Harikrishna argues with Yanamala, exits Mahanadu

News pulse, Politics | admin | May 28, 2011 at 8:39 am

తెలుగుదేశం పార్టీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మహానాడు మొదటి రోజు యూనివర్శిటీ విద్యార్థులతో చిన్నపాటి తగాదా చెలరేగగా, రెండోరోజు సొంతపార్టీనేత హరికృష్ణతో వివాదం మొదలైంది. ఇవాళ హరికృష్ణ,బాలకృష్ణ,చంద్రబాబునాయుడులు ముగ్గురు కలిసి కేక్‌ కట్‌ చేశారు. అయితే లోకేష్‌ చిత్రం కటౌట్‌లో ఉండి, హరికృష్ణది కానీ, జూనియర్ ఎన్టీఆర్‌ చిత్రం గానీ లేకపోవడంతో వివాదం రాజుకుంది.

నిన్నటి నుంచే అన్ని పరిశీలించిన హరికృష్ణ ఇవాళ టిడిపి మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడుతో గొడవ పడ్డారు. వారిమధ్య మాటలయుద్ధం ఏంటన్నది బయటకు తెలియనప్పటికీ ఖచ్చితంగా గొడవ జరిగిందన్నది అక్కడున్న నేతల సమాచారం. అలాగే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్‌ కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి, షూటింగ్‌లు కారణంగా మహానాడుకు హాజరుకాలేకపోతున్నట్లు ప్రకటించారు.

ఆయన రాకపోవడం, హరికృష్ణ ఇవాళ గొడవ చేయడం చూస్తుంటే టిడిపిలో నారా వెర్సస్‌ నందమూరిల మధ్య వివాదం ముదిరినట్లే కనిపిస్తోంది. అలాగే లోకేష్‌ కటౌట్లు ఉండి, జూనియర్ ఎన్టీఆర్ పోటో లేకపోవడం, చంద్రగిరి ఇన్‌ఛార్జ్‌గా లోకేష్‌ ను నియమిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా జరగడం విశేషం.

Related posts:

  1. Telangana thappademo?
  2. Tears rolled down KCR’s eyes
  3. TDP all set for No-Trust move
  4. Jai Telangana in TDP’s Mahanadu
  5. KK’s bheeshana keka
  6. Nagam’s SMS hulchal at Mahanadu
  7. CBN on T issue at Mahanadu – in vdo
  8. Nagam is in full demand
  9. How can I join hands with Jagan?
  10. Jayalalitha taking revenge on Karunanidhi

Leave a Reply

Spam protection by WP Captcha-Free