CM bows down to pressure from ministers
News pulse, Politics | admin | April 18, 2011 at 2:49 amశనివారం జరిగిన కేబినేట్ సమావేశంలో తెలంగాణ మంత్రుల ఒత్తిడికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలొగ్గారు. జీవో నెం.177ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవోకు వ్యతిరేకంగా తెలంగాణలోని ఉద్యోగులు, రాజకీయపార్టీల నుంచి ఒత్తిడి రావడంతో ఈ మధ్య జిల్లాల్లో ఉన్న మంత్రులకు సైతం ఆ సెగ తాకింది. దాంతో వారు కూడా ఎక్కడికక్కడ ఉద్యోగులకు హామీలివ్వడం జరిగింది.
అంతేకాకుండా ఈ మధ్య రాజకీయంగా కూడా ఉద్యోగులు కీలకంగా మారుతుండటంతో వారితో మనకేంటి తగాదా అన్న రీతిలో మంత్రులంతా సీఎంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేబినేట్లో సీఎంతో ఈ జీవో విషయంపై మాట్లాడుతూ దీనివల్ల తెలంగాణలో ఇబ్బందిగా మారిందని, నిలుపుదల చేయాలని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, జానారెడ్డిలు అరగంటపాటు పరిస్థితిని వివరించడంతో ముఖ్యమంత్రి కూడా రిస్క్ తీసుకోకుండా తాత్కాలిక నిలుపుదలకు ఓకే అన్నారు.
అంతేకాకుండా ఈలోగా జీవోపై అధ్యయనం చేసేందుకు కేబినేట్ సబ్ కమిటీని నియమించారు. ఇందులో బస్వరాజు సారయ్య,జానారెడ్డి,గీతారెడ్డిలు ఉన్నారు.
Related posts:
- We will show the power of Hyderabad – Cong T ministers
- Jaipal Reddy to resign for T?
- Differences between Prof and KCR again?
- Who are Jagan’s coverts in cabinet?
- Will CM, Kiran be a CM until 2014?
- Jupally starts his Telangana yatra
- Kodandaram’s Delhi trips
- What did KCR do for Telangana – Erraballi
- Panthulla madhya chicchu
- No work, No Pay – AP govt.


Tweet This
Digg This
Save to delicious
Stumble it