Dhaari thapputhunna Telangana
News pulse, Politics | admin | May 29, 2011 at 8:00 am
దారి తప్పుతున్నదో , తప్పు దారి పడుతున్నదో, దొంగెవరో తెలుస్తలేదు, దోరెవరో తెలుస్తలేదు, పతోక్కడు నేనే తెలంగాణా వాడిని అంటున్నాడు, ఆఖరికి రాయలసీమ, గుంటూరు గుండాలు కూడ! కాఖీలకి తోడుగా, తుపాకులను చేతబట్టి, అది కూడ సరి పోక మన అచ్చ మైన మైన తెలంగాణా లీడర్లు కిరాయి గుండాలను తరలించి తన్నిపిస్తున్నారు..ఇదెక్కడి న్యాయం అన్న! జర చెప్పుండ్రి, ఇంతన్యాయం ఇంకేక్కడన్నా ఉంటాదే! గా మొన్నా మా మార్వాడి సుదర్శన్, కే యు జాక్ పిల్లలు, కరీంనగర్ పోలీస్ స్టేషన్ ల నుండి ఫోన్ చేసిండ్రు , ఈడ అందరు తెల్ల అంగీ, లుంగీలు కట్టుకొని తెలుగుదేశం మీటింగ్ల ఉన్నారు మాడం, మమ్మల్ని ముందుగాలనే పోలిస్ స్టేషన్ ల కూసో బెట్టిన్రు అని, రేవంత్ రెడ్డి చేతుల గన్ను బట్టుకొని తిరుగుతండు అని..మనోళ్ళు కొట్లాడానికి కేంద్రం ఒకటే కాదు, ఆంద్ర పెట్టుబడిదారులే కాదు..అక్కడి గుండాలను తెచ్చుకొని సభలను నడిపే తెలంగాణా ముద్దు బిడ్డలను కూడ లేక్ఖల్లోకి పెట్టుకోవాలే, ఈ కలర్ సైన్మా సూడనికి మిగిలిన నాయకులు క్యూలో నిలబడి ఉన్నారు, కలి కాలం తమ్మి! వీడెవడు వాడెవడు తెలంగాణాకి అడ్దేవాడు..అసలు అడ్డేవరు కాదో చెప్తే ఎవరితో లొల్లి చేయాలనో తెలుసు కుంటం. ఎవరు మనకు జ్ఞానోదయం కలిగించును, అకటా! ఎంతటి క్లిష్ట పరిస్తితి. సోనియమ్మ! మల్లా ఈ తెలంగాణా గడ్డ మీద నిలబడాలంటే జర పైలం బిడ్డ! ఈ గడ్డకి చాన చరిత్ర ఉంది, అన్నాయం చేసినోన్ని ఎవడిని వదిలి పెట్టలేదు..మేము ఏమి చేయకున్నా..జరిగే పనులు జరుగుతనే ఉంటాయి, ఈ సారి పావురాల గుట్ట కాదు, నేమిల్ల గుట్ట రెడిగుంటది చూసుకొండ్రి!
ఒక ప్రజాస్వామిక హక్కు సాధించడానికి ఇన్ని పానాలు, ఇన్ని కథలు, కన్నీళ్లు, రక్త పాతాలూ, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని కష్టాలు..కమిటీలు, కరడుకట్టిన కసాయి వాడికైనా గుండె కరుగుతదేమో కాని, మా తెలంగాణా నాయకులకు మాత్రం ఎపుడు ఎవని కాళ్ళు పట్టుకుందామ, ఇంకా ఎన్ని కోట్లు, సీట్లు తెలంగాణని అడ్డం పెట్టుకొని సంపాదిద్దామా అనే! తల్లి తెలంగాణాల ఇంత దగుల్బాజిలు ఎట్లా పుట్టిన్రు? ఒకైపు పానాలకు తెగించే పిల్లలు, మరొక వైపు, తల్లిని అమ్ముకొనే తార్పుడు గాళ్ళు! …వర్ణించడానికి మాటలు వస్తలేవు! ఆడపడుచు పురందేశ్వరి కరీంనగర్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు అందరికి నచ్చ చెప్పిన్రు, అరే భై మన ఆడపిల్ల, ఏమి అనవద్దు అని! రెండో ఎస్సార్సీ అన్నా, రెండు తన్నినా నోర్మూసుకొండ్రి అని అన్ని పార్టీలకి చెప్పిన్రు, అందరు అన్నదమ్ముల్లెక్కనే సల్లంగా ఉన్నారు, కాని మా తుల ఉమక్క, ఇంకా మా ఆడోల్లు అడ్డం పోయి పోలీసోల్ల చేతిల దెబ్బలు తిన్నరు, అర్రెస్ట్ అయినరు.. ఒక ఆడపడుచు కోసం, కోస్త ఆంద్ర అక్క కోసం, అధిష్టానం మెప్పు కోసం, తెలంగాణా బతికిందా చచ్చిందా అని తెలుసు కోవడం కోసం ..