Did CBN change his strategy on T?
News pulse, Politics | admin | May 19, 2011 at 7:30 pm
తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యూహాన్ని సిద్దం చేసుకుంటోంది. తెలుగుదేశం సీనియర్ నాయకుడు నాగం జనార్దనరెడ్డిని కౌంటర్ చేయడానికి ,తెలంగాణలో టిడిపిని నిలబెట్టుకోవడానికి తెలంగాణ తెలుగుదేశం ఫోరం విస్తృతస్థాయి సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు. ఇరవయ్యో తేదీన సాయంత్రం మూడు గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ఇరవైమూడోతేదీన ఫోరం తలపెట్టిన పాదయాత్ర తదితర అంశాలపై చర్చిస్తామని దయాకరరావు ప్రకటించారు.
తొలిసారిగా ఒక ప్రాంతానికి సంబందించిన అంశాలపై, అందులోను ప్రత్యేక తెలంగాణ కు సంబందించిన ఉద్యమంపై అదికారికంగా పార్టీ కార్యాలయంలోఈ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారంటే,పార్టీ వైఖరిలో మార్పు వచ్చిందని అనుకోవలా? అన్న తర్జనభర్జన జరుగుతోంది. తెలంగాణ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు ఇతర ముఖ్య నాయకులందరిని ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరారు.
కాగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడిన సందర్భంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని,తాము ఎప్పుడో కేంద్రానికి తమ అబిప్రాయాన్ని తెలియచేశామని అనడం కూడా ఆసక్తికరంగా ఉంది.ఎప్పుడూ రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లు అంటూ మాట్లాడే ఈయన మాటలలో కొంత తేడా కనిపించింది..చంద్రబాబు కూడా రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటనకు వెళుతున్నారు. సీతా దయాకరరెడ్డి నియోజకవర్గమైన దేవరకద్రకు ఆయన వెళుతున్నారు. మధ్యలో జడ్చర్లలో మార్కెట్ యార్డును సందర్శిస్తారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు పదే,పదే ఒక విషయాన్నిచెబుతున్నారు. తెలంగాణ పై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను తాము ఉపసంహరించుఉకోలేదని, చంద్రబాబు కూడా ఎప్పుడూ తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని అంటారు. అదే ప్రకారం చంద్రబాబు కూడా తాము ఎప్పుడో అబిప్రాయం తెలిపామని చెప్పడం ద్వారా తెలంగాణ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నామన్న సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారనిపించింది.అదే సమయంలో కోస్తా ,రాయలసీమలలో సెంటిమెంటు దెబ్బతినకుండా మాట్లాడారనిపిస్తుంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీని తెలంగాణ లో ప్రజలు ఆదరిస్తారా అన్నది ఇంకా సందేహాస్పదమే. ఎందుకంటే చంద్రబాబు ఇంకా క్లారిటీగా చెప్పాలన్నది తెలంగాణవాదుల డిమాండు.
Related posts:
- We will not contest from Banswada – TDP
- Prof. Kodandaram doubts center’s stand
- Nagam says he will support Jagan if…
- Jayashankar blessed me – Errabelli
- TDP all set for No-Trust move
- Jai Telangana in TDP’s Mahanadu
- Nara Lokesh into active politics
- Jagan’s money with Nagam Janardhan?
- Nagam nu veli veshnam
- Another MLA gives shock to CBN


Tweet This
Digg This
Save to delicious
Stumble it