Jaya hoo Vimalakka
News pulse, Politics | admin | April 14, 2011 at 6:05 pmనేడు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి! రాజ్యాంగ నిర్మాత, మానవత వాది,స్వేచ, సమానత్వం ప్రతి మనిషికి దక్కాలని, చిన్న రాష్ట్రాలని కాంక్షించిన మహా మనిషి 121 వ జన్మ దినం. ఏ సర్కార్ ఐతే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ , ఫూలే జయంతి లను అధికారికంగా జరుపుకున్తున్నాయో , అవే ప్రభుత్వాలు వారిని ఆవ హేళన పరుస్తున్నాయి. అంబేద్కర్ జయంతి రోజు జి.వో 177 విడుదల, ఉద్యోగుల ప్రజా స్వామిక హక్కులను కాల రాస్తూ, తెలంగాణా ఉద్యమాన్ని ఉక్కు పాదాల కింది తొక్కి పెట్టే ప్రయత్నం. మరో వైపు కే సి ఆర్ చండి యాగం , మానవ, ప్రపంచ శాంతి కొరకు అని ప్రవచనాలు. మండుతున్న గుండెకు యజ్ఞ యాగాల అగ్గి తోడైతుంది కొందరికి. యజ్ఞాలు, యాగాలు తెలంగాణ ని తెస్తయంటే ప్రతి ఇంట్లో ఒక అగ్గి గుండమే ఉంది ఇయాల, అయిన తెలంగాణా ఎందుకు వస్తాలేదో అన్న! మరొక వైపు, ఇవాళ కరీంనగర్ ల హనుమంతు అనే పిచ్చోడు(అమాయకుడు) తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసుకున్నాడు..ఆత్మ హత్యలు ఒక మామూలు వార్తలు ఐపోయినై ఇవాళ, ఎంత మంది సస్తే ఏమయేది ఏముంది తమ్మి! సోనియమ్మ కరునిన్చాలే, ఉద్యోగస్తులు, జాక్ లు తలచుకుంటేనే ఉద్యమం ఒకడుగు ముందు వడే తట్టుంది. ఇవన్ని ఒక ఎత్తైతే , ఒక మహిళ నాయకత్వంలో , యునైటెడ్ ఫ్రంట్ అద్వర్యంలో లగడపాటి లాంకో హిల్స్ పై తెలంగాణా జెండా! తెలంగాణా హిల్స్ అని పేరు! అమరులైన అన్న తమ్ములకి, అక్క చెల్లెళ్లకి నిజమైన నివాళి బహుశా ఇదే నేమో. గత పది సంవత్సరాలుగా వనరులను కాపాడండి అని మొత్తుకుంటే పట్టించుకున్న నాధుడు లేదు, కేకుల్లాగా భూములు కాజేస్తుంటే , కబ్జాలకు గురి ఐతుంటే ప్రేక్షక పాత్ర వహించాము. ఈ మౌనమే, అలసత్వమే, తెలంగాణా నాయకులను లెక్క చేయకుండా చేసింది, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడ కొల్లగొడుతున్న వనరులను గురించి ముట్టుకోలే ..