Jayalalitha taking revenge on Karunanidhi
News pulse, Politics | admin | April 26, 2011 at 3:30 pmతమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబం 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిక్కుకుని విలవిలలాడడం అన్నా డి.ఎమ్.కె.అధినేత్రి జయలలితకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెస్తోంది. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండి, డి.ఎమ్ కె.ప్రభుత్వం నుంచి అనేక సమస్యలు ఎదుర్కుంటూ వచ్చిన జయలలిత ఇప్పుడు రాష్ట్రంలో అదికారంలోకి రావచ్చని ఆశిస్తున్నారు. ఇది ఒక కోణం అయితే కరుణానిది భార్య దయాళు అమ్మాల్, కూతురు కనిమొళి కుంభకోణంలో కూరుకుపోవడం మరో కోణం. ఈ సందర్భంగా మొత్తం కుంభకోణానికి మూలపురుషుడు కరుణానిదేనని, మొత్తం కుటుంబం అంతటిపై విచారణ జరపాలని జయలలిత డిమాండు చేస్తూ పెద్ద ప్రకటన విడుదల చేశారు.ఇందులో కరుణానిధికి,రాజాకు,కరుణానిది కుటుంబానికి ఆపాదిస్తూ ప్రకటన చేయడం ఒక ఎత్తు అయితే, కరుణానిదికి ఎందరు భార్యలు, ఎవరు ఎవరి కూతురు అన్న విషయాలు అర్ధం అయ్యేలా కూడా అందులో ప్రస్తావించారు.
కరుణానిది రెండో భార్య దయాళు అమ్మాల్ కు కలైంగర్ టివీలో అరవై శాతం వాటా ఉందని, అలాగే కరుణానిధి మూడో భార్య రజతి కుమార్తె అయిన కనిమొళి కి ఇరవై శాతం వాటా ఉందని పేర్కొన్నారు. గతంలో ఇంత బహిరంగంగా కరుణానిధి ముగ్గురు భార్యల గురించి,వారికి పుట్టినవారి గురించి పెద్దగా ప్రస్తావించినట్లు అనిపించేదికాదు.ఈ టీవీ ఛానల్ లోకి 214 కోట్ల రూపాయల అక్రమ నిదులు ప్రవహించాయని స్పష్టంగా వెల్లడవుతోందని, కనుక ఈ టీవీ ఛానల్ లైసెన్సు కూడా రద్దు చేయాలని ఆమె డిమాండు చేశారు.,కనిమొళిని అరెస్టు చేయాలని కూడా ఆమె డిమాండు చేశారు,.అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న కరుణానిధి కుటుంబం అంతటిపై ఛార్జీ షీటు వేయాలని ఆమె కోరారు.
మొత్తం మీద ఈరకంగా జయలలిత తన పాత కక్షలను తీర్చుకుంటూ తనకు మంచి రోజులకు ఎదురు చూస్తున్నారు.
Related posts:
- Harish Rao fires on Subbarami and Renuka
- Rebels already in YSR Cong
- Jaipal Reddy to resign for T?
- Superstar Krishna into YSR cong?
- CBN’s Heritage foods attacked
- Jagan gives shock to Ambati and Gone
- Shock to Karunanidhi
- 75 lakhs release order issued for Tank Bund statues
- Kodandaram’s Delhi trips
- Jagan towards BJP?


Tweet This
Digg This
Save to delicious
Stumble it