Asalu doshi Congress
News pulse, Politics | admin | May 26, 2011 at 3:00 am
అది తెలంగాణ నేల. అక్కడ కొట్టుకున్నది తెలంగాణ బిడ్డలు. అక్కడ చిందింది తెలంగాణ రక్తం. ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, ప్రాంతీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టి విలాసంగా కూర్చున్న సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీయే అసలు దోషి. తెలుగు ప్రజలు మెచ్చి మేకతోలు కప్పి ఢిల్లీకి పంపిన ముప్ఫైమూడు మంది ఎంపీలు కానీ, తొలినాళ్లలో కేంద్రమంత్రి పదవి వెలగబెట్టిన కేసీఆర్ కానీ అదిగదిగో అనడం తప్ప సాధించింది శూన్యం. నేడు తెలుగుదేశం మీద విషం చిమ్మి, తెలుగుదేశాన్ని ఓడించి కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌లు గెలిచి ఏం సాధించగలరు? ఏరు దాటాక తెప్ప తగలేసే కాంగ్రెస్ నీడలో ఏ ప్రజా ఉద్యమాలూ మనలేవు. అరవైతొమ్మిది నుంచీ చూస్తున్నాం.
ఈ దేశానికి చీకటి రోజులు తెచ్చింది కాంగ్రెస్. ఈ దేశాన్ని ఇంకా ఆకలిలో ముంచింది కాంగ్రెస్. వాళ్ల లెక్కప్రకారమే ఎనభైకోట్ల మందికి ఆహారభద్రత ఇవ్వాల్సిన పరిస్థితిలో ప్రజలున్నారంటే మన అరవైనాలుగేళ్ల స్వేచ్చాజీవితానికి సిగ్గుచేటు. తెలుగువాడికి 1983కు ముందేకాదు నేడూ అడుగడుగునా అవమానాలు. మన పీవీనీ మన అంజయ్యనూ అవమానించిన హస్తినాపురాధీశులు, తెలుగు రాజకీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టి, వాటిని బలహీనం చేసి, వాటిని కొనేసి, వాటిని నమ్ముకున్న ప్రజల రక్తమాంసాలతో పండగచేసుకుంటున్నారు.
ఇటలీలోని యూదువ్యాపారి షైలాక్ లాగ దేశ ప్రజలను ఆంటోనియోలుగా చేసి వాళ్ల రక్తాన్నీ మాంసాన్నీ కోసుకుని తింటున్నారు. ఇటలీ సంస్కృతి అవశేషాలూ నెహ్రూ కుటుంబ ఆధిపత్య ధోరణీ మూసపోసినట్టు అతికిన సోనియాజీ నేతృత్వంలో ఈ దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అన్నిరకాల అవమానాలకూ మోసాలకూ గురవుతున్నారు. తెలుగు ప్రజలారా, మేల్కొండి. శతృవెవరో తెలుసుకోండి.
Related posts:
- Telangana thappademo?
- Payyavula ‘Kasab’
- Godavari neeti dhopidi
- Differences between Prof and KCR again?
- T supporters pull mike from Revanth Reddy
- YSR Congress buying fans
- What did KCR do for Telangana – Erraballi
- Panthulla madhya chicchu
- Kandula brothers jump into Congress
- Evaru Telangana Drohulu?


Tweet This
Digg This
Save to delicious
Stumble it