అక్కడో ఇక్కడో అతి కొద్ది మందిమి బ్రతిమిలాడుకుంటే ఒకటో రెండో సార్లు పెద్ద సార్లు జర కదిలిన్రు. ఇయాల అక్క , విమలక్క, ప్రజా గాయని, జీవితాన్ని ఉద్యమానికి త్యాగం చేసిన అక్క, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పిలిస్తే అక్కడ గొంతు నరాలు చిట్లి పోయేలా ‘చలో ధూమ్ ధామ్’ అంటూ మత్తడి దునికిస్తూ పాటలు పాడే అక్క, లగడపాటిల అహం పై దెబ్బ కొట్టింది. కబ్జా కోరులకు ఒక సవాల్ విసిరింది, నిజానికి ఇది మామూలు విషయం కాదు, ఎంతో ధైర్యం తో కూడుకున్న పని, తెగించింది తెలంగాణా అడ బిడ్డ..జయ్ హో అక్క! భూమి కోసం , నీ (తి) టి కోసం, ఖనిజ సంపద, అడవులు, ఆదివాసిల కోసం తపించే మాలాంటి వాళ్లకు చల్లని కబురు, కనీసం దొంగ భయ పడతాడని ఆశ. అతి కొద్ది కాలం లోనే, వనరుల గురించి మాట్లాడుతుంది అక్క, ఇక్కడ వనరులు పోయినంక , వలసలు తప్ప , సస్యస్యామల తెలంగాణా ఎత్లోస్తది? ముందు తెలంగాణా రానియ్ అని ఒక మేధావి అంటడు, అసలు తెలంగాణా అంటే ఏంది అన్న? భూమి కాదా? కోల్పోతున్న జీవితం కాదా? తెలంగాణా అంటే ఒక సీటు, వోటు మాత్రమేనా? పోలేపల్లి ల సచ్చిన 52 మంది అన్నలను అడిగితె చెప్తాడు తెలంగాణా అంటే ఏందో, రేపు మినిగి పోయే పోలవరం ఆదివాసిలను అడిగితె చెప్తారు తెలంగాణా అంటే ఏందో, వలసలకి మారు పేరైన పాలమూర్ బిడ్డలని అడిగితె కూడ చెప్తారు..ఇది కేవలం ఒక అరణ్య రోదన లెక్కనే మిగిలింది గత పది సంవత్సరాలుగా..
లాంకో హిల్స్, హుస్సేన్ షా వలీ , హుస్సేన్ సాగర్ కట్టిన ఇంజనీర్ , కూలి కుతుబ్ షా అల్లుడు, అయన పేరు మీద ఉన్న భూమి, 1600 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ , అందులో 115 ఎకరాల భూమి లాంకో హిల్స్ కబ్జాకి గురి అయింది, దీని మీద రహమాన్ అనే జర్నలిస్ట్ ‘రాజ్ న్యూస్’ లో ‘దర్గా భూములు -దర్జాగా కబ్జాలు’ అని ప్రసారం అయింది అనుకుంటా , దాని మీద పెద్దగా స్పందన లేదు అపుడు , ఇపుడు కూడా..అందరు మాట్లాడు కుంటారు, దానిని మీద ఏదో ఒక చర్య తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు.. హైదరాబాద్-సికింద్రాబాద్ కి తాగు నీరు కావాలి అని మామ కులీ కుతుబ్ షా అల్లుడిని అడిగినపుడు హుస్సై షా వలీ ఒకటిన్నర రోజులో కట్టించారని చెపుతారు, అయన దగ్గరుండి నిలబడి కడుతున్నపుడే అక్కడి ప్రజలు దీనికి హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టారు అని కూడా చెపుతారు..