Jagan behind me, no no – Nagam
News pulse, Politics | admin | May 16, 2011 at 3:52 pm
రాజకీయ నేతలు ఎప్పటికప్పుడు తమకు ఇబ్బందికర విషయాలపై ఎదుటివారిపై నెట్టి వేస్తుంటారు.తెలుగుదేశం సీనియర్ నేత , నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ నాగం జనార్దనరెడ్డి కొద్ది రోజుల క్రితం తెలంగాణ అంశంలో చంద్రబాబు కన్నా జగన్ నే నమ్ముతారని ఆఫ్ ద రికార్డు వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యను కొన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అప్పటి నుంచి ఆయన దానిని ఖండించడానికి ఇబ్బంది పడుతున్నారు.
తాను ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో ఎంత నిఖారస్ గా పనిచేసింది ఆయన వివరిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి జగన్ కు తనకు సంబందం లేదని ఆయన చెప్పడానికి ఇదంతా సీమాంద్ర నేతల కుట్ర అని ఆరోపించారు. అయితే ఇటీవలికాలంలోనాగం జనార్దనరెడ్డిని తెలంగాణ కు చెందిన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ మాటకు వస్తే ఆయన జిల్లాలకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, దయాకరరెడ్డి వంటివారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.అయితే వారిని అంటే మళ్లీ విరుచుకుపడతారు.అది ఇబ్బందిగా ఉంటుంది.అలాకాకుండా సీమాంధ్ర నేతలపై నెట్టి వేస్తే గొడవ ఉండదని ఆయన భావించారు. వెంటనే ఆ మాట అనేశారు.
ఒక వేళ ఆ ప్రాంత నాయకులు ఎవరైనా ఖండిచినా పట్టించుకోనవసరం లేదున అదీ నాగం వ్యూహం.కాగా పరిగి సభ విషయంలో నాగం, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తమ పట్టును వీడలేదు. పార్టీ జెండా పెడితే ప్రజాసంఘాల వారు సభకు రారని ,అందువల్ల ఈసారికి పార్టీ జెండాతో సభను నడపాలని వారు కోరారు.చాలా సేపు అందుకు వ్యతిరేకంగా వాదించిన ఎమ్మెల్యేలు చివరికి వదలివేశారు.
Related posts:
- Nagam says he will support Jagan if…
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Nagam is in full demand
- Jagan’s money with Nagam Janardhan?
- Nagam nu veli veshnam
- Another MLA gives shock to CBN
- SKC is a luccha committee – Nagam
- Jagan towards BJP?
- Congress ku August bhayam
- Did Nagam get off the cycle?


Tweet This
Digg This
Save to delicious
Stumble it