CBN’s Heritage foods attacked

News pulse, Politics | admin | May 27, 2011 at 3:33 am

ఉస్మానియా జెఎసి చెందిన కొందరు ఆందోళనకారులు చంద్రబాబునాయుడుకు చెందిన హిరిటేజ్ సంస్థపై దాడులు చేశారు. మహానాడుపై దాడికి వెళ్లినవారిని పోలీసులు అరెస్టు చేశారని వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండు చేస్తున్నారు. అయితే విద్యార్ధులు ఇలాంటివి చేయడం వల్ల మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.

తెలుగుదేశం అదినేత చంద్రబాబుకు సంబందించిన హెరిటేజ్ సంస్థపై దాడి చేయడం ద్వారా తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు. మహానాడు దగ్గరకు వెళ్లి డిస్టర్బ్ చేయాలని అనుకోవడమే తప్పు. దానికి అరెస్టు చేసినవారిని విడుదల చేయాలంటే , చట్టపరంగా వెళ్లవచ్చు. లేదా ప్రశాంతంగా నిరసన తెలపవచ్చు.కాని ఇలా దౌర్జన్యాలకు దిగితే ఎదుటి వారు కూడా ప్రతిదాడులు చేస్తే అది మొత్తం వ్యవస్థకే తలనొప్పిగా మారుతుంది.

అది అందరి భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేస్తుంది. కాని దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితి హితవాక్యాలకు అనువుగా లేదు. దానికి రాజకీయ నాయకులే బాధ్యులు. వారిచేతిలో విద్యార్దులు పావులు కాకుండా ఉంటే అదే పదివేలు.

Related posts:

  1. I dare Nagendar, Mukesh to come out of Hyd
  2. Damodar Raja Narasimha cannot be Dy CM
  3. TDP challenges Jagan’s YSR Cong
  4. Will SKC members be arrested?
  5. 75 lakhs release order issued for Tank Bund statues
  6. Kodandaram’s Delhi trips
  7. Jayalalitha taking revenge on Karunanidhi
  8. CM bows down to pressure from ministers
  9. No work, No Pay – AP govt.
  10. Heritage Foods, Memu Telangana ku anukulam – in pic

Leave a Reply

Spam protection by WP Captcha-Free