KCR, nee kaalmokthha

News pulse, Politics | admin | April 25, 2011 at 4:59 am


తెలంగాణ ప్రాంతం లొ పొద్దుగుకినంక ఇంట్లొ అందరు ఒక దగ్గర కుసొని తినె అలవాటు మనకుంది.నా చిన్నతనముల్ల మా బాపు దగ్గర కుసొని అన్నం తింటుంటె, 1969 తెలంగాణ ఉద్యమం ఎట్ల దెబ్బ తినె, ఎవదెవడు మొసం చెసె అని చెప్పుతుండె. మర్రి చెన్నరెడ్డి జీపు డ్రెవర్ మా అమ్రబాదు ఆయన ఉండె. ఆ డ్రెవర్ ప్రకారం చెన్నరెడ్డి 11 మంది ఏంపి లను తొలుకొని ఇందిర గాంది దగ్గర అపాఇంట్ మెంట్ తిసుకొని ఢిల్లి పొతె , కొనాకు ఒక్కయాన ,మల్లికర్జున్ అనుకుంట ,మిగిలిండు అంట ఆమె దగ్గరకు పొయెటప్పటికి. ఇ దొంగల్లల్ల ఇ సత్య నారాయణ , ఇ వెంకట స్వామి అందరు ఉన్నరు .మన దొంగల సంగతి ఇట్ల ఉంటె.మనని ముంచెటొడు ముంచుతునె ఉండె ఆ పక్కన .ఆంధ్రొల్లు అనుకున్నరు, 1969 తరువాత 300 పిల్లలను సంపి తెలంగాణ ఉద్యమం మల్లి రాదు ,మనం మొత్తం సంపినం అనుకున్నరు .కాని అది జీవంగానె ఉండె, తెలంగాణ వాల్లు యాది మర్వలె. అది తక్కువ ధొఖన మర్వనికె . మా బాపు అంటు ఉండె ఒక్కడన్న రాకపొతడ, మల్ల తెలంగాణ ఉద్యమం రాకపొతద అని . 1996 ల అనుకుంట -నెను ఇంటెర్ చెస్తుండె- ఇంద్ర రెడ్డి ఒక పార్టీ పెట్టి పొరాడుతు ఉంటె ,అరెయ్ వచ్చిండ్ర పహెల్ మాన్ అనుకుంటిమి.కాచిగుడల ఆఫిస్ పెట్టి పార్టీ నడిపిస్తు ఉండె.అది చుసినప్పుడల్ల అనిపిస్తుండె తెలంగాణ వస్తది ఎదొ ఒకరొజు. కాని ఆ ఖుషి కుడా ఎక్కువ కాలం నిల్వక పాయె.అదె ఆయన సనిపాయె.

నేను ఇంజినీరింగ్ చెస్తుండె – 1998 ల అనుకుంట- ఒక అంధ్ర సారు క్లాస్ ల హత్యల గురించి మాట్లాడుతుంటె ,మా రాయల సీమ వల్లు బాగ వినాలి అని నేను లెచి అంటి. దానికి సమదానంగా ఆయన నువ్వు ఎక్కొడినివి అంటె ,తెలంగాణ వాన్ని అని చెప్పితి. అందరు నా మొఖం చుసిరి. తెలంగాణ పదం ఎప్పుడు వినొనివల్లలాగా మూతి పెట్టిరి . కొన్ని దినాలు అట్ల గడిచె , గడవంగ గడవంగ ఒక బక్కాయన తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టె-2001 లొ అనుకుంట .ఒ పని మీద ఇంటికి పొతి ,అప్పుడె పంచాయతి ఎన్నికల ప్రచారం కొసం కెసీఅర్ అచ్చంపేట్ వస్తుండె .మా బాపు 30 రుపాయలు కీసల పెట్టి పొయిరా కొడుకా మీటింగ్ అని పంపిస్తె ,పొతి కెసీఅర్ మాటలు వింటి .మా వట్వర్లపల్లికి కరంటు లెని సంగతి చెప్పె, సక్కగ గీత గీస్తె 30,40 కిలొమీటెర్ కూడ లెదు శ్రీశైలం నుంచి ఆ వూరు . 50 సంవత్షరంల జరిగిన వికాసం అది మన తెలంగాణా ల అని చెప్పె.తిరిగి ఇంటికి పొతి ,బాపు ఇప్పుదు ఐతె నమ్మకం వస్తుంది.తెలంగాణా వస్తదని . వార్సమైనొడె వచ్చినత్తుండి ఈ అంధ్రొల్ల పెత్తనం బంద్ చెయనికె. మా బాపు నమ్మలె ,ధక్క తిన్న పానం అది . ఎట్ల నమ్ముతరు ? .ఎంత పని చెస్తివి !

