No work, No Pay – AP govt.
News pulse, Politics | admin | April 13, 2011 at 4:11 pm
రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా ఒక గట్టి నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకుండా ఉంటే జీతం ఇవ్వరాదన్నది ఆ విధానం. అప్పుడప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యవస్థీకృత బలంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. తెలంగాణ సాదన, ఇతర డిమాండ్ల పేరుతో తెలంగాణ జిల్లాలలోని ఉద్యోగులు రిజిస్టర్లలో సంతకాలు చేసి సహాయ నిరాకరణ పేరుతో విధులకు హాజరుకాకుండా నిరసన తెలిపారు. ఆ సమయంలో ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంది. పైగా వారు పనిచేసే ఇతర ఉద్యోగుల విదులకు కూడా ఆటంకాలు కలిగించారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాక, పనులు చేయకుండా, ఆటపాటలు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.నో వర్క-నో పే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉద్యోగులు విదులు నిర్వహించకుండా నిరసను తెలిపితే కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తూప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులు ఇవ్వడం వరకు బాగానే ఉంది.కాని వాటిని అమలు చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉంటుందా అన్నది సందేహం. అలాగే ఉద్యోగులు కూడా తాము సమ్మె చేయదలిస్తే, నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చి సమ్మె లేదా నిరసన తెలపాలికాని, ఇలా రిజిస్టర్ లో సంతకాలు చేసి తాము పనిచేయబోమని, ఇతరులను పనిచేయబోనివ్వబోమని మొండికేస్తే, అది మొత్తం వ్యవస్థకే చేటు తెస్తుంది.
అలాగని ఉద్యోగుల హక్కులను ఎవరు కాదనరు. కాని ఆ పేరుతో తమ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చనుకోవడం కూడా సరికాదు. అసలే ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేయరన్న అబిప్రాయం ఉంటే దానికి తగ్గట్లుగా ఇలాంటి ఆందోళనలు చేస్తే సామాన్యమానవులకు ఎంత ఇబ్బంది అన్నది ఆలోచించాలి.
Related posts:
- T to be formed by Deepawali – Shankar Rao
- Will Cong T politicians split?
- ఇంకెక్కడి సమైక్యత!
- Damodar Raja Narasimha cannot be Dy CM
- TDP challenges Jagan’s YSR Cong
- Did CBN change his strategy on T?
- Will CM, Kiran be a CM until 2014?
- Why did KVP meet Governor?
- 75 lakhs release order issued for Tank Bund statues
- Telangana increment – KCR


Tweet This
Digg This
Save to delicious
Stumble it