Nirantharam paarey Netthuti Dhaara

News pulse, Politics | admin | April 20, 2011 at 3:28 am

Telangana

ఇంద్రవెల్లి ! గర్జించిన ఆదివాసి ఆవేశానికి చిహ్నం
రక్త పిపాసి ఐన రాక్షస రాజ్యానికి మరో మారణ కాండ..
అడవి బిడ్డల పోరు
అడవి తల్లి రోదన
తల్లి గర్బాన్ని చీల్చి కాసులు పండించుకున్దామనే
కాంక్షల హోరు ..దగాకోరు రాజకీయ పార్టీల వత్తాసు

నువ్వు నన్ను నలిపి వేసే, అణచి వేసే శక్తివి అనుకుంటున్నావు
నీ తుపాకి గుండులో ప్రజాస్వామ్యాన్ని ఎక్కుపెట్టి
మమ్మల్ని తూట్లు గా పోడుస్తున్నావు
ఇంద్రవెల్లి ఆదివాసిల అణచివేత కాదు , కాల్చివేత కాదు..
కసి తో కొత్త రక్తానికి ఊపిరి పోసిన నెల
ఆదివాసిలకు ప్రపంచ మద్దతు కూడగట్టుకున్న దినం
నువ్వు ముక్కలు ముక్కలుగా పడేసిన శవాలు
అడవినిండా చెల్లా చెదురై , వేరై , ఏరై, గాలి, చెట్టై, పుట్టై
అడవి సింహమై కొమరం భీములై ఊపిరి పోసుకున్న రోజు
నేడు నీ హింసని గుర్తుకు తెచ్చుకొని
మళ్లీ మేము గుండె నిండ ఊపిరి పీల్చుకొని
యుద్దానికి సిద్దమౌతున్నాం
ఈసారి కొత్త పంధాలో, నీ ఊహకి కూడ అందని
తిరుగు బాటు దారుల్లో..
గ్రీన్ హన్ట్లు, ఇంద్రవేల్లులు మాకు కొత్త కాదు,
నీకు కొత్త పేర్లు కావొచ్చు..కాని ఒకటే హింస ,
ప్రాణం ఒకటే
ఒక్కొక్క రక్తపు బొట్టు
వేల వేల సమూహాలకి జీవం పోస్తుంది..
ఇది అంతం కాని పోరాటం..
అడవి తల్లిని కాపాడుకొనే ఆరాటం..
నీకు గుణ పాఠం నేర్పే వరకు
అడవిని అక్కున చేర్చుకొనే వరకు
ఆగదు ఆదివాసిల అస్తిత్వపు అన్వేషణ.

Courtesy – Sujatha Surepally, thank you for sharing.

Related posts:

  1. Telangana in cross roads
  2. KCR Hyd la thiruga ledu – Danam & Mukesh
  3. Jayashankaraa, nee aalochanale maa aayudhaalu
  4. Ningi ki egasina Telangana keratam
  5. Shock to Karunanidhi
  6. Paaraa hushaar
  7. Vi ‘grahala’ vidwamsam
  8. Telangana aathma gosa
  9. CBN, kottha vesham
  10. Song on Mahabubabad firing

Leave a Reply

Spam protection by WP Captcha-Free