మొదట్ల మొదట్లనె తెలంగాణా జనం అంత బాగనె ఎంబడి వచ్చి సాబ్దారి ఇచ్చిరి . అందరు ఐతె ఎనుక రకపొఇరి .వచ్చినొల్లను ఎంబడి పెట్టుకొని కింద పడి మీద పడి ఎటికి ఎదురిదె .కన్నమ్మ తిప్పలు పడె. ఆ పొత్తులు ఈ పొత్తుల్ పెట్టుకొనె ,అందరితొ తెలంగాణాకు జై అని పించె. బయటకు ఐతె అందరు అన్నరుగాని లొపల ఎం గూడుపుఠని ఉందొ ఎవని ఎరుక.ఇది ముందె కలికలం. ఎన్ని ఏలచ్చనండ్లు లొ పొతి పడితివి.అక్కడక్కద ధక్క థింటివి.ఎప్పుడు ఒక వ్యసం రయని నా చెత ఎన్నొ రాతలు రాపిస్తివి . తెలంగాణా లొపట వేలకువేల పాటలు పుట్టు కొచ్చె .గొర్రెలకు పొయెటయన క్యాసెట్లు వెసుకొనె స్త్యాయికి వచ్హె.మరుగున పడిన తెలంగాణా జానపాదానికి జీవం పొస్తివి. ఒక సాంస్క్రుతిక విప్లవనికి ఆరాద్యుడివి ఐతివి. మనం ఎవ్వనికి తక్కువ కాదని ఎంతొ మందికి గుండె నిబ్బరం ఇస్తివి .

అమలాపురం అప్పరావు , అదిలాబాద్ అమరు, అమెరికా అజయ్, అరబ్ అబ్దుల్ భాయి , మదనపల్లి మద్దిలెటి అందరి మనసుల తెలంగాణా గురించి అలొచించని రొజు లెకుంట చెస్తివి . ఒకపక్క యాగం చెస్తివి మొరొక పక్క యాగీ చెస్తివి.దొరతనం పక్కన పెట్టి దొడ్డూ కట్టె చెత పట్టి దంచుత బిడ్డ అంటివి,నా తెలంగాణాకు అడ్డం వస్తె .

నా మొక్కు నీ దొరతననికి కాదు. నా మొక్కు నీ కున్న తెలంగాణా కమిట్మెంటుకు. నా మొక్కు తెలంగాణా సమాజాన్ని ఏకం చెసినందుకు.

Note: On the 10th Anniversary of TRS,I am writing this. Please pardon me for mistakes in Telugu script.

Courtesy – Mahesh Thipparti, thank you for sharing.

Related posts:

  1. Nagam says he will support Jagan if…
  2. Emirates T Cultural Association santhapa sabha
  3. Jayashankar blessed me – Errabelli
  4. Jagan’s money with Nagam Janardhan?
  5. Nagam nu veli veshnam
  6. Did CBN change his strategy on T?
  7. What did the Governor tell the center?
  8. SKC is a luccha committee – Nagam
  9. Jupally starts his Telangana yatra
  10. We need development of Telangana

Leave a Reply

Spam protection by WP Captcha-Free