Eggs hurled at Ponnala’s car
News pulse, Politics | admin | April 11, 2011 at 4:34 am
రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారుపై కొందరు విద్యార్ధులు కోడిగుడ్లతో దాడి చేశారు. తెలంగాణను కోరుతూ కొంతమంది విద్యార్దులు ఈ దాడికి దిగడం విశేషం. పొన్నాల లక్ష్మయ్య జ్యోతిరావు పూలె జయంతి సందర్భంగా జరుగుతున్న ఉత్సవానికి హాజరవడానికి వెళ్లినప్పుడు వీరిని అడ్డుకుని కారుపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. పొన్నాల లక్ష్మయ్య కారుపై రాళ్లు, టమోటాలు కూడా విసిరారు.
అదే కార్యక్రమానికి హాజరవడానికి వెళ్లిన టిడిపి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణికి విషయం తెలిసి మధ్యలోనే వెనుదిరిగారు. పొన్నాల లక్ష్మయ్య కారు అద్దాలు పగిలిపోవడం, సభా వేదికను కూలదోయడంతో మంత్రిగారు తిరిగి పయనమయ్యారు. దీంతో కాకతీయవర్శిటీలో ఉద్రిక్తతపరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడ్డ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై మంత్రి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా , ఎంపీ సుధారాణి మాట్లాడుతూ కేవలం బలహీనవర్గాల ప్రజాప్రతినిధులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అగ్రకులాల వారు పన్నుతున్న కుట్రలో విద్యార్థులు బలికావద్దని ఆమె కోరారు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- L Rajagopal avatharaalu velladistha
- Vinay Kumar’s another attempt in politics
- CBN’s Heritage foods attacked
- Sonia sets deadline for CM, Kiran?
- Ravi Teja’s dad caught in a club
- Eggs hurled at Sabitha and Jaipal
- Eggs hurled at Julakanti Rangareddy
- Eggs hurled at Sunitha Laxma Reddy
- Eggs, chappals hurled at Komatireddy


Tweet This
Digg This
Save to delicious
Stumble it