తెలంగాణా ఆడ బిడ్డలు ఏమైనా పరవాలేదు! ఈ నీతి సూత్రం మన నాయకుల దగ్గర కాక ఇంకేక్కడన్నా ఇనిపిస్తాదే? ఇటు గులాబి రంగు కొట్లాడుతుంది, ఆటు అదే గులాబి రంగు అధికార పార్టీతో దోస్తాని చేస్తుంది..అన్న రాజేందర్, నారదాస్ ఎంతో సంతోషంగా ఆడపడుచును ఆదరిస్తారు. అన్నలు, మా అక్కలు పుట్టిన బిడ్డలను సంతల బెట్టి అమ్ముకున్తున్రు, జర ఇండ్లల్లకి పిలుచుకొని చీర , సారే పెట్టి తోలున్రి! పురందరేస్వరక్క కి ఎం పరవాలేదు, ఖాందాన్ అంతా పదవులు, పైసలు..దోసుక తిన్నది ఇంకా పది తరాలు , వంద తరాలు కాపాడతది ..ఫికర్ చేయకున్రి అన్నల్లార! మీ పార్టీలో కార్య కర్తలు ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంటే మీరు సరసాలు ఆడుకుంటూ సరదాగా గడిపితే, అది కూడా ఆరు వందల పానాలు కళ్ళ చూసిన కాంగ్రెస్ పార్టీ, చూసి కడుపు మండు తంది సార్లూ! మిమ్మల్ని చూసుకొని, ఇల్లు వాకిళ్ళు వదిలి, జెండాలు మోసి, తెలంగాణాని కావాలని తీరొక్క తీరల కొట్లాడే అన్నా తమ్ముళ్ళు, అక్కసేల్లెల్లు ఆగమాగం ఐతంరు…జర మంచిగా కనపడితే వాడికి మసి పూసి మారేడుకాయ చేసి..మీ రాజ్యంలా ఒక సీటు ఇస్తామని మీ వైపుకు మల్లించక పోతున్రు, బయటున్నోడి గతి అడ్డమిద కూలి బతుకైంది..
నిన్న, మహానాడు! హైదరాబాద్ గడ్డ మీద , పచ్చ జెండాల సభా! బాబు గారు స్ప్పెచ్ దంచి కొట్టిండు..పాపం ఆయనకి ఇంకా ఆశ, ఒక్క సీతన్న రాబోయే ఎన్నికల్ల గెలుస్తామని, పానం దగ్గర బద్దోదిని ఏమనొద్దు, పాపం తలుగుతది అన్నా! తమ్ముడు మహేష్ ఫోన్ చేసి..ఆంధ్ర రాయల సీమ దొంగలు , గుండాలు, రెండొందల మీటర్లు ఈడ్చుకొని తన్నుకుంట పోయినరు అని గోస గోస పడుతుండు. మనకు అతి పెద్ద పార్టీ ఉండును, అడ్డుకొమ్మని చెవిలో చిన్నగా చెప్పి ఎగ దోయును..కాని పార్టీ శ్రేణులు, వేలకొలది కార్యకర్తలు ఎవరు రారు..అదే తెలంగాణా పిచ్చోళ్ళు ఆటు కొంత మంది, ఇటు కొంతమంది. ఈ గుండాల దిగుమతి కొత్తగా వచ్చింది..కొంపతీసి, ఆ మొన్న ఏసిన కమీన కమిటీల ఇట్లా కూడ చెయన్రి అని ఉన్నదా? అయినా..ఇక్కడ రెండు కళ్ళ బాబు కనుసన్నలలో మసిలే (అసలే మసలే…..) పెద్ద మనసులని ఇంకా ఎందుకు క్షమించాలె? పోలీసులతోటి కాదా, దొంగలా తోటి కొత్త సంస్కృతిని తెస్తున్న మన నాయకులకి ఏ పేరు పెట్టాలె..