Telangana Raktha Kanniru

News pulse, Politics | admin | March 23, 2011 at 12:28 pm


మళ్లీ ఒక మోసం, దగా, కుట్ర..తెలంగాణా చరిత్ర అంతా రక్త చరిత్రే! కన్నీటి కాల్వలే, గుక్కెడు తాగు నీరు లేకున్నా..ప్రతి ఇంట్లో పొంగి పొరలే కన్నీరు..రక్త కన్నీరు! ఏ జన్మ పాపం ఇది? ఎక్కడి శాపం ఇది? బిడ్డల ప్రాణాలు గాల్లో తన్లాడుతున్నాయి, ఎవడి కోసం మేము త్యాగాలు చేసినం అని ఆత్మలు ఘోషిస్తున్నాయి . అయ్యల్లారా, అమ్మల్లారా, మేధావి వర్గాల్లార, రచయితలారా, ఉద్యమ కారులార మా చావులను చూసి అయినా ఈ లోకం చలించ లేదా, మేము ప్రాణాల్నే త్యజించినాము మీరు కనీసం కొద్ది మంది వ్యక్తులను మార్చ లేరా..ఇంక ఎన్ని శవాల గుట్టలు మీకు కావాలె..ఎంత మంది తల్లి తండ్రుల దుఖాలు మీకు కనువిప్పు కలిగిస్తాయి అని దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నారు. ఈ శాంతి వనంలో , శాంతి ఉద్యమ ప్రయాణం లో ఎన్ని శవ యాత్రలు చేసామో ఎవరైనా చెప్పగలరా? ఎన్ని మోసకారి మాటలు విన్నమో గుర్తు పట్టగలరా?

మళ్లీ మళ్లీ అదే ప్రశ్న , వెంటాడుతూ వేదించే ప్రశ్న, ఎవరు బాద్యులు? శ్రీ కృష్ణా టాకీస్ లో మరో సినిమా విడుదల, దాని పేరు ‘చాప్టర్ ఎనిమిది’, నీయబ్బ , ఎవడురా వాడిని న్యాయ వాది అన్నది ? వాడు మంచి వాడే అంట కాని పక్కనే ఒక దుశ్శాసనుడు, దుగ్గల్ అని ఒక దగుల్బాజీ గాడు ఉంటాడు అంట ..కొస మెరుపు..కేవలం నలభై కోట్లు మాత్రమె ఖర్చు అయినాయి ఈ ప్రోడుక్షన్ హౌసు కోసం. స్క్రీన్ ప్లే , కథ, నిర్మాత, ఎడిటింగ్ అంతా లగడపాటి గాడే అనుకుంటా! వాడు కాకపొతే కౌన్ కిస్కా గాడు, అచ్చం అన్డ్ల ఉన్నట్టే మీడియా ల పని అయితుంది, పోలీసులు వీరంగం శ్రుష్టిస్తున్నారు, కిరణ్ కుమార్ గారు అతి చాక చక్యంగా డబ్బులు ఎర చూపి అందరిని కొంటున్నాడు, కాంగ్రెసోళ్ళు డిల్లిల చిన్నిల్లు పెట్టుకోవాల్సి వస్తుంది పాపం , నెలలు నెలలు ఉండడం అంటే కష్టం కాదా! మనం కూడ పెద్ద మనసు చేసుకోవాలె..ఎంత కష్టం పడుతున్రు మనలని నమ్మించ డానికి, రాజ కీయాల లోకి పోవాలె అంటే నాటక రంగంలో కాని సినిమా రంగం లో కాని అనుభవం ఉండవలెను , లేకున్నా పరవాలేదు వచ్చినంకా చాన నేర్చుకుంటారు..తరువాత ఆస్కార్ అవార్డ్ కి అందరిని పంపించాలే.. ఇంక టిడిపి వాళ్ళు చెంగున డిల్లి కి పొతే పెద్దన్న రెండు నిముషాలు కూడ టైం ఇయ్యాక పాయె..అయినా సిగ్గు శరం రాదు మనోళ్ళకి..అవన్నీ ఉంటె రాజ కీయ నాయకులు ఎందు కైతరు? ఇక్కడున్న పెద్దన్నకి జర జరం వొచ్చింది, చాల మెత్త బడి ఉంటాడు, అయినా రాజీనామాలు , వోట్లు , సీట్లు కాక ఇంకేమైనా అడిగితె ఆ సారుకి ఏడ అర్థం అయితది ? జాక్ లీడర్లని అర్రెస్ట్ చేస్తున్రు సారూ అంటే సప్పుడు లేదు, నీ పార్తీలనే అమ్ముడు పోతున్రు అంటే ఒక చిన్న మాట మాత్రమె మందలింపు, లోపట లోపట ఎంతో సంతోషం నా గురించి ఎవరు తెలుస్కోక పోయినందుకు.. పోయిన జన్మల దలై లామ అయి ఉంటాడు , ఎంత శాంతి? సారుకి ఒక్క టీడిపి వాళ్ళే కనిపిస్తారు తిట్టనీకి , మరి కాంగ్రెస్ మీద లవ్వు ఎందుకో?
మిలియనియం మార్చ్ తరువాత విలీనం మార్చ్ ప్లాన్ చేస్తున్రా సారూ? ఆ పని చేస్తే మేము మీకు ఎంతో రుణ పడి ఉంటాము, మా జాక్ కూడ కేవలం ఒక పార్టీని మాత్రమె తిడుతుంది అప్పటికి మీరు ఏదో ప్రాణాలకు తెగించి ఉద్యమము చేస్తున్నట్టు..అన్న జర బద్రమే, అందరి పార్టీల కెంచి బాగానే నీ పార్తీలకోస్తున్రు కాని మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు వీరంతా ఒక్క సారి తిరగ బడితే ఎట్లుంటది ..ఇప్పటికే కొత్తగోచ్చినోల్లకి , పాతగున్నోల్లకి పడట్లేదు అంట , లోపట లోపట చాన మసలు తున్నది ..చెప్పటం మా బాద్యత అన్నా! మీరు పోరాటం చేయనికి సిద్ధంగా లేరని ఎన్నో సార్లు నిరూపించారు, అట్లనే ఈ జాక్ ని కూడ పని చేయనివ్వం అని చిదంబరం చేతిలో చెయ్యి వేసి చెప్పి ఉంటావని కూడా మాకు ఎరుకే..ఎంత నిబద్దత తో పని చేస్తున్నావు..మాటలు తప్ప చేతలు లేని నీలాంటి నాయకుడు తెలంగాణా తెస్తదంటే , అది మేము అందరం నమ్మితే ఈ జన్మకి తెలంగాణా మాత్రం రాదు..నవ్వకే అన్న, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగుతుందని సంతోషమా?

