Congress ku August bhayam

News pulse, Politics | admin | April 20, 2011 at 4:39 am

సాధారణంగా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల అంటే భయం. ఎందుకంటే గతంలో రెండుసార్లు ఎన్.టి.ఆర్ ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కున్నారు. వాటిలో ఒకదానిలో ఆయన సంక్షోభం నుంచి బయటపడితే, మరో దానిలోఆయన పదవీచ్యుతులయ్యారు. అయితే రెండోసారి ఆయన అల్లుడే ముఖ్యమంత్రి అయ్యారు.కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు ఇలాంటి అనుభవాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ కు హైకమాండ్ ఉంటుంది.

ఒక వేళ మారిస్తే ముఖ్యమంత్రిని మార్చుతారు తప్ప కాంగ్రెస్ కు పెద్ద ఇబ్బంది ఉండదు.అయితే ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకరకమైన సంక్షోభాన్ని మొదటిసారిగా ఎదుర్కుంటోంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం, దానికి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుండడంతో పరిస్థితి ఏ విధంగా మారుతుందా అన్న సందేహం ఏర్పడింది.జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ కచ్చితంగా ఈ ప్రభుత్వం మారుతుందని, ఆగస్టులో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు సంక్షోభాన్ని ఎదుర్కుంటాయని ఆమె జోస్యం చెప్పారు.

తమను ఎమ్మెల్యేలుగా అనర్హులుగా చేయాలన్న కాంగ్రెస్ పార్టీ యోచనపై ఆమె మండిపడ్డారు. జగన్ కు మద్దతు ఇచ్చినవారందరిని అనర్హులను చేయకుండా కొంతమందిని ఎంపిక చేసుకోవడం కాంగ్రెస్ దుర్భుద్దికి నిదర్శనమని ఆమె విమర్శించారు. మొత్తం మీద జగన్ వర్గం కడప ఉప ఎన్నికల తర్వాత కచ్చితంగా రాజకీయ పరిణామాలు ఉంటాయని ఆశిస్తోంది. జగన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో అదే విషయం చెబుతున్నారు. మార్పునకు కడప నాంది అవుతుందంటున్నారు. జగన్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది చివరివరకు ఆయనతో నడుస్తారో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది.

నిజంగానే జగన్ కు ప్రభుత్వాన్ని పడగొట్టగలిగేంత స్థాయిలో బలం ఉంటుందా అన్నది చర్చనీయాంశంగానే ఉంది.కడప జిల్లాకు చెందిన బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ ఇప్పటికే కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లిపోగా, కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు అటు ఉండాలా? ఇటు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ముందుగా జగన్ తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే ఆగస్టు సంక్షోభం తెచ్చినట్లే.

Related posts:

  1. Jagan’s loyalist Gone, dumps Jagan?
  2. TDP challenges Jagan’s YSR Cong
  3. Jayasudha avoiding Jagan’s party?
  4. Sonia sets deadline for CM, Kiran?
  5. Who are Jagan’s coverts in cabinet?
  6. Another MLA gives shock to CBN
  7. Balanaagi Reddy drama
  8. Jagan towards BJP?
  9. Chiranjeevi ki inko pareshani
  10. Kandula brothers jump into Congress

Leave a Reply

Spam protection by WP Captcha-Free