కిరాయికి అన్ద్రోల్లని తెచ్చుకొని నడిపించే మీటింగుల తోటి తెలంగాణా వస్తద? ఎవడి కోసం ఈ కొత్త నాటకాలు? (ఇట్లంటే మా శీను కి కోపం వస్తది, అన్నా, ఈడ కూడ నేను నాటకం అని డైరెక్ట్ గానే చెపుతున్నా) రాజీనామాలు చేస్తానన్న కాంగ్రెసోళ్ళు, సప్పుడు సేయకుండా ఉన్నరెంది? దీని మర్మమేంది ? భూస్తాపితం చేస్తా అన్నోళ్ళు ఇపుడు సినిమా పాటలు రాసుకుంట కూసున్రు ఏందీ?ఎటూ కూడ సప్పుడు లేదు, ఇపుడు అందరు చేసింరు కదా , నేను చేస్తా అని కమలం గుర్తు వాళ్ళు, సుష్మ స్వరాజ్ అనే మరొక ఆడ పడచుని తెచ్చి మీటింగ్ పెడతారంట, ఇదే కరిమ్నగర్ల, ఎంతైనా, ఇక్కడ మార్కెట్ మంచిగుంటది అందరికి…జాతరలే జాతరలు! ఎమాటకి ఆ మాటే చెప్పుకోవాలె, సిద్దాంతాలు ఎట్లా ఉన్న, జర పార్లమెంటుల లొల్లి చేసి, తెలంగాణా అని కమలం వాళ్ళు మాత్రం నిజాయితీగానే ఉన్నారు అనిపిస్తది..అయిన ఎం లాభం, పోతున్న వనరులని కాపాడండి సారూ అంటే..నో నో..ముందు తెలంగాణా అంటరు..ఏమి చెప్పుదు తండ్రి!
ఒక వైపు జగన్ వర్గం తెలంగాణాల విస్తరించే అవకాశాలు కనపడుతున్నై, మరో వైపు ఈ విష సంస్కృతీ..ఎవడు దీనిని అడ్డుకోవాలి, ఎట్లా రాబోయే తెలంగాణాని కాపాడుకోవాలి. మన పార్టీలు అని ఎవరికీ అన్నా బ్రమలు ఉంటె తొలగించు కొండ్రి తమ్ముళ్ళు, అన్నలు, పెద్దలు! కిరాయి గుండాలతోటి తన్నిపిస్తుంటే మన పెద్ద మనుషులు చూస్తూ ఉర్కుంటే ఎట్లా? రాబోయే మునిసిపల్ ఎన్నికలు, అ తరువాత పంచాయితీ ఎన్నికలు ..మల్లా బ్రేక్? లేక్పపోతే, రహులు పెళ్లి చూతము రారండ్రి అని పిలుపు వచ్చును, అపుడు మనం అందరం కొత్త బట్టలు కొని, అట్ల హస్తినకి పోయి షాపింగ్ చేసుకొని పెళ్లి చూసి వచ్చెదము…చివరికి, మా పిచ్చి తమ్ముళ్ళు, ఉద్యమ కారులు, జోహారులు, జోహారులు, అమరులకి జోహార్ల్! అని పాడుకుంటూ శేష జీవితం గడప వలెను.
మన నాయకులతోని పని చేయించ లేకపోతె , అది ఖచ్చితంగా మన పనే, ఇపుడు కాళోజి బాటలో నడవక పొతే, రేపు మన చావును మనమే రాసుకున్నట్టు అనుకోవాలి.
ఇదేమి రాజ్యమురన్నో!
రౌడి రాజ్యం, దొంగల రాజ్యం!
దోపిడీ రాజ్యం! అమాయక ప్రజలను ఆట పట్టించే యవ్వారం!
కళ్ళు తెరవండి!
జై తెలంగాణా!
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Ayomayam lo Azad and Co.
- Prajala chethila Telangana udyamam
- Samaikyandhra – oka portatam kadu, it is a poti
- Telangana in cross roads
- Deeksha viraminchandi – KCR
- Dhikkaristhunna Telangana – Deeksha Telangana
- Ningi ki egasina Telangana keratam
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- We need development of Telangana
- Telangana Amaraveerulu


Tweet This
Digg This
Save to delicious
Stumble it