ఎమాటకి ఆమాటే చెప్పుకోవాలి, అన్ద్రోల్లను చూస్తుంటే చూడ ముచ్చటేస్తుంది..వాళ్ళు ఏ ఉద్యమం చేపట్టకుండానే పనులన్నీ చక చక చేసుకుంట పోతున్రు, కేవలం కొద్ది మంది మనుషులు సోనియామ్మని, చిదంబరాన్ని కోనేసిన్రు , ఆఖరికి న్యాయ వాదుల చేత అన్యాయమైన, నీచమైన, హేయమైన రిపోర్ట్ ఇప్పించిన్రు.. అందుకే వాడు గొప్పవాడు, యుద్ధంలో గెలవడమే ముఖ్యం..మనం కొత్తగా చెప్పిన థియరీ కాదు , రామాయణ , మహాభారత కథల కూడా ఉన్నది కాదె! రిపోర్ట్ చదువుతుంటే అచ్చం రాయపాటి , లగడ పాటి ఎదురుగా కూర్చుని కాఫీ తాగుతూ వారి నోటి వెంట ఇన్నట్టూ లేదు? ఎమన్నా చెప్పుండ్రి, కండ్లు దిమ్మ తిరిగినాయి పొద్దుగాల దిలీపు ఫోన్ల చెప్పినంక , నమ్మకం కలగక , ఎక్కడన్నా తప్పు జరిగిందేమో అని ఆత్రంగా సదివితే పానం ఒక్కసారే కూలబడ్డట్టు అయింది. అయినా పిచ్చి కాని, చిదంబరం దొర పోయిన సారి ఆల్ పార్టీ మిటింగ్లనే ఈ విషయం చర్చించి ఉంటాడు మనోళ్ళు ఒక్క గంతేసి ఒప్పుకొని వచ్చి బయట రాజీనామాల డ్రామాలు ఆడి ఉంటారు.. కొంచెం సినిమాకి టైం పడతది కదా అప్పటి దాకా మాకు పార్టీ శ్రేణులని తయారు చేసి పెట్టమని శ్రీ శ్రీ శ్రీ కెసిఆర్ గారికి చెప్పి పంపి ఉంటారు. మీ పోరగాల్లు పానాలు పోతానే ఉంటాయి, మీ గొర్రెలు మీ గొప్ప నటనా కౌశలానికి వీర లెవెల్లో చప్పట్లు కొడతానే ఉంటారు , అని భరోసా ఇచ్చి ఉంటారూ..