దాదాపు పది హీను సంవత్సరాల క్రితం వరకు కూడా హుస్సేన్ సాగర్ లో చేపలు పట్టేవారు, ఎపుడైతే ఆంధ్ర వలస పెత్తందారుల చేతిలో హైదరాబాద్ పడిందో అప్పటినుంచి అది కాలుష్య పదార్తాలకి నిలయం అయింది, రాంకి వ్య్రర్దాలను కలుపుతున్నారని కూడ మన నాయకులకు సోయి లేదు, ఇంత చారిత్రాత్మక కట్టడాల మీద కబ్జాలు జరిగితే మనకి చీమ కుట్టినట్టు కూడ ఉండదు, అవును భై! ఉద్యమం వేరు, కబ్జాలు వేరు, గీ ఇంత తెల్వక పొతే ఎట్లా ? పేక మేడల్లాగా గాలిలో నిలబడ్డ స్కయ్ స్క్రేపర్లు తెలంగాణా ని వెక్కిరిస్తునట్టు ఎవరికీ కనపడయి, ప్రాణం లేని విగ్రహాల ను కూల్చి వేస్తె లబో దిబో అనే మేధావులకి, ఈ కబ్జాలు, విలువైన భూ విద్వంసాలు కనపడవ్ ..ఎం కాలం బాబు ఇది! ఎంతో పెద్ద పార్టీలు, తెలంగానం తెస్తమనే నాయకులు వీటిని గురించి పట్టించు కోరు, ఒక్కో నాయకునికి ఎంత భూమి ఉందొ అందరికి తెలుసు కదా! ఒకరి మీద ఒకరికి ఎనలేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, దోచుకొనే వాని కులం ఒకటే అనుకుంటా..బాబా సాహెబ్ అంబేద్కర్ ఎపుడో ఒక మాట అన్నాడు, పెట్టు బడి దారుడు ఏపుడు కిరాయి దారుడే..అవును దోచుకొనే వాడికి హక్కులు ఎక్కడివి..మొన్నీ మధ్య ఒక పెద్దాయన నాకు భారత దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది , అట్లనే తెలంగాణా ల కూడ అని రాసిండు..అన్నా! ఏమి చెప్పాలే 1950 హైదరాబాద్ కౌల్దారి -వ్య్వవసాయ భూముల చట్టంలో ఐదవ అధ్యాయం ల 47 -50 సెక్షన్ వ్యవసాయ భూముల అమ్మకం , కొనుగోళ్ళ పై ఆంక్షలు ఉండేటివి , తెలంగాణా కాని వాళ్ళు ఎవరు కొనడానికి వీలు లేదు, తరువాత పెద్ద మనుషులు ఒప్పందం 8 వ అంశం ప్రకారం ప్రాంతీయ కమిటికి లోబడి ఉండాలి , కమిటీ అనుమతి లేకుండా ఎవరు కొనడానికి విలు లేదు, దీనిని 1968 ల రద్దు చేసింరు , అయినా 1956 నుండే యదేచ్చగా నిజామాబాద్, వరంగల్ జిల్లాల భూములన్నీ కొన్నారు. ఆ తరువాత నీటి పారుదల ఉన్న ప్రతి చోట, ప్రాజెక్టుల కింద ఉన్న భూములన్నీ ఆక్రమిన్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా దోచుకున్తనే ఉన్నారు. పెద్ద పెద్ద పార్టీలు కనీసం ఈ విషం గురించి బహిరంగంగా మాట్లాడారు..ఇంకా రాసుకుని పూసుకొని తిరుగుతూ చిదంబర విన్యాసాలకి డాన్స్లు ఎస్తనే ఉంటారు..ప్రజలను పిచ్చోల్లను చేసి ఆడిస్తానే ఉంటారు తోలుబొమ్మలాట.
