Jagan’s money with Nagam Janardhan?
News pulse, Politics | admin | May 23, 2011 at 5:01 pmతెలుగుదేశం పార్టీలో దాడి,ప్రతిదాడి వ్యూహాత్మకంగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని సీనియర్ నాయకులు డాక్టర్ నాగం జనార్దనరెడ్డి, హరీశ్వర్ రెడ్డిలు ప్రయత్నిస్తుంటే, వారి దాడిని ఎదుర్కునేందుకు సరికొత్త ఆరోపణలు చేయడానికి టిడిపి శాసనసభ పక్ష ఉప నేత మోత్కుపల్లి నరసింహులు చేస్తున్నారు.
మమ్మల్నిందరిని బజారుకు ఈడ్చి, తెలంగాణలో మమ్మల్ని అపహాస్యం చేసే విదంగా నాగం జనార్దనరెడ్డి ఇంతకాలం చేశారు.ఆయనే ఇంతకాలంగా ఫోరం ఛైర్మన్ గా ఉన్నారు. మరి ఆయన ఏమి చేశారు. తెలంగాణకోసం ఎలాంటి త్యాగానికి సిద్దంగా ఉన్నాం,కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం. అన్ని పార్టీలను కోరుతున్నాం అందరూ కలిసి రండి,కేంద్రంపై ఒత్తిడి చేద్దాం , సోనియాగాందీ ఇంటివద్ద ధర్నా చేద్దాం, లేదా రాజీనామాలు చేద్దామంటున్నాం.
నాగం జనార్ధనరెడ్డి వ్యక్తిత్వం ఆలోచించాలి.ఆయన రాజకీయ స్వార్ధం కోసం ఎవరినైనా బలి చేయడానికి యత్నిస్తున్నారు. చెన్నారెడ్డి తెలంగాణ కోసం ఉద్యమం చేశారు.ఆ తర్వాత ఆయన దానిని అమ్ముకున్నారు. మరి ఆరోజు ఏమి చేశారు. తదుపరి తెలుగుదేశం పార్టీలో తొమ్మిదేళ్లు మంత్రి పదవి అనుభవించారు.కొద్దికాలం క్రితం వరకు పిఎసి ఛైర్మన్ గా ఉన్నారు.మరి అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేయలేదు.
అసలు వాస్తవం ఏమిటంటే నాగం జనార్ధనరెడ్డి, హరీశ్వర్ రెడ్డిలు జగన్ పార్టీ కి కోవర్టులు. నాగం జనార్దనరెడ్డి అయితే జగన్ వద్ద డబ్బు తీసుకుని తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలని, ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. దానిని మేము అడ్డుకుంటున్నాం.పార్టీని కాపాడుకుంటూనే తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం అని మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు.నాగంపై వేటు వేయాలని టిడిపి అనుకోవడం లేదని, కాని నాగం జనార్దనరెడ్డే తనపై వేటు పడేలా చేసుకుంటున్నారని నరసింహులు అన్నారు.
కాగా మరో నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ అన్ని పార్టీలు కలిసి జెండాలు పక్కనబెట్టి ఉద్యమంలోకి దిగితే అందుకు సిద్దమని ప్రకటించారు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Nagam says he will support Jagan if…
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Nagam’s SMS hulchal at Mahanadu
- Nagam is in full demand
- Nagam nu veli veshnam
- Jagan behind me, no no – Nagam
- Another MLA gives shock to CBN
- SKC is a luccha committee – Nagam
- Did Nagam get off the cycle?


Tweet This
Digg This
Save to delicious
Stumble it