Telangana increment – KCR

News pulse, Politics | admin | April 13, 2011 at 4:24 am


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఆయా వర్గాలను ఆకర్షించేలా ప్రకటనలు చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాగానే ఇస్తానన్న వరాల చిట్టా చాలా ఉంది. తాజాగా ఆయన తెలంగాణ ఇంక్రిమెంటును కూడా ప్రకటించేశారు. తెలంగాణ రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికి ఒక స్పెషల్ ఇంక్రిమెంటు ఇస్తామని, దానికి తెలంగాణ ఇంక్రిమెంటు అని పేరు పెడతామని తెలిపారు.

తెలంగాణ పిఆర్ టియు నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పి.సుధాకరరెడ్డి టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కీల్ ఇస్తామని కూడా ఆయన చెబుతున్నారు.తెలంగాణలో ఇక పిఆర్ టియు ఉండదని, అంతా టిఆర్ఎస్ అనుబంధ సంస్థలోకి వచ్చేస్తారని కూడా ఆయన అన్నారు. జూన్ నాటికి తెలంగాణ వస్తుందని గతంలో కెసిఆర్ చెప్పారు.

ఆ ప్రకారం తెలంగాణ వస్తే , కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. అలాంటప్పుడు ఈయన ఇచ్చే వరాలన్నిటికి కాంగ్రసె నుంచి పూజి పొందారనుకోవాలా? లేక కాంగ్రెస్ కు ఆయన కూడా మద్దతు ఇస్తారనుకుని,ఆ భరోసాతో ఈ ప్రకటనలు చేస్తున్నారో తెలియదు. టిఆర్ఎస్ కు ప్రస్తుతం పదకుండు శాసనసభ స్థానాలే ఉన్నాయి. దాని ప్రకారం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.లేదంటే 2014నాటికి గాను ఎన్నికలు రావు.

అప్పుడు మెజార్టీ స్థానాలు తెచ్చుకుని ఈ వాగ్దానాలు అమలు చేయగలుగుతారు. అప్పటివరకు ఆగాలని కూడా కెసిఆర్ చెబుతారా? లేక
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చినా ఇవన్ని చేసేస్తామని చెబుతారా?

Related posts:

  1. Telangana thappademo?
  2. KCR and Nagam at Cong deeksha
  3. Is KK’s proposal valid?
  4. Chances of Chiranjeevi to be CM?
  5. Jai Telangana in TDP’s Mahanadu
  6. Differences between Prof and KCR again?
  7. KCR and Prof. Kodandaram compromise
  8. What did the Governor tell the center?
  9. Kodandaram’s Delhi trips
  10. No work, No Pay – AP govt.

Leave a Reply

Spam protection by WP Captcha-Free