What did KCR do for Telangana – Erraballi

News pulse, Politics | admin | April 17, 2011 at 7:53 am


టీఆర్ఎస్ నేత కె.తారకరామారావు తనపై చేసిన విమర్శలకు ప్రతిగా శనివారం నాడు టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే వారిని రెచ్చగొట్టి, ఆత్మహత్యలకు ప్రేరేపించడం మినహా కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ తెలంగాణ ప్రజలు కోసం ఏం చేశారని ఆయన తీవ్రస్థాయిలో దూషించారు. కేసీఆర్ తాతకు గుంటభూమి కూడా లేదని,ఇప్పుడు కోట్లు రుపాయలు ఎలా సంపాదించారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపిని కానీ టార్గెట్ చేస్తే టీఆర్ఎస్ ను, కేసీఆర్ కుటుంబాన్ని బజారుకీడుస్తామని ఆయన హెచ్చరించారు.

అంతేకాకుండా మొన్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోవాలని కోరుతూ చంద్రబాబుతో సహా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జైలు పాలయ్యారని, తెలంగాణ అభివృద్ధికి కూడా చంద్రబాబు ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. ఇలాంటి ఉద్యమం ఏదైనా కేసీఆర్ చేశారా అని..అసలు తెలంగాణ కోసం రెచ్చగొట్టడం మినహా ఏం చేశారో చేప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కవిత, కేటీఆర్ లు ఆంధ్రాలో చదువుకొని అమెరికాలో ఉద్యోగాలు చేసి ఇక్కడ ఉద్యమం పేరుతో డబ్బు సంపాదన చేస్తున్నారని, వారి బండారం బయటపెడతామని హెచ్చరించారు.

ఏమి ఉద్యమాలు చేసారని సిరిసిల్లలో ఉద్యమాలు చేసిన వ్యక్తిని కాదని కేటీఆర్ కు టిక్కెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా వారి పాస్ పోర్టును సీజ్ చేయాలని, లేదంటే వారు ఇక్కడ డబ్బు సంపాదించి విదేశాలకు పారిపోతారని చెప్పారు. తెలుగుదేశాన్ని విమర్శిస్తే సహించేదని లేదని, కావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మరోసారి పోటీ చేద్ధామని ఎర్రబెల్లి సవాల్ చేశారు.

Related posts:

  1. Payyavula ‘Kasab’
  2. We will show the power of Hyderabad – Cong T ministers
  3. Damodar Raja Narasimha cannot be Dy CM
  4. Jai Telangana in TDP’s Mahanadu
  5. T supporters pull mike from Revanth Reddy
  6. Jagan’s money with Nagam Janardhan?
  7. Nagam nu veli veshnam
  8. 75 lakhs release order issued for Tank Bund statues
  9. SI exams issue again
  10. Panthulla madhya chicchu

Leave a Reply

Spam protection by WP Captcha-Free