Chiranjeevi ki inko pareshani

News pulse, Politics | admin | April 23, 2011 at 7:25 am


మెగాస్టార్ చిరంజీవికి సొంత ఎమ్మెల్యేల నుంచి కొత్త సమస్య ఎదురైంది. ప్రజారాజ్యం పార్టీకి చాలాకాలంగా దూరంగా ఉంటూ ప్రస్తుతం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జగన్ కు సన్నిహితంగా ఉంటున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిలు తమపై అనర్హత వేటు పడకుండా ముందు జాగ్రత్త పడ్డారు.శోభ నాగిరెడ్డి, రామిరెడ్డిలకు చెందిన న్యాయవాది ముందుగానే ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ ను కలిసి తాము ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపి, ఆ మేరకు తమ అభిప్రాయాలను తెలిపే పత్రాన్ని అందచేశారు.

అంతటితో ఆగకుండా వీరిద్దరూ ఎన్నికల సంఘానికి కూడా వారు ఒక లేఖ రాస్తూ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. చట్టం ప్రకారం ఇలా వ్యతిరేకించే ఎమ్మెల్యేలు స్వతంత్రంగా ఉండవచ్చన్న నిబందన ఉందన్నది వీరి వాదన. ఈ నేపధ్యంలో ప్రజారాజ్యం పార్టీ కనుక వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలని డిప్యూటి స్పీకర్ కు పిటిషన్ ఇస్తే, అది చెల్లకుండా పోతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.దీంతో ప్రజారాజ్యం పార్టీ నేతలు అనవసర వివాదంలోకి వెళ్లకుండా ఉండాలంటే వీరిద్దరిపై అనర్హత వేటు కోసం దరఖాస్తు చేయకుండా ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం.

ఎత్తు,పై ఎత్తు అనేవి రాజకీయాలలో సహజంగానే ఉంటాయి. పైగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విలీనం ప్రక్రియ పూర్తికాకుండానే కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారానికి ఎలా వెళతారని కూడా ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన తమిళనాడు ఎన్నికలలో కాంగ్రెస్,డి.ఎమ్.కెల కూటమికి అనుకూలంగా ప్రచారం చేసి రాగా, కడప ఉప ఎన్నికలలో కూడా ప్రచారం చేయబోతున్నారు. అది తప్పుకాకపోతే, తాము వై.ఎస్.ఆర్.కాంగ్రస్ తరపున ప్రచారం చేయడం ఎలా తప్పవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు ఈ వ్యవహారాన్ని న్యాయనిపుణులు ఎలా డీల్ చేస్తారో చూడాల్సి ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ దీనివల్ల జాప్యం జరుగుతుందేమోనన్న సందేహం కూడా ఉంది. అది జరిగితే, ఆయన రాజ్యసభ సభ్యుడై, కేంద్ర మంత్రి పదవి చేపట్టాలన్న కోర్కె తీరడానికి మరింత జాప్యం అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Related posts:

  1. Will Cong T politicians split?
  2. Nagam says he will support Jagan if…
  3. Rebels already in YSR Cong
  4. TDP challenges Jagan’s YSR Cong
  5. Does Chiru know poli ‘tricks’?
  6. Chiranjeevi to be CWC member?
  7. Pocharam’s resignation accepted
  8. Balanaagi Reddy drama
  9. Congress ku August bhayam
  10. Erraballi fire on TRS

Leave a Reply

Spam protection by WP Captcha-Free