Deeksha planned by Jagan

News pulse, Politics | admin | May 11, 2011 at 3:26 pm


కడపలో భారీ మెజార్టీతో గెలుస్తామన్న ధీమాతో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఉద్యమ బాట పడుతున్నారు. ఈసారి ఆయన గుంటూరును వేదికగా మార్చుకున్నారు గుంటూరు లో నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్షకు ఆయన సిద్దమవుతున్నారు. ఈ విషయాన్ని నెల్లూరు ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రటించారు.పదమూడో తేదీన ఎన్నికల ఫలితం రాగానే ఆయన గుంటూరు లో ఈ కార్యక్రమానికి దిగడం గమనించదగిన అంశం. అయితే అంతకుముందు ఆయన విజయనగరం జిల్లాలో ఓదార్పుయాత్రను చేపట్టాలని తేదీలను ప్రకటించారు.

కాని దానిని ఈనెల ఇరవైనాలుగుకు వాయిదా వేసుకుని రైతు సమస్యలపై దీక్షకు దిగుతున్నారు. ప్రత్యేకించి రైతులు పండించిన ధాన్యం దరలకు గిట్టుబాటు ధరలు రావడం లేదన్న అంశంపై ఉద్యమిస్తున్నారు. ఇది ఒకరకంగా తెలివైన నిర్ణయమే. ఉప ఎన్నిక ఫలితం రాగానే ఎమ్మెల్యేలతో మంతనాలు, తమవైపు ఎంతమంది వస్తారన్న అంశాలపై కాకుండా రైతు సమస్యలపై ఉద్యమిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.

ఆయన తండ్రి రాజశేఖరరెడ్డికి రైతులలో మంచి ఆదరణ ఉంది. ప్రదానంగా ఉచిత విద్యుత్, వడ్డీ మాఫీ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా రైతు వర్గాలను ఆకట్టుకున్నారు. ఆ వారసత్వాన్ని తాను కైవసం చేసుకునేందుకే ఆయన ఈ దీక్ష చేస్తున్నారు.ఇంతకుముందు విజయవాడలో భారీ వర్షాల వల్ల నష్ట పోయిన రైతుల కోసం దీక్ష చేశారు. ఆ తర్వాత విశాఖ, డిల్లీలలో జలదీక్ష, కృష్ణ ట్రిబ్యునల్ తీర్పు పై రాష్ట్రానికి కలిగే నష్టంపై దీక్ష వంటి కార్యక్రమాలు చేపట్టారు. రైతులలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడమే ఆయన లక్ష్యంగా కనబడుతోంది.

Related posts:

  1. Hyd is not obstacle for bifurcation of state
  2. KCR and Nagam at Cong deeksha
  3. Deeksha viraminchandi – KCR
  4. Dhikkaristhunna Telangana – Deeksha Telangana
  5. Nagam says he will support Jagan if…
  6. TDP all set for No-Trust move
  7. Jagan gives shock to Ambati and Gone
  8. Jayasudha avoiding Jagan’s party?
  9. Telangana increment – KCR
  10. Pocharam Srinivas joins TRS – in vdo

Leave a Reply

Spam protection by WP Captcha-Free