Chiranjeevi to be CWC member?

News pulse, Politics | admin | May 10, 2011 at 3:17 pm


ప్రజారాజ్యం అధినేత,కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విదాయక సంస్థ అయిన వర్కింగ్ కమిటీలో సభ్యత్వం లభిస్తుందని ఒక ప్రముఖ పత్రిక రాసింది. అయితే అది సాధ్యమయ్యేపనేనా అన్న చర్చ జరుగుతోంది.చిరంజీవికి కాంగ్రెస్ లో ప్రాముఖ్యత పెరిగే మాట వాస్తవమేనని, అయితే చిరంజీవికి అప్పుడే వర్కింగ్ కమిటీ పదవి ఇస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది.

కొంతమంది ఇదేదో ఊహగానం గా భావిస్తుంటే , చిరంజీవి అబిమానులు మాత్రం వర్కింగ్ కమిటీ పదవి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిస్తున్నారు. వారికి ఇది ఆనందం కలిగించే అంశమే.కాని పూర్తిగా కాంగ్రెస్ లోకి రాకముందే, లేదా వచ్చిన కొద్ది కాలానికే అంతటి పెద్ద స్థానం చిరంజీవికి కల్పిస్తే కాంగ్రెస్ చరిత్రలో అదో రికార్డు అవుతుంది. అనేకమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులకే సి.డబ్యు.సిలో స్థానం ఉండదు.

మహా అయితే ప్రత్యేక ఆహ్వనితులుగా ఉంటారు.అలాంటిది కాంగ్రెస్ లో ఇంతవరకు ఒక్క రోజు కూడా లేని చిరంజీవికి ఏకంగా సి.డబ్ల్యుసి. పదవి ఇవ్వడమైనా, ఇస్తారని ప్రచారం చేసినా, అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయమే అవుతుంది. ఇంతకాలం కేంద్ర మంత్రి పదవి ఇవ్వవచ్చని అనుకున్నారు. ఆ విషయాన్ని ప్రజారాజ్యం పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పారు. చిరంజీవి సి.డబ్ల్యుసి పదవి ఇస్తే కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకున్నట్లు అవుతందని ఆ కధనంలోరాశారు. ఏదైనా ప్రభుత్వ హోదా పదవి వస్తే వారంతా ఎక్కువ సంతోషిస్తారుకాని సిడబ్యుసి పదవి ఇస్తే ఎవరికి పెద్దగా ఒరిగేది ఉండదు.

కాంగ్రెస్ లో ఏదైనా సంక్షోభం వస్తే తప్ప ఈ పదవిలో ఉన్నవారికి పెద్ద పని కూడా ఉండదు. గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి, వెంకటస్వామి వంటివారు సిడబ్ల్యుసి పదవిలో ఉన్నప్పటికి వారు కేవలం సమావేశాలకు హాజరవడమే తప్ప పెద్దగా సాధించింది లేదన్న అబిప్రాయం ఉంది.అయితే సిడబ్ల్యుసి పదవి అంటే అదో గౌరవం. పార్టీలో అంతకు మించిన పదవి ఇంకొకటి లేనట్లు లెక్క.మరిఅలాంటి పదవిని భవిష్యత్తులో ఏమోకాని, ఇప్పటికిప్పుడు ఇస్తారా అన్నది ప్రశ్నార్ధకమే.

Related posts:

  1. I dare Nagendar, Mukesh to come out of Hyd
  2. Chances of Chiranjeevi to be CM?
  3. Damodar Raja Narasimha cannot be Dy CM
  4. Rebels already in YSR Cong
  5. TDP challenges Jagan’s YSR Cong
  6. Does Chiru know poli ‘tricks’?
  7. PRP MLA sends his resignation
  8. What did the Governor tell the center?
  9. Chiranjeevi ki inko pareshani
  10. Congress ku August bhayam

Leave a Reply

Spam protection by WP Captcha-Free