Jagan gives shock to Ambati and Gone
News pulse, Politics | admin | May 26, 2011 at 2:31 pm
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గవర్నింగ్ కౌన్సిల్ లో వచ్చిన పేర్లుగాని, ఇతర పదవులలో వచ్చిన పేర్లుగాని పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు.కాకపోతే రెండు పేర్లు లేకపోవడం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లో ఇంతకాలంగా కీలకంగా ఉంటూ పార్టీ వ్యవహారాలపై గట్టిగా వాదిస్తూ వస్తున్న సీనియర్ నాయకులు అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావుల పేర్లు గవర్నింగ్ కౌన్సిల్ లో కనిపించలేదు. అంబటి రాంబాబు పేరు కేవలం అధికార ప్రతినిదిగా మాత్రమే ఉంది. గోనె ప్రకాశరావు పేరు అక్కడ కూడా లేదు.
దీనిపై గోనె ప్రకాశరావు ను అడిగితే తనకు ఆ విషయం తెలియదని అన్నారు.తాను ఎప్పుడూ పదవులు ఇవ్వవలసిందిగా ఎవరిని అడగలేదని పేర్కొన్నారు. గతంలో నిజామాబాద్ బాధ్యుడిగా వెళ్లమని కోరితే, పార్టీ ప్రయోజనాల రీత్యా వద్దని చెప్పానని, స్వచ్చందంగా పార్టీకి పనిచేస్తానని, పదవులతో పని లేదని అన్నానని ఆయన వివరించారు.అయితే పార్టీ పదవుల నియామకాలు ఎవరితో చర్చించి వేశారో తనకు తెలియదని, టీవీ చూసే తాను కూడా తెలుసుకున్నానని గోనె తెలిపారు.
కాగా అంబటి రాంబాబు అయితే జగన్ పక్షాన, వైఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన టీవీషోలలో చాలా గట్టిగా వాదిస్తూ ఉండేవారు.ఆయన పార్టీలో కీలకమైన బాద్యతలలో ఉంటారని అనుకున్నారు.కాని ఆశ్చర్యంగా ఆయన పేరు గవర్నింగ్ కౌన్సిల్ లో లేదు.జగన్ తో ఏదైనా తేడా వచ్చిందా లేక ఆయన అదికారప్రతినిదిగా సరిపోతారని అనుకున్నారో తెలియదు కాని ఆయన పేరు లేకపోవడం రాజకీయ వర్గాలలోఆశ్చర్యం కలిగిస్తోంది.దీనిపై గుంటూరు లో ఉన్న అంబటి రాంబాబును ప్రశ్నిస్తే, గవర్నింగ్ బాడీలో లేనంతమాత్రాన తన ప్రాధాన్యత తగ్గినట్లుకాదని, అధికార ప్రతినిధిగా పూర్తి న్యాయం చేయడమే తన ధర్మమని అన్నారు.
తనకు జగన్ కు మధ్య ఎలాంటి బేధాబిప్రాయాలు లేవని, దీనికి సంబందించి ఏమీ రాయకుండా ఉంటేనే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. తనలో అసంతృప్తి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.మొత్తం మీద గవర్నింగ్ కౌన్సిల్ నుంచి అంబటి ఔట్ అవడం ఒక విశేషం అయితే,గోనె ప్రకాశరావు ఎక్కడా లేకపోవడం ఒక డౌట్ ను మిగిల్చుతోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Related posts:
- Nagam says he will support Jagan if…
- Rebels already in YSR Cong
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- TDP challenges Jagan’s YSR Cong
- Jagan behind me, no no – Nagam
- Another MLA gives shock to CBN
- Balanaagi Reddy drama
- Jagan towards BJP?
- Congress ku August bhayam
- Why don’t they file case on Yashki?


Tweet This
Digg This
Save to delicious
Stumble it