Jagan towards BJP?
News pulse, Politics | admin | April 27, 2011 at 2:57 pm
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన ప్రకటన చేశారు. అయితే ఒక షరతు పెట్టారు. తాను భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అంటూనే , పొత్తు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా పది శాతం మేర ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాలని డిమాండు చేస్తానని జగన్ పేర్కొన్నారు.
ఇటీవలికాలంలో జగన్ పై కాంగ్రెస్ నేతలు ఒక విమర్శ చేస్తూ, జగన్ వెనుక బిజెపి హస్తం ఉందని, ఆ పార్టీతో ఈయన పొత్తు పెట్టుకుంటారని విమర్శిస్తున్నారు. పిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్ ఈ విమర్శకు శ్రీకారం చుట్టారు.తాను బిజెపితో పొత్తు పెట్టుకోనని జగన్ చెబుతూ వచ్చారు. అయినప్పటికీ విమర్శలు కొనసాగిస్తుంటే , జగన్ ఈ ప్రకటన చేయడం విశేషం.
అంటే దీనర్ధం కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అవసరమైతే బిజెపి వైపు వెళ్లడానికి జగన్ సిద్దమేనన్న సంకేతానికి ఈ ప్రకటన ఆస్కారం ఇస్తుంది.కాగా రాష్ట్ర మంత్రులు వందల కోట్లు పట్టుకుని కడప లో తిరుగుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఎవరికి పంచాలో వారికి అర్ధం కావడం లేదని జగన్ అన్నారు.కాగా వై.ఎస్.ఆర్.కాంగ్రస్ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ అదికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మంత్రులను వెనక్కి పిలిపించాలని డిమాండు చేశారు.
Related posts:
- Nagam says he will support Jagan if…
- Rebels already in YSR Cong
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Jagan gives shock to Ambati and Gone
- Jagan’s money with Nagam Janardhan?
- Kuthuhalamma comments on CM
- Jagan behind me, no no – Nagam
- SKC is a luccha committee – Nagam
- Kodandaram’s Delhi trips
- Congress ku August bhayam


Tweet This
Digg This
Save to delicious
Stumble it