కృష్ణ కమిటీ సూచనలు తూచా తప్పకుండా అమలు చేస్తూన్న ప్రభుత్వాలు, బహుజన నాయకుడు, పోరాటాల పురిటి గడ్డ బిడ్డ సాంబ శివుడి హత్య, ఇవాల్టి దగుల్బాజీ జీవో, అరెస్టులు, చిత్ర హింసలు కొనసాగిస్తూ, నోటితో నవ్వుతూ, నొసటి తో వెక్కిరిస్తున్నట్టు ఉన్నది..ఈ ప్రభుత్వాలు జూన్ తరువాత తెలంగాణా ఇస్తా అంటే నమ్మల్నా? అమాయకంగా ఒక సామాన్యుని ప్రశ్న, కళ్ళ బొల్లి కబుర్లు చెబుతున్న కాన్గ్రేసోల్లకి కళ్ళు , చెవులు ఉన్నాయా లేకపోతె అవి కూడ సోనియమ్మకి దానం చేసిన్రా. అందరు అవయవాలు చనిపోయినంక చేస్తే , మావోల్లు బతికున్దంగానే చేస్తారు..అమ్మ! తెలంగాణా తల్లి! ఎసోంటి రాజకీయ నాయకులని కన్నవే తల్లి! ఎవడు ఎక్కడ పొతే నాకేంది అని ఎండ కాలం ఎసి రూములు కదలకుండా సల్లగ ఉద్యమాలు చేస్తున్రు ఇంక కొంత మంది..పరీక్షలు , పరీక్షలు అన్తిరి, ఇపుడు అన్ని ఐపోయినై, ఇంకేం చేయాలే, ఎమ్సెట్లు, పోటీ పరీక్షలు కూడ అడ్డంకులే అంటారా ఏంది..ఏమో , ఏదైనా జరగ వచ్చు..అసలు జూన్ వరకు అన్నది ఒక సాకు కావొచ్చు అని మనం ఎందుకు అనుకోవట్లేదు, మొన్న కమిటీ అని ఒక సంవత్సర కాలం ఉద్యమానికి అడ్డంపడి, విలువైన పానాలను పోగొట్టు కొనేటట్టు చేసింరు..కృష్ణ కమిటీ వచ్చింది, ఇంక ఇపుడు, ఎలక్షన్ల వంక కాని జరిగేది కృష్ణ కమిటీ అమలు..ఇంకిన్ని భూములు, గుట్టలు, నీళ్ళు దోచు కోవాడానికి ఇంకింత టైం , ఇది అర్థం కాకపొతే ఇంక రాజ కియాలల్ల ఉండుడు బేకార్, మన టైం కూడ బెకారే ..
మర్యాదగా చెపితే విని పోయే రకాలు కాదు గివి, విమలక్క ను చూసి అయిన జర పార్తీలోల్లు కదలాలే, యాగాలు యజ్ఞాలు చేస్తే అన్ద్రోల్లు ఆక్ర మించు కున్న భూములు వదిలేసి పోతరంటే రేపే అన్ని జాక్లు యజ్ఞాలు మొదలు పెట్టాలె, పోక పొతే ఒక్కొక్కన్ని పట్టుకుని తన్నాలే. ఒపికలు నశిన్చుతున్నై, మర్యాదలు మాయమైతున్నై, ఆంధ్రా అన్నల్లారా, అక్కల్లారా.. మా కోపాగ్నికి బలి కాక ముందే, మర్యాదగా నిష్క్ర మించండి! జెండాలు భూముల్లో మాత్రమె పాతి పెడుతున్నాం ఇప్పటికైతే! ఇక ముందు…..
జై తెలంగాణా!
నాదొక గుడ్డి జ్ఞాపకం, అది ఈ భూమ్మీద ఒక స్వదేశాన్ని కోరుకుంటుంది.
దాని ప్రపంచం కళ పెళ మరిగిందయినా, ఒక పక్షి అంధ కారంలో తన దారి కోల్పోయినా,
ఎడారిలో తప్ప తన నీడ కూడా కన్పించక పోయినా, పొగతో కూడిన మృత్యు వస్త్రం కప్పబడిన శవమయితే తప్ప-బహిష్కరిమ్పబడితే తప్ప స్వదేశం కాదు!
ఒక మనిషికి సొంత ఇల్లు-స్వదేశం మృత్యువులో తప్ప ప్రాప్తిన్చావు. ఎడారిలో తప్ప అభివృద్ధి లభించదు, ఎంత విషాదం..” ( హైదరి, ఇరాకీ పోయేట్ )
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Rajakeeya ‘Laphangilu’
- Ningi ki egasina Telangana keratam
- Telangana Naatakaala mela
- Anyayaaniki kooda Ambedhkar aa?
- Will CM, Kiran be a CM until 2014?
- Chiranjeevi to be CWC member?
- Kodandaram’s Delhi trips
- Vi ‘grahala’ vidwamsam
- Banchan kaadu Doraa… Baakulam
- CBN, kottha vesham


Tweet This
Digg This
Save to delicious
Stumble it