KCR and Prof. Kodandaram compromise

News pulse, Politics | admin | May 16, 2011 at 7:47 pm


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు, తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ కు గత కొంతకాలంగా బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలసి కూర్చోవడం కూడా తక్కువైంది.పైగా తెలంగాణ రాష్ట్రసమితి, తెలంగాణ జెఎసి వేర్వేరుగా తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ప్రకటించాయి. దీనితో తెలంగాణ ఉద్యమాకారులలో కాస్త అయోమయం ఏర్పడింది.

ప్రత్యేకించి మిలియన్ మార్చి కార్యక్రమాన్ని కెసిఆర్ వాయిదా వేయమని కోరడం, దానికి జెఎసి ఒప్పుకోకపోవడం నుంచి విబేధాలు ఆరంభమయ్యాయి. అంతేకాక గద్దర్ వంటి నేతలకు కోదండరామ్ దగ్గరవుతున్నారని కూడా కెసిఆర్ భావించి కాస్త అసంతృప్తి చెందారు. అయితే వీరిద్దరి మద్య నెలకొన్న విబేధాలు ఉద్యమంపై ప్రభావం చూపుతాయని పలువురు భావించారు. దాంతో టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ రాయబారం చేసి వీరిమద్య రాజీ కుదిర్చినట్లు కధనాలు వస్తున్నాయి.

ఆ రాజీ తర్వాత రెండు రోజుల క్రితం తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానికి కెసిఆర్ ఆకస్మికంగా హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు. నిజానికి అప్పటికే టిఆర్ఎస్ సొంతంగా ఉద్యమ తేదీలను ప్రకటించింది. అయితే కెసిఆర్ హాజరైన తర్వాత టిఆర్ఎస్, బిజెపిలు చేసే ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు కోదండరామ్ ప్రకటించారు. అదీ విషయం.

Related posts:

  1. KCR and Nagam at Cong deeksha
  2. Prof. Kodandaram doubts center’s stand
  3. Jai Telangana in TDP’s Mahanadu
  4. Differences between Prof and KCR again?
  5. What did the Governor tell the center?
  6. SKC is a luccha committee – Nagam
  7. Harish Rao gets importance?
  8. Kodandaram’s Delhi trips
  9. Did Nagam get off the cycle?
  10. Telangana increment – KCR

Leave a Reply

Spam protection by WP Captcha-Free