Differences between Prof and KCR again?
News pulse, Politics | admin | May 25, 2011 at 3:56 pmతెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ కు , తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావుకు మధ్య మళ్లీ వైరం ముదిరిందన్న కధనాలు వస్తున్నాయి. ఇకపై తెలంగాణ జెఎసితో కలిసి పనిచేయకుండా సొంతంగా ఉద్యమం చేసుకోవాలని కెసిఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ జెఎసిపై కెసిఆర్ పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నారని కోదండరామ్ బాదపడుతున్నారు.
తెలంగాణ కోరుకునే వారందరిని ఒక తాటిపైకి తీసుకురావడానికి యత్నిసుంటే కెసిఆర్ వాటిని అంగీకరించడం లేదన్నది వారి వాదన. కొద్ది రోజుల క్రితం స్టీరింగ్ కమిటీ సమావేశంలో కెసిఆర్ వ్యవహరించిన తీరును కోదండరామ్ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అందువల్లనే కోదండరామ్ టిఆర్ఎస్ ప్రకటించిన ఏ ఆందోళనకు మద్దతుగా పిలుపు ఇవ్వలేదని తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి.తాజాగా తెలంగాణ విద్యార్ధి జెఎసి, టిఆర్ఎస్ ల సంయుక్త సమావేశాన్ని కోదండరామ్ రద్దుచేశారని,దీంతో కెసిఆర్ మండి పడుతున్నారని అంటున్నారు.
నగరంలోని విద్యార్ధి జెఎసిలతో కలిసి సుమారు ఇరవైవేలమంది విద్యార్ధులతో సమావేశం పెడతామని అంతకుముందు టిఆర్ఎస్ ప్రకటించింది.కాగా కోదండరామ్ తెలుగుదేశం నేత నాగం జనార్ధనరెడ్డికి మద్దతు ఇవ్వడంపై కెసిఆర్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.కాగా తెలంగాణ జెఎసితో సంబంధాలు తెంచుకోవాలన్న కెసిఆర్ నిర్ణయంపై వ్యాఖ్యానించడానికి కోదండరామ్ నిరాకరించారని ఒక ఆంగ్ల పత్రిక తెలిపింది. కాగా ఆయా పార్టీలలోజరుగుతున్న పరిణామాలను జెఎసి జాగ్రత్తగా గమనిస్తున్నదని, అందరిని కలుపుకుని ఉద్యమించవలసిన బాధ్యతు జెఎసిపై ఉందన్నారు.జెఎసి అధికారప్రతినిది విఠల్ మాత్రం టిర్ఎస్ ను తప్పుపట్టారు.జెఎసితో సంబందం లేకుండా టిఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలను ప్రకటించిందని విమర్శించారు.
మొత్తం మీద కోదండరామ్, కెసిఆర్ ల మధ్య కొంతకాలంగా బేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే కెసిఆర్ జెఎసితో సంబందం లేకుండా కార్యక్రమాలను చేసుకోవాలని భావిస్తున్నారు. మొత్తం మీద కెసిఆర్ కూడా జెఎసితో కటీఫ్ చేసుకుంటే మరి రాజకీయ జెఎసిలో రాజకీయ పార్టీలు లేనట్లే అవుతుందేమో.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Will Cong T politicians split?
- Prof. Kodandaram doubts center’s stand
- Nagam says he will support Jagan if…
- Jaipal Reddy to resign for T?
- KCR and Prof. Kodandaram compromise
- SKC is a luccha committee – Nagam
- Pocharam’s resignation accepted
- Kodandaram’s Delhi trips
- Telangana increment – KCR


Tweet This
Digg This
Save to delicious
Stumble it