Kodandaram’s Delhi trips
News pulse, Politics | admin | April 28, 2011 at 4:00 am
తెలంగాణ కోసం ఇంతకాలం టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఢిల్లీయాత్రలు చేస్తుండేవారు.ఇప్పటికీ చేస్తుంటారు. ఆయా నాయకులను గతంలో కలిసి వారందరి మద్దతు కూడగట్టడానికి విశేష కృషి చేశారు. ప్రత్యేకించి ప్రణబ్ కమిటీ దీనిపై పనిచేస్తున్నప్పుడు ఆయా రాష్ట్రాల నాయకులను కలిసి వారి నుంచి తెలంగాణ అనుకూల లేఖలు తీసుకునేవారు. అయితే కెసిఆర్ ఈ మధ్య డిల్లీలో అంత హడావుడి చేయడం లేదు.అయితే తెలంగాణ రాజకీయ కార్యాచరణ కమిటీ నేత కోదండరామ్ ఇప్పుడు ఆ బాధ్యత చేపట్టినట్లున్నారు.
భారతీయ జనతా పార్టీ నేత రాజ్ నాద్ సింగ్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్ నాధ్ సింగ్ వారికి సమాదానం ఇస్తూ
తమ పార్టీకి తెలంగాణ బిల్లుపెడితే మద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయాన్నిగుర్తు చేశారు.అలాగే సిపిఐ నేత ఎ.బి.బర్దన్ ను కలిసి శ్రీకృష్ణ కమిటీ,ఎనిమిదో చాప్టర్ తదితర అంశాల గురించి చర్చించారు. ఆయన కూడా వీరికి మద్దతుగా మాట్లాడారు. కాగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఢిల్లీ స్థాయిలో ఫ్రెండ్స్ ఫర్ తెలంగాణ అన్న సంస్థను ఏర్పాటు చేస్తున్నామని, ఆయా రాష్ట్రాలకు చెందినవారిని కూడా ఇందులో చేర్చుకుని కేంద్రంపై ఒత్తిడి తేవడానికి యత్నిస్తామని కోదండరామ్ తెలిపారు.
మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కెసిఆర్ తో సంబందం లేకుండా సొంతంగా చేస్తున్నారా? లేక గద్దర్ లేదా మరెవరి మద్దతుతతో కోదండరామ్ ఈ చొరవ తీసుకుంటున్నారోనన్న వ్యాఖ్యలు కొందరు చేస్తున్నారు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Prof. Kodandaram doubts center’s stand
- Differences between Prof and KCR again?
- Will SKC members be arrested?
- KCR and Prof. Kodandaram compromise
- Who are Telangana drohis?
- 75 lakhs release order issued for Tank Bund statues
- What did the Governor tell the center?
- Pocharam’s resignation accepted
- Telangana increment – KCR


Tweet This
Digg This
Save to delicious
Stumble it