటలూ ఎన్నో కనుక్కోవాలి ముందు..సగం తెలంగాణా రాసిస్తామని అన్నారేమో..మొత్తం రాసుకొన్దిర భై, కేంద్రానికి సీమాంద్ర రాజకీయ నాయకులంటే ఇంత ప్రేమ ఉందని తెల్వక పాయె..విడదీయ రాని భంధం..’పెద్దాపురం’ ల ఏమైనా కాంట్రాక్టు లు ఉన్నాయేమో చిదంబరాన్ని అడగాలి మరి, తప్పదు.. ఉద్యమ రూపాలు మాత్రమె అని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి జర, అసలు తెలంగాణా ఉద్యమం అంత ఒక రాజకీయ నాయకుని చేతిలనే ఉన్నది, మల్లా ఎలక్షన్లు వచ్చిందాకా పుర్సతి, కలెక్షన్ల తోటి సరి పుచ్చుకుంటారు తియ్ అని అందరు అనుకున్నారు. ఒకడు అన్ని సార్లు మోసం చేయ లేరన్న సత్యం ఇప్పటికైనా తెలిసొచ్చింది . పాపం తెలంగాణా ప్రజలు రోడ్ల బడ్డరని తెలవక పాయె, ఇక్కడ జరిగిన ఉద్యమాలు ఎంటియో కూడ అందాజా లేకపాయే, సాయుధ పోరాటాలు, దొరల గడిలని కూల్చిన విప్లవ రాజకీయాలు, ఇయాల్టికి కూడా దేశ రాజకీయాలను శాసిస్తున్నది ఇక్కడి బిడ్డలే, ఇంకా చాన ఉన్నాయి గాదె ! ఏ ఒక్క రాజకీయ నాయకుడు వేషాలేసినా వాని పని అయి పోయినట్టే ..ఇయాల జనం ఖబడ్దార్ అంటున్రు.

ఇంగ కేంద్రం కథ అట్టుంచితే, కమీనే గాళ్ళు సీమ అన్ద్రోల్లు(అంటే సామాన్య ప్రజలు కాదు) ..మా దేవినేని ఉమ, జేసి, కావూరి, లగడ పాటి లాంటి దొంగ మొహాలు మల్లా ఒక్క తానికోచ్చినయి..అదే కులం, దోపిడీ కులం..ప్రజలని గులాం లెక్ఖ మార్చే జనం! వాడింట్ల పీనుగెల్ల , శ్రీకాకుళం ల కాకర్ల పల్లి పవర్ ప్లాంట్ కి వ్యతిరేకంగా వడ్డి తాండ్ర దిక్కు జానాలని కాల్చేస్తున్రు, అమాయక ప్రజలు బలి ఐతున్నారు, ఆడ పోయి వాళ్ళను పట్టించుకునే దిక్కు లేదు, మీకు వోల్ట్లేసి గెలిపించినోల్లకి పనిచేయన్న్దిర ముందు , తరువాత వేరే ప్రాంతాలను దోచుకున్డురు గాని, వెధవల్లారా ప్రజలు అల్లాడి పోతున్నారు, పోలీసోళ్ళని అడ్డంబెట్టుకుని బతికే చావ చచ్చిన చచ్చు మొహాల్లారా, ఉత్తరాంద్ర ఎనక బడి ఆగమైతుంది, మస్తు మంది పేద అన్ద్రోల్లు ఆకలి తోటి మాది మసైతున్నారు..వాళ్ళ గోడు ఎవడినాలే..నిజంగానే వాళ్లకి గనక బుద్ది ఉంటె, మీలాంటి వాళ్ళని సముద్రంల ముంచి సావ గొట్టాలే, చేపలు అమ్ముకోనియ్యరు, గంగవరం పోరాటాలు గుర్తు తెచుకొండ్రి, కాకినాడ సెజ్ లు, కోస్టల్ కారిడార్లు, దానికోసం మా గిరిజనులను బలి పెట్టి, పోలవరం కడుతున్నారు.. ఆయిలు అంబానిగాడికి అమ్ముకుంటారు, భూములన్నీ ఉన్నోడికి దార దత్తం చేస్తారు..ఆంధ్ర అక్కల్లారా , అన్నల్లార, పేద ప్రజలారా..ఒక్కోడిని పట్టి అడుగున్రి, ఎండు చాపలేక్ఖ ఎండ గట్టున్రి ..మేము కూడా మేవెంటే ఉంటాం ! ఈ గలీజ్ దోకేబాజ్ గాళ్ళు ఎవడైనా ఒక్కటే..దోచు కోనేతోన్ని దంచి కొడదాం..నడుం గట్టున్రి! గుతపందుకొండ్రి ! శ్రీకాకుళ పోరాటం వారసత్వం పుణికి పుచ్చుకొండ్రి..

