Kandula brothers jump into Congress
News pulse, Politics | admin | April 8, 2011 at 4:08 am
కడప జిల్లాకు చెందిన టిడిపి నేతలు కందుల రాజమోహన్‌రెడ్డి, కందుల శివానందరెడ్డిలు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిల సమక్షంలో వీరు చేరారు. నాటకీయ పరిణామాల్లో రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగప్రవేశం చేయనున్నారు. అయితే మధ్యలో కొంతసేపు తాను కాంగ్రెస్‌లోకి వస్తాను కానీ ఎన్నికల్లో పోటీ చేయజాలనంటూ బెట్టు చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది.
ఆ మీదట మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు కందుల సోదరులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గరకు తీసుకొచ్చి బుజ్జగించారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏదైనా ఒక హామీ కావాలని, అప్పుడే తాను ఎన్నికల గోదాలో దిగుతానని రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌నేతలతో చెప్పినట్లు సమాచారం.అదే సమయంలో గతంలో రాజశేఖర్‌రెడ్డితో వైరం ఉన్నప్పటికీ ఆతరువాత కాలంలో ఆ గొడవలు తగ్గాయని, పైగా వ్యాపార వ్యవహారాల్లో కూడా వైఎస్ కొంత సాయం చేశారని, అందువల్ల ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతవరకు మంచిదని కందుల బంధువులు కొందరు ప్రశ్నించినట్లుగా కూడా చెప్తున్నారు. దీంతో కందుల బ్రదర్స్ కాస్త అయోమయంలో పడ్డారు.
ఆమీదట తాము కాంగ్రెస్‌లో చేరతాము కానీ పోటీ చేయలేమని అనడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ఎందుకంటే అధిష్టానం వద్ద రాజమోహన్‌రెడ్డి గురించి చెప్తూ 1996లో రాజశేఖర్‌రెడ్డిని గడగడలాడించారని, కేవలం ఐదువేల ఓట్ల తేడాతో కందుల ఓడిపోయారని, ఈయన పార్టీలోకి వస్తే గట్టి పోటీ ఇవ్వగలుగుతారని చెప్పి అనుమతి పొందినట్లు కాంగ్రెస్ వర్గాల బోగట్టా. మొత్తంమీద కందుల బ్రదర్స్‌కి డీఎస్,కిరణ్‌లు కాంగ్రెస్ కండువాలు కప్పి తమ పార్టీలోకి చేర్చుకున్నారు.
Related posts:
- Chances of Chiranjeevi to be CM?
- Revanth Reddy, samaja bhahishkarana – Cong
- Jayasudha avoiding Jagan’s party?
- Sonia sets deadline for CM, Kiran?
- Will CM, Kiran be a CM until 2014?
- Kuthuhalamma comments on CM
- Why did KVP meet Governor?
- Balanaagi Reddy drama
- Congress ku August bhayam
- CM bows down to pressure from ministers


Tweet This
Digg This
Save to delicious
Stumble it