Panthulla madhya chicchu

News pulse, Politics | admin | April 17, 2011 at 7:47 am


తెలంగాణ,సీమాంధ్ర రాజకీయనేతలు, ప్రజలు మధ్య చిచ్చు రేపేందుకు కేసీఆర్ మరోసారి ప్రయత్నించారు. ఈసారి వంతు ఇరుప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులు మధ్య ఆయన విభేదాలు రేపేందుకు తన చండీయాగాన్ని ఉపయోగించుకున్నారు. చండీయాగం జరుగుతున్న సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రా బ్రాహ్మణులు కంటే తెలంగాణ వారే తెలివైన వారని, ఆంధ్రావారుకి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు చెందిన పంతుళ్లు బాగా తెలివైనవారు అయినప్పటికీ ఆంధ్రావారు తెలంగాణ వారిని అణగదొక్కారని, వారని ముందుకు రానీయలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో ఉన్నవారి మాదిరిగానే ఇక్కడ కూడా వీరు ఆంధ్రావారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో ఆంధ్రాకు చెందిన బ్రాహ్మణుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది.

ఇంతకాలం కేసీఆర్ కు చెందిన పూజలన్నీ మేమే చేశామని, అప్పుడు తెలంగాణ బ్రాహ్మణులు గుర్తుకురాలేదా ? అని, ఇంతకు ముందు కేసీఆర్ చేసిన చండీయాగం కూడా ఆంధ్రావారే చేశారని, అప్పుడు ఆంధ్రావారు తెలివితక్కువ వారని కేసీఆర్ కు తెలియదా అని సీమాంధ్రకు చెందిన కొంతమంది బ్రాహ్మణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైమైనా కేసీఆర్ వివిధ వర్గాల మధ్య విబేధాలు సృష్టించడంలో విజయవంతమవుతున్నారనే ఈ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. అన్ని వర్గాలు మధ్య బేధాబిప్రాయాలు రావడం వల్ల ఉద్యమానికి మరింత ఊపు వస్తుందనేది కేసీఆర్ అభిప్రాయంగా ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts:

  1. Telangana thappademo?
  2. Will Coastal Andhra and Rayalseema be together?
  3. Tears rolled down KCR’s eyes
  4. Jai Telangana in TDP’s Mahanadu
  5. Nagam is in full demand
  6. Asalu doshi Congress
  7. T supporters pull mike from Revanth Reddy
  8. CM bows down to pressure from ministers
  9. What did KCR do for Telangana – Erraballi
  10. Telangana increment – KCR

Leave a Reply

Spam protection by WP Captcha-Free