75 lakhs release order issued for Tank Bund statues
News pulse, Politics | admin | May 12, 2011 at 4:00 amతెలంగాణ జేఎసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ మార్చ్ లో ట్యాంకుబండ్ పై విగ్రహాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. అయితే వాటి స్థానాల్లో మళ్లీ తెలుగుప్రముఖుల విగ్రహాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం అప్పడే నిర్ణయించింది. దీనికి సంబంధించి 75లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే తెలంగాణనేతలు మాత్రం అప్పట్లో ఆయా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదని, కానీ తెలంగాణ కవులు,కళాకారుల విగ్రహాలు కూడా వాటితో పాటు ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి నేత కవిత డిమాండ్ చేశారు.అలాగే ఓయూ జేఏసీ నేతలు కూడా ఈసారి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఇప్పడున్న విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేస్తే మళ్లీ కూలదోస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత వాటినే ఏర్పాటు చేస్తుందా లేక తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారా అన్నది స్పష్టం చేయలేదు.మరి తెలంగాణవాదులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
Related posts:
- Telangana thappademo?
- KCR and Nagam at Cong deeksha
- I dare Nagendar, Mukesh to come out of Hyd
- Prof. Kodandaram doubts center’s stand
- KK’s bheeshana keka
- T supporters pull mike from Revanth Reddy
- Will SKC members be arrested?
- What did the Governor tell the center?
- Kodandaram’s Delhi trips
- The rise and fall of statues on Tank bund


Tweet This
Digg This
Save to delicious
Stumble it