Jupally starts his Telangana yatra
News pulse, Politics | admin | April 29, 2011 at 3:53 am
రాష్ట్ర చరిత్రలో ఇదో కొత్త అనుభవం.గతంలో 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కొందరు తెలంగాణ మంత్రులు ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని విమర్శించేవారు. లేదంటే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు అలా కాకుండా మంత్రి పదవి లో ఉంటూనే ఉద్యమం చేయడం, అందుకోసం పాదయాత్ర ను చేపట్టిన చరిత్ర రాష్ట్ర మంత్రి జూపల్లె కృష్ణారావుకు దక్కింది.తెలంగాణ వచ్చేవరకు పాదయాత్ర చేస్తానని ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో కార్యక్రమం ఆరంబించారు.
ఎ.ఐ.సి.సి కార్యదర్శి పి.సుధాకరరెడ్డి కూడామంత్రికి సంఘీభావంగా ఇందులో పాల్గొన్నారు.విచిత్రం ఏమిటంటే ఇటీవలికాలంలోతెలంగాణ మంత్రులు ఎవరూ ముఖ్యమంత్రిని విమర్శించరు. కాని ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తారు.ముఖ్యమంత్రి సమైక్యవాది అని పైకి చెప్పకపోయినా ,అదేమి రహస్యం కాదు.కాని వీరంతా మంత్రులుగా సమైక్య వాద ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తారు. మంత్రి కృష్ణారావు కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు కాని అది పేరుకే రాజీనామాగా మిగిలింది. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించరు. ఈయన పట్టుబట్టరు. వై.ఎస్.వివేకానందరెడ్డి ఏమి చేశారు. తాను అబ్యర్ధిగా పోటీచేయాలంటే మంత్రి పదవికి రాజీనామా ఆమోదించాల్సిందేనని పట్టుబట్టి ఆమోదింపచేసుకున్నారు.అది ఒక పద్దతి.ఇక డి.ఎల్.రవీంద్ర రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే పోటీచేస్తున్నారు. ఇదొక కోణం.కాని మంత్రి కృష్ణారావు విధులునిర్వహించకుండా మంత్రిపదవిలోనే ఉంటారు.
దేవదాయా శాఖ అంటే సెంటిమెంటు రీత్యా భయపడ్డ కృష్ణారావు గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పాదయాత్రల విషయంపై ప్రణాళికను ప్రకటించలేదు. అయినప్పటికీ, ఇప్పుడు తెలంగాణ కోసం పాదయాత్ర ఎంతకాలం చేస్తారో తెలియదు.దీనికి ముఖ్యమంత్రి గారు ఎంతకాలం అనుమతిస్తారో తెలియదు.ఇదంతా చిత్రమైన రాజకీయంగా ఉంది.నిజానికి తెలంగాణలో ని మెజార్టీ మంత్రులు తమకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తెలంగాణ నినాదాన్ని ముందుకు ఎత్తుకుంటారు. ఆ తర్వాత దాని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అప్పుడప్పుడు రాజీనామా చేస్తామని అంటుంటారు. చేస్తారో, చేయరో తెలియదు. మరి కృష్ణారావు యాత్రను కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుందా?
Related posts:
- Telangana thappademo?
- Harish Rao fires on Subbarami and Renuka
- Telangana politicians who did not resign, listing
- I dare Nagendar, Mukesh to come out of Hyd
- There will be no use with ‘Dy CM’
- Jai Telangana in TDP’s Mahanadu
- Jaipal Reddy to resign for T?
- Who are Telangana drohis?
- PRP MLA sends his resignation
- Pocharam’s resignation accepted


Tweet This
Digg This
Save to delicious
Stumble it