Erraballi fire on TRS
News pulse, Politics | admin | April 1, 2011 at 3:07 am
కాంగ్రెస్-టిడిపిలు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని, అందుకే బాన్సువాడ ఎమ్మెల్యే రాజీనామాను డిప్యూటీస్పీకర్ ఆమోదించలేదని టీఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై టిడిపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి.దయాకర్‌రావు మండిపడ్డారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ \”పోచారం శ్రీనివాసరెడ్డి టిడిపి టిక్కెట్‌పై గెలిచారు, కానీ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌కు ఓటేశారు. టీఆర్‌ఎస్ తన పార్టీలోకి చేర్చుకోవడానికి ముందుగానే ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉండాల్సింది.
అలా అయితే విమర్శ వచ్చేది కాదు, ఆయన పార్టీ నిబంధనలను ఉల్లంఘించారు కనుక ఎమ్మెల్యేగా అనర్హున్ని చేయాలని పోచారంపై మేం ఉపసభాపతికి పిటిషన్ ఇచ్చాం. ముందుగా ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకున్న తర్వాతే రాజీనామా అంశాన్ని పరిశీలించాలి. విద్యార్థులంతా తెలంగాణ ఆందోళనను ముందుకు తీసుకెళ్తుంటే టీఆర్‌ఎస్‌పై గెలిచిన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడుపోయారు, అలా అమ్ముడుపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామన్నారు. తెల్లారేసరికి అసెంబ్లీకి రాజీనామా చేస్తామన్నారు. స్పీకర్‌కు లెటర్స్ ఇస్తామన్నారు , అవి ఎందుకు సమర్పించలేదు. టీఆర్‌ఎస్ విప్‌కు వ్యతిరేకంగా ఓటేసిన వారిపై చర్య తీసుకోని మీరు సిగ్గులేకుండా మాపై మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తారా? \” అని ప్రశ్నించారు.
గతంలో ఇరవైఆరుమంది టీఆర్‌ఎస్ తరపున ఎన్నికైనప్పుడు పదిమంది ఆ పార్టీకి దూరమయ్యారని, వారిపై ఆనర్హత వేటు వేయాలని టీఆర్‌ఎస్ కోరిందని కానీ స్పీకర్ అనర్హత వేటు వేయడానికి ముందుగా ఆ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఇస్తే తప్పు అని చెప్పిన టీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు పోచారం రాజీనామాను ఎలా సమర్థిస్తారని దయాకర్‌రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు ఓ న్యాయం..టిడిపికి ఓ న్యాయముంటుందా అని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా జెండాకు ద్రోహం చేయడం సరికాదని , ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందునే పోచారం విషయంపై టీఆర్‌ఎస్ నాయకులు నటన మొదలు పెట్టారన ఆయన ధ్వజమెత్తారు.
కనుక ఉపసభాపతి పోచారంతో పాటు బాలనాగిరెడ్డి,ప్రసన్నకుమార్‌రెడ్డిలపై తాము ఇచ్చిన పిటిషన్‌పై ముందుగా విచారణ జరిపిన తర్వాత పోచారం రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మొత్తంమీద ఈ రకంగా పోచారం రాజీనామాకు టిడిపి అడ్డుపుల్ల వేసింది. దీన్ని ఆసరా చేసుకొని డిప్యూటీ స్పీకర్ మరికొంతకాలం పాటు పోచారం డ్రామాను కొనసాగించే అవకాశం ఉంది.
Related posts:
- Harish Rao fires on Subbarami and Renuka
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Jaipal Reddy to resign for T?
- Kuthuhalamma comments on CM
- PRP MLA sends his resignation
- SKC is a luccha committee – Nagam
- Pocharam’s resignation accepted
- Balanaagi Reddy drama
- Chiranjeevi ki inko pareshani
- What did KCR do for Telangana – Erraballi


Tweet This
Digg This
Save to delicious
Stumble it