Jayasudha avoiding Jagan’s party?

News pulse, Politics | admin | May 24, 2011 at 3:09 pm

ప్రముఖ సినీ నటి , సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ వైఖరిపై మళ్లీ ఊహాగానాలు వస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు వెళ్లిన జయసుద వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? లేక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు క్రమేపి దూరం అవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది.

కడప ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన జగన్ ను బహిరంగంగా అభినందించినట్లు ఎక్కడా కనిపించలేదు. కడప ఉప ఎన్నిక తర్వాత జగన్ గుంటూరులో చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి పదిహేడు మంది ఎమ్మెల్యేలు హాజరైనా జయసుధ మాత్రం వెళ్లలేదు. కొంతకాలం క్రితం శాసనసభలో ఫీజుల రియింబర్స్ మెంట్ అంశంపై జగన్ కు మద్దతుగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి ప్లకార్డులు పట్టుకున్నారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈమెను పిలిచి చర్చించారు. ఆ తర్వాత నుంచి జయసుధ కాస్త దూరం అవుతూ వచ్చారని అంటున్నారు.కాగా హైదరాబాద్ మేయర్ కార్తీక్ రెడ్డి కి , ఈమెకు మద్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ నేపద్యంలో కూడా ప్రభుత్వ మద్దతు లేకపోతే తన రాజకీయ మనుగడ కష్టమని భావించి జగన్ కు దూరం అవుతున్నారా అన్న మీమాంస కూడా ఉంది.

రాజధాని నగరంలో జగన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన ఏకైక ఎమ్మెల్యే జయసుధ. ఆమె కూడా ఇప్పుడు ఎందుకైనా మంచిదని మౌనం దాల్చారో లేక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు దూరం అయ్యారో కాని, ఇటీవలి కాలంలో జగన్ కార్యకలాపాలలో ఎక్కడ కనిపించకపోవడం మాత్రం వాస్తవం.

Related posts:

  1. Chances of Chiranjeevi to be CM?
  2. Nagam says he will support Jagan if…
  3. Jagan’s loyalist Gone, dumps Jagan?
  4. Superstar Krishna into YSR cong?
  5. Jagan gives shock to Ambati and Gone
  6. Sonia sets deadline for CM, Kiran?
  7. Who are Jagan’s coverts in cabinet?
  8. Jagan towards BJP?
  9. YSR Congress buying fans
  10. Congress ku August bhayam

Leave a Reply

Spam protection by WP Captcha-Free