Pocharam’s resignation accepted
News pulse, Politics | admin | April 29, 2011 at 3:28 amనిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామాను శాసనసభ ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఆమోదించారు.టిడిపి వేసిన అనర్హత పిటిషన్ ను ఆయన కొట్టివేసి రాజీనామాను ఆమోదించడం విశేషం రెండు రోజుల క్రితం కూడా పోచారం నాదెండ్ల ను కలిసి తన రాజీనామా ఆమోదించవలసిందిగా కోరారు. అయితే టిడిపి వేసిన పిటిషన్ వల్ల రాజీనామా ఆమోదించడంలో జాప్యం జరిగింది. తద్వారా కడపతో కలిసి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేకుండా పోయింది. వచ్చే ఆరు నెలల్లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అయింది.అలాగే పెండింగులో ఉన్న ఆరు అనర్హత పిటిషన్లు కూడా పరిష్కారమైతే, వారిని అనర్హులుగా ప్రకటిస్తే వాటికి కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి.
పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా ఆమోదించబోతున్నట్లు ఈ వెబ్ సైట్ లో నాలుగు రోజుల క్రితమే పేర్కొనడం జరిగింది. ఆ వార్త ఇప్పుడు నిజం అయింది.తెలుగుదేశం పక్షాన ఎన్నికైన ఈయన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. దాంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.కాకపోతే సాంకేతికంగా టిఆర్ఎస్ కు ఓటు వేయడంతో అనర్హత పిటిషన్ వేయడానికి టిడిపికి అవకాశం ఇచ్చారు. దాంతో ముందుగా ఎన్నికలు జరిగే అవకాశాన్ని వదులుకోవల్సి వచ్చింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దశలో రాజీనామా ఆమోదించాలంటూ ఆందోళన కూడా చేశారు. ఎట్టకేలకు పోచారం రాజీనామా ఆమోదం పొందింది.
Related posts:
- Jai Telangana in TDP’s Mahanadu
- Differences between Prof and KCR again?
- KCR and Prof. Kodandaram compromise
- PRP MLA sends his resignation
- Balanaagi Reddy drama
- Kodandaram’s Delhi trips
- Chiranjeevi ki inko pareshani
- Telangana increment – KCR
- Erraballi fire on TRS
- Pocharam Srinivas joins TRS – in vdo


Tweet This
Digg This
Save to delicious
Stumble it