Jagan’s loyalist Gone, dumps Jagan?

News pulse, Politics | admin | May 29, 2011 at 7:58 am

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీతో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు హానీమూన్ ముగిసిందా? ఇంతకాలం గోనె ప్రకాషరావు వైఎస్.ఆర్.కాంగ్రెస్ గట్టి మద్దతుదారుగా ఉన్నారు. జగన్ పై ఎవరు ఒక మాట అన్నా, రాజశేఖరరెడ్డిపై ఎవరు విమర్శలు చేసినా వదలిపెట్టరు. కాని ఆయనకు పార్టీలో ఎలాంటి హోదాను కల్పించకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

కొద్ది రోజుల క్రితం నాగం జనార్ధనరెడ్డికి గోనె ప్రకాషరావు కలిసిరావడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నాగం జనార్దనరెడ్డిని జగన్ వైపు తీసుకువస్తారని అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే నాగం ఒక ప్రకటన చేస్తూ జగన్ కనుక తెలంగాణ సై అంటే తను మద్దతు ఉంటుందని అన్నారు. అయితే ఇంతలో గోనె ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని, అలాకాకపోతే తాను నాగం జనార్ధనరెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పారు.

ఇదేమిటి నాగంతో గోనె స్నేహం చేయడమేమిటో అర్ధం కాదు. ఇంతకాలం తెలుగుదేశం నాయకుడిగా ఉన్న నాగంకి , వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ఉన్న గోనె ప్రకాషరావుకు లింక్ ఏమిటా అని రాజకీయవర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే గోనె నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు దూరం అవుతారా అన్న సందేహం ఉంది. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.

Related posts:

  1. KCR and Nagam at Cong deeksha
  2. Nagam says he will support Jagan if…
  3. Jagan gives shock to Ambati and Gone
  4. Nagam is in full demand
  5. How can I join hands with Jagan?
  6. Jagan’s money with Nagam Janardhan?
  7. Jagan behind me, no no – Nagam
  8. Jagan towards BJP?
  9. Congress ku August bhayam
  10. Why don’t they file case on Yashki?

Leave a Reply

Spam protection by WP Captcha-Free