మా పోరగాల్లు ఇంత మంది సచ్చినా బుద్ది రాక పాయె..ఎంతైనా వాడి దైర్యాన్ని మెచ్చుకోవాలే! మా హైదరాబాద్ అని గగ్గోలు పెట్టే మనం , పొద్దున్న లేస్తే తమ్మి మనోళ్ళు టివిలల్ల దంచుడే కాని, మన నట్టింట్ల వాడు కూసోని ప్లాన్లు ఎస్తాడు వాణ్ని మాత్రం ఏమి చేయలేక పోతం..రోగానికి మందు సరిగ్గ ఎక్కాలే లేకపోతె అది ముదుర్తది..అదే అయితుంది ఇపుడు..ఇంత పెద్ద రాజకీయ పార్టీ అంటే భయమున్నోడు అట్లా మాట్లాడతాడా? ఒక శివసేన సైన్యం లెక్ఖ తయారు కాలేకపోతే అదేం పార్టీ , అంటే జర భయ పెట్టనికి మాత్రమె అన్న, మొత్తం అట్లనే అని కాదు అర్థం. అయినా నిన్న కేటిఅర్ గారు జర భయపెట్టినట్టే మాట్లడిన్రు..చూడాలే. మనం అసెంబ్లీ బహిష్కరిస్తే వాళ్ళు కూడ బహిష్కరిస్తర్, మనం ఎం చేస్తే అదే చేస్తారు, దాని పేరు ఉద్యమం అంటారు, విప్లవోద్యమాలకు ఊపిరి అయిన ఉత్తరా, కోస్తా ఆంధ్ర పరువు దీస్తున్నారా మీరంతా.. ఈసారి లేక్ఖలు మారతాయి..తెలంగానోల్లకు చాతగాదు అనుకుంటున్రు, అంతా ఇక్కడి రాజకీయనాయకుల లెక్ఖనే ఉంటారు అనుకుంటున్రు..ఒక్క సారి జెపి గాడికి, మా నాగం అన్నకి సాంపిల్ చూపించినం..ఆ తరువాత మీ ఇష్టం.

పోరాటం చేసే ప్రజలు చిత్తసుద్దిగా చేస్తున్రు, రాజకీయం చేసే నాయకుల మీదనే ఉంది చిదంబరం కథ, మల్లా ఇంకొక సారి వాడి ఎత్తులు , జిత్తులు మా మీద రుద్దనికి ప్రయత్నిస్తే కాళోజి చెప్పిన తీర్గనే పాతరేస్తారు మావోల్లు, జర భద్రం! చాతకాకపోతే మీరు కూడ ప్రజల లోకి వెళ్ళండి, పార్టీల పేరు చెప్పుకొని బతకొద్దు..నాలుగు పార్టీలు ఒక్క తానికొచ్చి ఒక జాక్ పెట్టుకోవచ్చు కదా..ప్రజల మధ్యల వచ్చి లొల్లి ఏందీ రా భై.. అవును మీరు పారసైట్లు, వాడు తెలంగాణాల పడి తినుకుంట వదలడు, మీరు మా మీద పడి బతుక్కుంట ఒక్క పని చేయరు..మేము లేకపోతె మీకు దిక్కేవడు? ఇప్పటికైనా, ప్రజలు చెప్పినట్టు వినండి, వారి తోటే మీ బతుకు అని గుర్తు పెట్టుకోండి..

నేను పూర్వం నిజం సుమ్మీ
నిన్ను పూజించాను నమ్మి
పోయే నా విశ్వమంతా
మారే నా భావాల పంధా

యువతరం విసిగింది బాపూ
నవతరం విసిరింది బాపూ
వెతుకుతున్నది కొత్త రోజులు
దులుపుతున్నది పాత బూజులు (శ్రీ శ్రీ)

తెలంగాణా కదం తొక్కుతుంది శ్రీ శ్రీ ..చూస్తున్నావా..అడనుంచే ఒక కవిత పడేయ్ జర..

Courtesy – Sujatha Surepally, thank you for sharing.

Related posts:

  1. Ayomayam lo Azad and Co.
  2. Prajala chethila Telangana udyamam
  3. Samaikyandhra – oka portatam kadu, it is a poti
  4. Telangana in cross roads
  5. Dhikkaristhunna Telangana – Deeksha Telangana
  6. KCR Hyd la thiruga ledu – Danam & Mukesh
  7. Ningi ki egasina Telangana keratam
  8. Telangana Naatakaala mela
  9. Banchan kaadu Doraa… Baakulam
  10. CBN, kottha vesham

Leave a Reply

Spam protection by WP Captcha-Free