YSR Congress buying fans
News pulse, Politics | admin | April 23, 2011 at 7:24 am
ఇదేంటి వేసవి కాలం సగం అయిపోయిన తర్వాత ఫ్యాన్లకు డిమాండ్ అనుకుంటున్నారా? అసలు హైదరాబాద్ లోని సనత్ నగర్ కు ఫ్యాన్లకు సంబంధమేంటనుకుంటున్నారా? కానీ మీరు ఊహించినట్లు జగన్ గుర్తు మాత్రం ఫ్యాన్ అన్నది కరెక్టే. అయితే ఫ్యాన్లకు జగన్ గుర్తు వల్ల డిమాండ్ వచ్చిందా? లేక వేసవి కాలం కాబట్టి గిరాకీ ఏర్పడిందా అన్న వివరాల్లోకి వెళ్తే… కడపలో ఎవరికి వారే ప్రత్యర్థిపార్టీలపై ధనప్రవాహమంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఒకరు ఎటిఎంల ద్వారా నగదు బదిలీలు చేస్తుంటే, మరొకరు కరెంట్ బిల్లులు,ఫోన్ బిల్లులు,మొబైల్ ఫోన్లు కొనివ్వడం వంటివి చేస్తున్నారు. అయితే 100 లేదా 200ఓట్లను మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటే కార్లను కూడా ఇస్తున్నారట. దీనికి భిన్నంగా కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ వారు మాత్రం తమ సింబల్ కు అనుగుణంగా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అందుకోసమే ప్యాన్ల తయారీకి ప్రాముఖ్యతగాంచిన సనత్ నగర్ నుంచి లక్షల్లో ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం. ఇక్కడ ప్యాన్ల కంపెనీలు ఎక్కువ ఉండటంతో దాదాపు అన్ని కంపెనీలకు ఈ ఆర్డర్లు వచ్చాయని, వాటిని తయారు చేయించే పనిలో పార్టీ నేతలు తలమునకలై ఉన్నారట. ఇందుకు ముందు కూడా చంద్రబాబునాయుడు 1999ఎన్నికల్లో సైకిళ్లను పంపిన చేసిన సంగతి తెలిసిందే..ఒకవేళ జగన్ ఇప్పడు గెలిస్తే వచ్చే ఎలక్షన్లకు రాష్ట్రమంతటా ఫ్యాన్ల పంపిణీ ఉంటుందేమో …
Related posts:
- Nagam says he will support Jagan if…
- Superstar Krishna into YSR cong?
- Jagan gives shock to Ambati and Gone
- Nagam is in full demand
- Jayasudha avoiding Jagan’s party?
- Who are Jagan’s coverts in cabinet?
- 75 lakhs release order issued for Tank Bund statues
- Balanaagi Reddy drama
- Congress ku August bhayam
- Kandula brothers jump into Congress


Tweet This
Digg This
Save to delicious
Stumble it