అరే ఇంత పెద్ద మోసాన్ని ఆ పెద్ద మనిషి నారాయణ రెడ్డి గారు ఎంతో కష్టపడి బయట పెడితే, మనోళ్ళకి చీమ కుట్టినట్టయినా లేకపాయే, రేపు గిట్ల బంధు పెడతా రేమో అనుకున్నాం! అంత లేదు అని తెలిసింది, జాక్ మీటింగ్లో దుమ్ము దులుపుతున్నారు, రేపటినుంచి తెలంగాణా ల మరొక ఉద్యమ రూపం ఉంటదని సాయంత్రం దాక ఓపిక పడితే..ఏమున్నది అన్న ! దిష్టి బొమ్మలంట..తగల బెట్టి, తగల బెట్టి యాష్టకోచ్చింది, తరువాత నిరసన ప్రదర్శనలు అంట, ఎంత గొప్ప పోరాట రూపాలు, ఆటు పిమ్మట సదస్సులు..అవును యునివర్సిటీల పాటాలు చెప్పుకొనే సారూ ని తీసకచ్చి నాయకుడిని చేస్తే అంతా కన్న ఏమైతది, దయ చేసి మీరు ఎవరైనా పేపర్ ప్రెసెంట్ చేస్తే తప్పక గడువు లోపల ముందుగ ఆబ్స్ట్రాక్ట్ పంపించ గలరు. నాకు తెలవక అడుగుతా , గీ పోరాట రూపాల తోటి ఎవడికి నష్టం , కష్టం ? కష్టం నష్టం లేకపోతె చేసుడు ఎందుకు? ప్రతి సారి రాజకీయ నాయకులు ముద్దుగా ముచ్చట్లు చెప్పుకుంట ఉంటారు, మేమే ఎందుకు సావాలే? సారి, శాంతి యుత మైన యుద్ధం అంటే ఇదే అని మనం కథలు రాసు కోవాలి కదా! పుస్తకాలు అచ్చు వేసుకోవాలి, అన్యాయాలని మళ్లీ మళ్లీ పైసలు ఖర్చు పెట్టి చెప్పుకోవాలి..పుణ్య కాలంల ఇంకొంత మంది మా అసొంటి పిచ్చోళ్ళు పుటుక్కు మంటారు..గంతనే! మల్లోక అమర వీరుల పాట, యాత్ర, ఒక ఫోటో, ఫ్లెక్షిలొ ఇంకొక బొమ్మకి చోటు. అయినా ఇది శాంతి యుతమే సుమా! పోయేది నా ప్రాణం కదా! ఏడ్చేది నా కుటుంబం కదా! నిన్ను ఏమైనా అంటేనే అది శాంతి, నన్ను నేను చంపుకొనే పరిస్తితి నువ్వు కల్పిస్తే అది ఏంది? దాని పేరు ఏంది? నీ గొప్ప తనమా? నా పిరికి తనమా? పిచ్చి తనమా? నా చావు తో నైనా నువ్వు మారతావు అనుకుంటే తప్పు, నీ మోసాలు చూడలేక చస్తే కూడ తప్పే, ఏ పుణ్యం , పాపం ఎరుగక జై తెలంగాణా అంటే కూడా తప్పే..అర్థం అయిందా? లేక పొతే నీ తల వేయి వక్కలవుతుంది..బేతాళ కథలో ఒక్కటె శవం మోస్తాడు, మన కైతే వెరైటి, రోజు కొక్కటి..365 రోజులకి 500 పైన శవాలు, ఇదెక్కడి ఉద్యమము సారూ, ఇజిప్టుల లేక పాయె, లిబియాల లేక పాయె..ఏడ లేక పాయె..

