Jaipal Reddy to resign for T?

News pulse, Politics | admin | May 28, 2011 at 10:33 pm


కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో భాగంగా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?జైపాల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఒక జాతీయ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. జైపాల్ రెడ్డిపై ఈ విషయంలో బాగా ఒత్తిడి వస్తోందని, అంతేకాక రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు.

అయితే వచ్చే కొద్ది రోజులలో ఆయన ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీచేయబోనని ఆయన ఇప్పటికే ప్రకటించారని,అందువల్ల ఈలోగానే తెలంగాణాను వాస్తవికతగా మార్చాలని ఆయన కూడా అభిలషిస్తున్నారని అంటున్నారు.అయితే ఇప్పుడున్న పరిస్థితులలో జైపాల్ రెడ్డి వంటి ప్రముఖ నాయకుడు ఆ రకమైన తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే గాని సాధ్యంకాదని తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

జైపాల్ రెడ్డి కనుక ఆ నిర్ణయానికి వస్తే , రాష్ట్రంలోని తెలంగాణ మంత్రులపై కూడా ఒత్తిడి వస్తుందని , తద్వారా తెలంగాణ సాధన సాధ్యమవుతుందని వారు వాదిస్తున్నారు. మంత్రి జానారెడ్డి, పిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్, లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు కె.కేశవరావు మరికొందరు ఎమ్.పిలు ఈ విషయమై జైపాల్ తో చర్చలు జరిపి , ఆయనను ఒప్పించగలిగారని ప్రచారం జరుగుతోంది.

జైపాల్ ఈ రకమైన అబిప్రాయానికి రావడానికి మరో కారణం కూడా చెబుతున్నారు వై.ఎస్.జగన్ తెలంగాణలో తన పార్టీకి గట్టి పట్టు తెచ్చుకోవడానికి యత్నిస్తున్నారు.ఇందులో భాగంగా ఆయన రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు.దీన్ని ఎదుర్కోవడానికి కూడా జైపాల్ రెడ్డి తెలంగాణ పై ఇలాంటి నిర్ణయం తీసుకోనవసరం ఉందని అంటున్నారు.

కాగా కేంద్రంలో పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి, తనకు సంబంధం లేకుండా పెట్రోల్ ధరలను పెంచిన తీరుపై కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.జైపాల్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నకోర్కె ఉన్నప్పటికీ, ఆయన బయటపడడానికి ఇబ్బంది పడ్డారు.అయితే ఇప్పుడున్నపరిస్థితిలో తెలంగాణ కు అనుకూలంగా రాజీనామా చేస్త అది మొత్తం రాజకీయాలను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

అయితే కేంద్రమంత్రి సన్నిహితులు కొందరి వాదన మరో రకంగా ఉంది.కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినంతమాత్రాన తెలంగాణ వచ్చేస్తుందా అన్న సంశయం ఉందని, తొందరపడి రాజీనామా చేస్తే అన్నివిధాల నష్టపోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారట.కాగా జైపాల్ ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, తొందరపడరని అంటున్నారు. మొత్తంమీద ఆంగ్ల పత్రిక కధనం మాత్రం రాజకీయ వర్గాలలో కలకలం సృష్టిస్తుంది.

Related posts:

  1. Harish Rao fires on Subbarami and Renuka
  2. Will Cong T politicians split?
  3. Telangana politicians who did not resign, listing
  4. I dare Nagendar, Mukesh to come out of Hyd
  5. Nagam says he will support Jagan if…
  6. Differences between Prof and KCR again?
  7. T supporters pull mike from Revanth Reddy
  8. Sonia sets deadline for CM, Kiran?
  9. What did the Governor tell the center?
  10. Jupally starts his Telangana yatra

Leave a Reply

Spam protection by WP Captcha-Free