Balanaagi Reddy drama
News pulse, Politics | admin | April 28, 2011 at 4:21 amకర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన బాలనాగిరెడ్డి ఆ తర్వాత కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఆకర్ష పధకంలో ఈయన కూడా ఆకర్షణకు లోనయ్యారు. అప్పట్లో మరో టిడిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడి చంద్రబాబునాయుడుపై విమర్శల వర్షం కురిపించే సమయంలో బాలనాగిరెడ్డి కూడా పక్కనే కనిపించేవారు.
రాజశేఖరరెడ్డి జీవించిఉన్నంత కాలం వీరి పని బాగానే నడిచింది. కాని ఆయన ఆకస్మికంగా మరణించడంతో వీరికి చిక్కులు వచ్చి పడ్డాయి.అప్పటికే టిడిపి నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరిని అనర్హులను చేయాలని కోరుతూ టిడిపి పిటిషన్ దాఖలు చేసింది. ఆనాటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా వీరిపై చర్య తీసుకోకుండా కాలం గడిపారు. మళ్లీ టిడిపి ఫిర్యాదు చేసింది. అయితే అనుకోకుండా కాంగ్రెస్ లో చోటుచేసుకున్న పరిణామాలు వీరికి తలనొప్పిగా పరిణమించాయి.
కాంగ్రెస్ నుంచి జగన్ వర్గంలోకి కొందరు ఎమ్మెల్యేలు వెళ్లడం, వారితోపాటు వీరు కూడా ఉండడం, కడప ఉప ఎన్నికలు రావడంతో వారిపై వేటు వేయడానికి కాంగ్రెస్ పూనుకోవడంతో వీరిపై పెండింగులో ఉన్న అనర్హత పిటిషన్ల దుమ్ము దులపాల్సి వచ్చింది. దాంతో ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ వీరికి నోటీసులు జారీ చేశారు. ఆ మీదట ఈయన మనోహర్ ను కలిసి కొంత గడువు ఇవ్వాని కోరితే ఆయన అంగీకరించి రెండు రోజుల గడువు పొడిగించారు.
కాని బాలనాగిరెడ్డికి ఆ సమయం సరిపోలేదంటున్నారు. తనపై వచ్చిన అనర్హత పిటిషన్ కు వ్యతిరేకంగా ఈయన జవాబు ఇవ్వవలసి ఉంది. అది మరి కొన్నాళ్లపాటు సాగదీయాలని బాలనాగిరెడ్డి ప్రయత్నం. మామూలుగా నైతే అలాగే గడువు ఇచ్చేవారేమో. ఈయనకు ఇస్తే జగన్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా సమయం పెంచాల్సి ఉంటుంది.పైగా బాలనాగిరెడ్డి కూడా జగన్ వర్గంలోనే ఉన్నారు.ఎలాగైనా కడప ఉప ఎన్నికలలోగా వారిపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన.
అది సాధ్యమవుతుందో లేదోకాని ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందువల్ల స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈయనకు సమయం పొడిగించకుండా కుదరదని ఆ దరఖాస్తును తోసిపుచ్చారు.దాంతో ఈయన తక్షణమే నోటీసుపై స్పందించి వివరణ ఇవ్వవలసి ఉంటుంది. లేకుంటే అనర్హత పిటిషన్ పై తదుపరి విచారణ కొనసాగించి నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది అటు ఎమ్మెల్యే పదవి వదులుకోలేక, ఇటు పార్టీలోకి తిరిగి వెళ్లలేక బాలనాగిరెడ్డి ఏదో రకంగా వాయిదా కోరుతూ డ్రామా నడపాలని అనుకున్నారు కాని అది కుదరడం లేదు. ఇవన్ని ముందుగా ఊహించి ఉంటే ఇలా చేసేవారు కారేమో.
Related posts:
- Nagam says he will support Jagan if…
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- TDP challenges Jagan’s YSR Cong
- Jagan gives shock to Ambati and Gone
- Jayasudha avoiding Jagan’s party?
- PRP MLA sends his resignation
- Pocharam’s resignation accepted
- Chiranjeevi ki inko pareshani
- Congress ku August bhayam
- Erraballi fire on TRS


Tweet This
Digg This
Save to delicious
Stumble it