సరే కిం కర్తవ్యం? గింత తెలుగు రాస్తే మా వోల్లు తిడతారు కాని, ఇపుడు ఎం చేయాలే? సచ్చు ప్రోగ్రాములు ఆపి అందరి పార్టీలను కూర్చో బెట్టి మాట్లాడాలి, బెదిరించాలి, ఇక్కడ నుండి వెంటనే తరిమి వేయాలి..దయ చేసి పార్తీలన్దరిని ఒకటే గాటన కట్టడం ముఖ్యం అంతే కాని వేరే వేరే జెండాల కింద ఉంటె మల్లా మోస పోతాము, ఏదో ఆ కాలంల చెన్నా రెడ్డిని అన్నారు కాని, ఇపుడు ఎంత మంది చెన్నా రెడ్డిలు ఉన్నారు, ఎంత కరడు గట్టిన నాయకులు ఉన్నారు? ఇన్ని రోజులు అన్ద్రోల్లని అన్నం కాని ఇక నుంచైనా తెలంగాణా వాళ్ళ మెడలు వంచి, ఒక్కొక్క పానానికి కారణం మీరే అని తెలంగాణా వచ్చిందాకా వాళ్ళ ఎంట బడాలె ..

తెలంగాణా వస్తే నక్సల్స్ ఎక్కువైతారు ..ఒక, అయితెంది వాల్లతోని దొరలకి భయం కాని సామాన్యులకు కాదు, రెండు, మత కల్లోలాలు వస్తాయి..అన్న తెలంగాణా చరిత్ర చదువు కొక పొతే మేము ఏమి చేయలేము..మీరు పన్నిన కుట్రలో భాగంగా మేము బలి అయినాము కాని ఎప్పుడు నిజమైన మత అల్లర్లు లేవు..ఇంకేంది మీడియా..వార్ని! అనవసరంగా ఒకటి రెండు చానల్లు అంటున్రు కాని ఒక్కటి కూడా కాదు అని మనం చెప్పలేమా..ఒకటి పార్టీ చానలే కదా..శని యంత్రాలకే టైం లేదు, బతకమ్మ పాటలు మాత్రం మంచిగానే ఉంటాయి, మరి ఎం చేద్దాం అన్నకి కూడ ఒక చానల్ ఉండాలే తప్పేం లేదు..పోలీసుల కథ..దెబ్బలు తిని తిని ఇంకా బొక్కలు సక్కగా గాలే, ఎం చేసుకుంటారో చేసుకొంరి..అన్నిటికి తెగిన్చినం కాదె! ఇంకా ఉద్యోగాస్తుల్లరా..మీరు మీ కార్యా చరణ ప్రకారం పనులు చేసు కొందరి , జాక్ పిలుపు ఇచ్చినపుడు కలవండ్రి..అంతా మీ తోనే అనే పదం కమిటీ రిపోర్ట్ లో బాగం గా వినపడుతుంది..కనీసం మీరైనా అర్థం చేసుకొండ్రి..

ఇంక మనం, అందరం ఒక తాననే ఉండి , రాజకీయ పార్టీలకి డేడ్ లైన్లు పెట్టాలె.. కొన్ని రోజులు మన పార్టీల ప్రేమలు పక్కన పెట్టి ప్రజల వైపున నిలబడం..లేకుంటే ఇంకిన్ని పానాలు పోతాయి సారూ..

..పదండి ముందుకు..పదండి తోసుకు..
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది..
సల సల కాగే సమురా కాదిది
ఉష్న రక్త కాసారం..

త్రాచుల వలెను ,రేచుల వలెను
దనున్జయునిలా సాగండి ..
కనపడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధధగాలు,
ఎర్ర బావుటా నిగ నీగలు

పదండి ముందుకు పదండి తోసుకు
తెలంగాణా వీర విప్లవ తేజాలను మోసుకుంటూ
శత్రువులను పసిగడుతూ..కాలోజిని తలచుకుంటూ..
దోపిడీ దార్లను ప్రాంతంలోనే పాతేసి
పదండి ముందుకు..పదండి తోసుకూ..

Courtesy – Sujatha Surepally, thank you for sharing.

Related posts:

  1. Telangana in cross roads
  2. Deeksha viraminchandi – KCR
  3. Dhikkaristhunna Telangana – Deeksha Telangana
  4. Prantheeya Mandali? Dy CM in Delhi
  5. Ningi ki egasina Telangana keratam
  6. Vi ‘grahala’ vidwamsam
  7. Telangana katha modhatiki vacchindhi
  8. Telangana Amaraveerulu
  9. New story ‘Jai Bolo Telangana’
  10. తెలంగాణ యుద్ధ నీతి!

Leave a Reply

Spam protection by WP Captcha-Free