Anyayaaniki kooda Ambedhkar aa?

News pulse, Politics | admin | May 19, 2011 at 7:30 pm

Telangana

నిజానికి కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటె బాగుంటుంది అనిపిస్తుంది, ఇలా జరగక పొతే ఇంక బాగుండు అనిపిస్తుంది..కాని అన్యాయాలు, దోపిడిలు ఎన్ని రకాలుగా చూడాలో , చూడాల్సి వస్తుందో అని భయంగా ఉంది..అసలు మనం ఉన్నది మానవత్వం ఉన్న మనషుల మధ్య లోనేన అని అనుమానం కూడ కలుగు తుంది..గుండె తొలుస్తుంది. గత కొద్ది కాలంగా మేము తెలంగాణా భూమి రక్షణ సంగం గా గ్రానైట్ మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము. కొన్ని రోజుల తరువాత తెలిసింది ఇందులో అందరు , బడా బాబులు, రాజకీయ నాయకులు దొంగలే అని..ముందుగా పెత్తందారి, వలసాంద్ర వాదుల పనే అని గగ్గోలు పెట్టాము..అయితే వారితో పాటు మన వాళ్ళు కూడ, పవల వంతు, పడి పైసల వంతులో బాగా స్వాములని తెలుసుకొని..ఏమి చేయాలో ఎవరి మీద యుద్ధం చేయాలో అర్థం కాలేదు. అయిన ఏదో ఒక రూపంలో తరలి పోతున్న ఖనిజ సంపదని, కరిగి పోతున్న జనావాసాలని, అంతరించి పోతున్న జంతువులని, బడుగు జీవులని , ఎండి పోతున్న జలాలని కాపాడాలని తపనతో ఎన్ని అడ్డంకులు వచ్చిన ముందుకు పోతున్నాం ..

ఈ సమయం లో మాతోటి కొంత మంది స్తానిక యువకులు , పెద్దలు కూడ ఉద్యమం లో పాల్గొనడానికి ముందుకు వచ్చారు . అందులో ఒక వ్యక్తి దుర్వాస రెడ్డి, మన కొండూర్ మండలం, అన్నారం గ్రామం. వాళ్ళ ఊరిని కూడ ఈ గ్రానైట్ తవ్వకాలు పాడు చేస్తున్నాయని పెద్ద ఉద్యమాన్ని నడిపిన వ్యక్తీ, తరువాత మాతో పాటు కలిసి ఉద్యమంలో పాల్గొంటున్నాడు. మొన్న ఏప్రిల్ ౩౦ న జరిగిన ప్రాణహిత చేవెళ్ళ పబ్లిక్ హియరింగ్ లో రాజకీయ నాయకుల ఆగ్రహానికి కూడ గురి కాబడ్డాడు,( యు ట్యూబ్ లో చూడగలరు)…అంతకు ముందునుంచే ఊరి లో ఉన్న కొందరు రాజకీయ నాయకుల, వ్యాపార వేత్తల తొత్తులు కలిసి పథకం ప్రకారం కుట్ర పన్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని పథకం పన్నారు. మే 15 న మేము అందరం ఒక జాక్ స్టూడెంట్ లీడర్ తమ్ముడు పెళ్ళికి వెళ్ళాము. అదే రోజు అన్నారం గ్రామంలో ఒక రెడ్డి ఇంట్లో పెళ్లి జరిగింది, దానికి దుర్వాస్ కూడ మధ్యాన్నం వరకు వెళ్లి వచ్చాడు. అదే రోజు సాయంత్రం మేమంతా పెళ్ళిలో ఉన్నాము.. ఆ రోజు రాత్రి మాతోనే ఉన్నాడు, రెండవ రోజు వచ్చినే వార్త ఏంటంటే ఊర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో పగల గోత్తారని, రాత్రి పెళ్లి వారు బాగా తాగి ఈ పని చేసారని , అది కూడ రెడ్డి వారు చేసారని ఒక అనుమానం తో వార్త వచ్చింది. తరువాత చుస్తే అది కొద్ది మంది ఎస్సి , బిసి వారు కలిసి చేసారని, దాని వెనుక కొందరి హస్తం ఉందని తెలిసింది. అనుమానితుల జాబితాలో దుర్వాస్ పేరు ముందుగా పెట్టి సర్పంచ్(దుర్వాస్ చుట్టం) , జెడ్ పి టి సి , ఎం పి టి సి, ఎం ఎల్ ఏ కలిసి వల పన్నారని అంచనా. .మూడు రోజులు అసలు నిందితులని తప్పించి, అమాయకులని స్టేషన్ కి తరలించారు, దుర్వాస్ ని పంపించకుండా చాల జాగ్రతలు తీసుకున్నాము, అయినా కూడ ఈ రోజు, సదరు ఎం ఎల్ ఏ గారు వూరికి విచ్చేసి ఎం చేసారో తెలియదు కాని దుర్వాస్ ని స్టేషన్ కి రమ్మని తీసుకొని పోయారు. ఆరోజు అతను అక్కడ లేదని తెలుసు, రెడ్డీస్ ఎవరు కూడ నిందితులు కాదని తెలుసు..కేవలం ఒక వంకతో, ఒక భయానక వాతావరణం సృష్టించడానికి అంబేద్కర్ ని అడ్డు పెట్టుకున్నరన్నది అక్షరాల సత్యం, అది కూడ దళిత బహుజన ప్రజా ప్రతినిధులు..వారి వెనుక ఎవరైనా ఉండవచ్చు..విందులో బాగా తాగించి, అమాయకులతో చేయించిన పని..అంబేద్కర్ కి తల పగిలింది..గాయం అయింది..రక్తం కన్నిరై ఉండవచ్చు..ఇక్కడ కుల సంగాలు మాట్లాడ లేవు..న్యాయం కళ్ళు మూసుకుంటుంది. వెనుక ఉన్న హస్తాలను గుర్తించలేము..గుర్తించిన మాట్లాడలేము..పొలిసు వారు రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు మాత్రమె రక్షణ కల్పిస్తారు. ఎందుకంటే మామూలు ప్రజలు ప్రశ్నిస్తే వారి ఉనికికే ప్రమాదం మరి..ఎక్కడో గంజాయి వనం లో తులసి మొక్కల్లా ఒకరో ఇద్దరో మంచి వాళ్ళు ఉంటారు అన్ని తరగతులలో, వారే మాలాంటి వాళ్లకి ఎపుడు రక్షణ, అలా స్పందించారు కాబట్టే ఇప్పటికి కాపాడు కో కలిగాము మా యువ నాయకుడిని, మరి రేపు మళ్లీ పిలుస్తారంట, ఏమైతుందో చూడాలి. ఇవన్ని చేసేది మన నాయకులే బాబు, ఇది మరిచి పోవద్దు..అనవసర కలలు కనొద్దు..తెలంగాణా ఒక ‘జండు బామ్’ గా అన్ని నొప్పుల్ని తగ్గిస్తుందని బ్రమించొద్దు. హం ఫట్ అని మాయలు మంత్రాలు చేసి, పాపాలను నసింప చేయు కాక అని కూడ అనుకోవద్దు. ముక్యంగా , ఏది ఏమైనా కాని భూమి గురించి మాట్లాడొద్దు, నాయకులని ఎదిరించొద్దు..నీ బాంచను దొర అంటే నీకు ఏదో ఒక సీటు , మాట సాయం, కొంచెం ధన సాయం గ్యారంటీ. లేకపోతె ఊచలు లెక్ఖ పెట్టుకోవడం ఖాయం. కులాలు , మతాలు జనతా నై! న్యాయం వర్సెస్ అన్యాయం ఇంతే బ్రదర్. చెల్లి, నీ మాట మాట్లాడే తీరిక ఎవరికీ లేదు..నీ చావు నువ్వు చావాల్సిందే..ముందు మా కష్టాలు తీరనియ్ అంటరు, రేపు నిన్ను కష్ట పెట్టడంలో మున్డుతారు..మూలిగే నక్క పై తాటి పండు! ఇక్కడ స్త్రీ , దళిత, బహుజన , ఆది వాసి, మైనారిటీ అస్తిత్వాలు అన్ని అట్ల కొట్లాడాల్సిందే..నిలబడడానికి నేలనే లేకపోతె మాట్లాడేది ఎట్లా, బతికేది ఎట్లా? అవును, చస్తే పాటి పెట్టడానికి మరి? ఇప్పటినుంచే ఆరడుగులు దాచి పెట్టుకోండి ప్లీస్!

