Jai Telangana in TDP’s Mahanadu
News pulse, Politics | admin | May 29, 2011 at 9:10 am
తెలుగుదేశం మహానాడులో గతంలో ఎన్నడూ జరగని రీతిలో తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబల్లి దయాకరరావు గంభీరమైన తెలంగాణ ఉపన్యాసం చేశారు. తెలంగాణ జెండాను, తెలుగుదేశం జెండాను చెరో భుజాన వేసుకుని తిరుగుదాం అని , టిఆర్ఎస్ ను తరిమి కొడతామని ఆయన పిలుపు ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చారని, ఇతర ప్రాంతాల నాయకులు కూడా ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేదిక మీద నుంచి ఆయన తెలంగాణ అనుకూలంగా ప్రసంగం చేసినా, జై తెలంగాణ అని నినాదం చేసినా ఇతర ప్రాంతాలనాయకులు ఎవరూ కూడా అడ్డుకోలేదు. పూర్తిగా సమైక్యవాదిగా పేరొందిన ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేశవ్ వంటివారు కూడా అదే వేదిక పై ఉన్నారు. బహుశా తెలుగుదేశంలో ఇదొక కొత్త అనుభవం కిందే తెలుసుకోవాలి.
ఆ తర్వాత చేవెళ్ల ఎమ్మెల్యే రత్నం తన ప్రసంగంలో జై తెలుగుదేశం, జై తెలంగాణ అంటూ నినాదాలు ఇవ్వడం విశేషం.
Related posts:
- Telangana thappademo?
- L Rajagopal avatharaalu velladistha
- Nagam’s SMS hulchal at Mahanadu
- Harikrishna argues with Yanamala, exits Mahanadu
- Jagan’s money with Nagam Janardhan?
- Nagam nu veli veshnam
- Did CBN change his strategy on T?
- Another MLA gives shock to CBN
- Pocharam’s resignation accepted
- Telangana increment – KCR


Tweet This
Digg This
Save to delicious
Stumble it