తలుచు కుంటేనే బాధగా ఉంది..ఉరిని దోచే దళితుడు ఒకడు..దళితుడిని ఆడించే రెడ్డి ఒకడు..ఊరిని, దళితులని కాపాడాలనే మరో రెడ్డి..చోద్యం చూస్తున్న చదువుకున్న వారు..ఏమి చేయాలో తెలవక వెర్రి బాగులైన అమాయకపు ప్రజలు, ఇక్కడ కులాల లెక్కలు ఏమి పని చేయటం లేదు..ఏమైనా పవర్ పాలిటిక్స్ …అంటే ఇక్కడ దళితులూ, ఇతరులు విలన్లు అని చెప్పడం ఉద్దేశం కాదు..కాని కక్షలకి, అన్యాయాలకి అంబేద్కర్ ని కూడ వదలకుండా చేస్తూన్న రాజకీయాలు చూసి విరక్తి పుడుతుంది. అంబేద్కర్ ఒక దళితులకి మాత్రమె లీడర్ కాదన్న విషయం చాల మంది చదువుకున్న వారికి తెలుసు..ఈ కుళ్ళు సామజాన్ని , అసమ సమాజాన్ని , సమ సమాజముగా మార్చడానికి, కుళ్ళుని కడిగి వేయడానికి కులాన్ని వీడండి అని పిలుపునిచాడు..చదువుకుంటే సంస్కారం వస్తుందని, ఆర్ధిక స్వతంత్రం కింది వర్గాలకి, కులాలకి సహాయ పడుతుందని, మూడ నమ్మకాలున్డవని ఆశ పడ్డాడు. వనరులని జాతియం చేయమన్నాడు..కాని నేడు వనరులని ఇతర దేశాలకి తరలిస్తున్నాము, వ్యాపారాలని మాత్రమె లేఖ చేస్తున్నాము..వ్యక్తులని సమూహాలని మారుస్తున్నాము..ఎటు పోతున్నాము? ఎవరు మనకు దిక్కు? దిక్సూచి లేని నావ లాగా ఎన్నాళ్ళు ఈ జీవితం?

మన కోసం జీవితాలు త్యాగాలు చేసి, మంచి తనానికి బాటలు వేసిన మహా నీయుల ఆత్మలకు శాంతిని కల్పిద్దాం..నీచ సంస్కృతికి సమాధి కడదాం!

జై తెలంగాణా!

Related posts:

  1. ‘Andhra’ bhavan arachakam
  2. I dare Nagendar, Mukesh to come out of Hyd
  3. Nagam says he will support Jagan if…
  4. L Rajagopal avatharaalu velladistha
  5. CBN’s Heritage foods attacked
  6. Jayasudha avoiding Jagan’s party?
  7. Jagan behind me, no no – Nagam
  8. SI exams issue again
  9. New style of canvassing, do not talk
  10. What did KCR do for Telangana – Erraballi

Leave a Reply

Spam protection by WP Captcha-Free